Wednesday, November 18, 2015

కలబంద మొక్కలో త్రిమూర్తులు



సాధారణంగా 'కలబంద' మొక్కలు అడవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కొంతమంది ఇళ్లలో కూడా ఈ మొక్కలు కనిపిస్తుంటాయి. ఈ మొక్కలను ఇంట్లో పెంచకూడదని కొంతమంది అంటూ ఉంటారు. మరికొందరు ఆ మాటలను చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు కలబంద మొక్క మంచిదేనా ? దానిని ఇంట్లో పెంచడం వలన దోషం ఉంటుందా ? అనే సందేహాలు చాలామందికి కలుగుతుంటాయి.

అయితే కలబంద మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చనీ, దానివలన ఉపయోగాలే తప్ప నష్టాలైతే లేవని ఇటు ఆధ్యాత్మిక గ్రంధాలు ... అటు ఆయుర్వేద వైద్య శాస్త్రాలు చెబుతున్నాయి. కలబంద మొక్కలో త్రిమూర్తులు ఉంటారనీ ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతూ ఉంటే, అనేక రకాల వ్యాధులను నివారించడంలో అది ప్రముఖ పాత్రను పోషిస్తుందని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది.

ఇక కలబంద మొక్క ఉన్న ఇంటి ఆవరణలోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. ఎలాంటి దుష్ట శక్తులకి సంబంధించిన మత్రప్రయోగాలనైనా కలబంద మొక్క నిర్వీర్యం చేస్తుందని చెప్పబడుతోంది. ఇక దిష్టి ప్రభావానికి గురికాకుండా ఇది ఇంటిని కాపాడుతూ ఉంటుంది. కనుక కలబంద ఇంటి ఆవరణలో ఉండకూడదనేది కేవలం అపోహగానే భావించాలి. ఇటు ఆధ్యాత్మిక పరంగాను ... అటు ఆరోగ్య పరంగాను తులసి మొక్కలానే కలబంద కూడా మానవాళికి మహోపకారం చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మట్టి లేకుండానే మొక్కలు...కోకోపీట్‌. దీంతో మీరు మట్టి లేకుండానే మొక్కలు పెంచొచ్చు. నమ్మలేకపోతున్నారా, ఇది చదవండి.

కోకోపీట్‌ను తయారుచేసేప్పుడే స్టెరిలైజ్‌ చేస్తారు, వేపను వాడతారుగనుక మొక్కలకు చీడపీడలు రావు, పురుగులు పట్టవు. మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్లు దీనిలో ఉండవు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్‌ మైదానాల నిర్మాణం, పుట్టగొడుగుల పెంపకం, వానపాముల పెంపకం, పౌల్ట్రీ పరిశ్రమ, గ్రీన్‌హౌస్‌లు, వాణిజ్యనిర్మాణాలు, గులాబీల సాగులో కోకోపీట్‌ చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కోకోపీట్‌ వేసిన కుండీల్లో విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. ఇంట్లో పెంచే పువ్వులు, కూరగాయల సాగులో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. సెల్యులోజ్‌ ఎక్కువగా ఉంటుంది కనుక దీనిలో పుట్టగొడుగులు బాగా పెరుగుతాయి. 
coco peat block కోసం చిత్ర ఫలితం
1. కోకోపీట్‌ దిమ్మను తీసుకుని సుత్తి లేదా స్కూడ్రైవర్‌ ఉపయోగించి బలం ప్రదర్శిస్తే అది రెండు పొరలుగా విడిపోతుంది.
2. అరబకెట్‌ నీటిలో ఒక పొరను పదినిమిషాల సేపు నానబెట్టాలి.
3. కుండీలో కొంత కోకోపీట్‌ను వేసి దాన్ని చేత్తో చదును చెయ్యాలి.
4. నర్సరీ నుంచి తెచ్చిన మొక్కకు ఉన్న మట్టిలో కొంత భాగాన్ని తొలగించి కుండీలో నాటుకోవాలి.
5. కోకోపీట్‌ను ఒకొక్క పొరగా నింపాలి.
6. మూడు నెలల్లో వేరు బలం పుంజుకుంటుంది, మొక్క ఏపుగా ఎదుగుతుంది.
7. ప్రతిరోజూ నీళ్లు పోయనవసరం లేదు, ఎరువులేమీ వెయ్యాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా మట్టిని మార్చనవసరమూ లేదు.
8. జీరో పర్సంట్‌ మెయింటెనెన్స్‌.

డిమాండ్ ఎందుకంటే...
 తక్కువ స్థలం ఉండే అపార్ట్‌మెంట్లలో మట్టితో పని లేకుండా పాటింగ్ మిక్స్‌తో మొక్కలు పెంచవచ్చు. మార్బుల్, ఖరీదైన ఫ్లోరింగ్‌పై ఎలాంటి మరకలు పడకపోవడంతో ఈ మిక్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మట్టితో పోలిస్తే ఇది ఐదు రెట్లు తేలికగా కూడా ఉంటుంది. దీంతో కుండీలను ఒక చోటు నుంచి మరో చోటికి తరలించడం సులభమవుతుంది. అందుకే పాటింగ్‌మిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇక్రిశాట్‌లో జొన్నపంట కోసం పాంటింగ్ మిక్స్‌నే వాడుతున్నారు. డీఆర్‌డీవో, మోన్‌శాంటో, నేషనల్ పోలీసు అకాడమీ, గౌతమ్ మోడల్ స్కూల్స్ కూడా ఈ మిక్స్‌నే వాడుతున్నాయి. ఈ సాగు చేయాలనుకునేవారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సురభి ఎన్‌క్లేవ్‌లోని మహాగ్రో హార్టిటెక్‌ను సంప్రదించవచ్చు.
 
