Pages

Recipes

Lard Venkateswara

తెలుగు వారి వంటలు

tupperware

Thursday, June 19, 2014

బజ్జీ మిర్చి ఫ్రై

బజ్జీ మిర్చి ఫ్రై

కావలసిన పదార్థాలు : 
బజ్జీ మిర్చీ - వంద గ్రాములు
 శనగపిండి - వంద గ్రాములు 
ఉల్లిపాయ -ఒకటి
 జీలకర్ర - ఒక టీస్పన్
 వామ - ఒక టీస్పన్
. ఉప్పు - తగినంత
 కరివేపాకు - నాలుగు రెమ్మలు
 కొత్తిమీర -చిన్న కట్ట 
నూనె - వేయించడానికి సరిపడా

 తయారు చేయువిధానం : 
ముందుగా బజ్జీ మిర్చి మిరపకాయలను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. 
వాటిని మధ్యలోకి చీరి పక్కన పెట్టుకోవాలి. 
తర్వాత ఉల్లిపాయలను, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా కట్ చేసుకోవాలి. 
శనగపిండిని దోరగా వేయించి దానిలో ఉల్లి, కొత్తిమీర, కరివేపాకు తరుగు, నీళ్ళు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి. 
ఈ మిశ్రమాన్ని మధ్యకి చీరుకున్న బజ్జీ మిర్చి కాయల్లో కూరాలి. 
తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత స్టఫ్ చేసిన మిరపకాయలను వేసి బజ్జీల్లాగో దోరగా వేయించుకోవాలి. 
ఇవి వేడి వేడి పప్పన్నంలోకి, విడిగా తిన్నా చాలా రుచిగా ఉంటాయి.
ఇవి వేడి వేడిగా విడిగా తిన్నా, పప్పన్నంలోకి సైడ్ డిష్ గా తిన్నా చాలా రుచిగా ఉంటాయి.  

No comments:

Post a Comment