Tuesday, April 19, 2016

శెనగపప్పు అప్పలు

కావలసిన పదార్ధాలు :
బియ్యంపిండి : 1 కేజీ
నూనె : 1/2కేజీ
పచ్చి సెనగపప్పు : 150  గ్రాములు
పెసరపప్పు : 100  గ్రాములు
కరివేపాకు : 1 కట్ట (చిన్నగా కట్ చేయాలి)
కొత్తిమిర : 1 కట్ట (కట్  చేసినది)
పచ్చిమిర్చి: 2  టేబుల్ స్పూన్లు
ఉప్పు : సరిపడ
తయారు చేయు విధానం :(How To Make Rice Flour Papadas)
* ముందుగ పప్పులు రెండు గంటల ముందు నానపెట్టాలి.
* తరువాత బియ్యపు పిండిలో నానపెట్టిన పప్పులు, కొత్తిమిర, మిర్చి ముద్ద, కరివేపాకు, ఉప్పు,వంటసోడా వేసి, కొద్దిగా నీళ్లుపోసి ముద్దగా కలిపి పక్కన పెట్టాలి.
* ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడిచెయ్యాలి.
* నూనె కాగిన తరువాత, పిండిని కొంచెం తీసుకోని ఉండలు చేసి చిన్న పాలితిన్ కవరు మీద అప్పడంలా చేసి కాగే నూనెలో వెయ్యాలి. ఇవి దోరగా వేగాక తీసి ప్లేటులో పెట్టాలి.