 ఏమిటీ పాటింగ్ మిక్స్!
 కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్ (మొక్కల వేళ్లకు గాలి బాగా అందేలా చేస్తుంది) మిశ్రమమే ఈ పాట్ మిక్స్. వారానికి ఒకసారి నీళ్లు పోస్తే చాలు. మొక్కలకు తెగుళ్లు వచ్చే అవకాశాలూ చాలా తక్కువ. ఎరువుల అవసరం కూడా ఉండదు. ఏడాదిన్నర తర్వాత మొక్క కుండీ పరిమితిని దాటి పెరుగుతుంది. అప్పుడు దానిని వేరే దానిలోకి మార్చుకుంటే సరిపోతుంది.


కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్
 వివిధ పాళ్లలో కలిపి వాటితో మొక్కలు పెంచాం.

Friday, November 6, 2015

‘ఇంటిపంట’లకు సప్త సూత్రాలు

ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన వివరిస్తున్నారు.
 
 జీవామృతం
జీవామృతం కోసం చిత్ర ఫలితం
 
కావలసిన పదార్థాలు: తాజా(పది రోజుల్లోపు) నాటు లేదా దేశీ ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచితం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, మగ్గిన అరటిపండ్లు 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము.

తయారీ విధానం: పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. డ్రమ్ములో వేసి చేతితో బాగా కలపాలి. తరువాత ఆవు పంచితం వేసి మళ్లీ కలపాలి. ఈ మిశ్రమాన్ని డ్రమ్ములో వేసి 35 లీటర్ల నీటిని పోయాలి. దీన్ని నీడలోనే ఉంచాలి. ఉదయం, సాయంత్రం వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి వైపు తిప్పుతూ కలపాలి. 4వ రోజు నుంచి వాడొచ్చు.

వాడే విధానం: 7-10 రోజుల్లోగా జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు లేదా పిచికారీ చేయొచ్చు.


 ఘన జీవామృతం


కావలసిన పదార్థాలు: తాజా ఆవు పేడ 2 కేజీలు, బెల్లం పావు కేజీ, ఏదైనా పప్పుల పిండి పావు కేజీ, ఆవు పంచితం తగినంత.
 తయారీ విధానం: తురిమిన బెల్లం, పిండి, ఆవుపేడ.. ఈ మూడిటిని బల్లపరుపుగా పరచిన ప్లాస్టిక్ షీట్ లేదా గోనెసంచిపై వేసి చేతితో బాగా కలిపి.. ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా తగినంత ఆవు పంచకం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టి, నీడలోనే ఆరబెట్టాలి. నీడలో పూర్తిగా ఎండిన ఈ ఉండల్ని పొడి చేసుకొని ఒక గోనె సంచిలో నిల్వ ఉంచి సంవత్సరమంతా వాడుకోవచ్చు.
 వాడే విధానం: ఘన జీవామృతాన్ని మొక్క మొదట్లో గుప్పెడు చొప్పున ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి వేసుకోవాలి. ఇందులో నిద్రావస్థలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు నీరు తగిలినప్పుడు చైతన్యవంతమవుతాయి. వీటి ద్వారా మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి.
 
 వేపకషాయం

కావలసిన పదార్థాలు: తాజా వేపాకులు అర కేజీ, తాజా దేశీ ఆవు పేడ అర కేజీ, నాటు ఆవు పంచితం అర లీటరు.

తయారీ విధానం:
 మెత్తగా నూరిన వేపాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు పంచితం చేతితో కలిపి, 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో
రోజున వస్త్రంతో వడబోసి వాడుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి 15 రోజులకోసారి పిచికారీ చేయాలి.


 కీటకాల నివారిణి (మల్టీ పెస్ట్ కంట్రోలర్)
కావలసిన పదార్థాలు:

పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు పంచితం(డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత.
 
తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు ఊరబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎంతపాతదైతే అంత ఉత్తమం.
 
ఎగ్ అమైనో ఆమ్లం

 కావలసిన పదార్థాలు: నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా (లీటరు ద్రవం పట్టేది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, (సేంద్రియ)బెల్లం పావు కేజీ.

 
తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం పోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచుకోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి కలపాలి. మళ్లీ పది రోజుల వరకు నీడలో భద్రపరచాలి. 28 రోజులకు సిద్ధమవుతుందన్నమాట.

పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో ఆమ్లంను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీలో

మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో ఆసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూసిన పూత రాలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది.
 
 బూడిద -  పసుపు మిశ్రమం
 కావలసిన పదార్థాలు: నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు  తయారీ పద్ధతి: పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. తగినంత బూడిద తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కలపాలి. తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది.

ఆచ్ఛాదన (మల్చింగ్)

కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన (మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఎండిన ఆకులు, గడ్డీగాదంతో 7 -10 అంగుళాల మందాన మల్చింగ్ చేయవచ్చు. దీనివల్ల కుండీల్లో మట్టి తేమను ఎక్కువ రోజులుంటుంది. వానపాములకు అనువైన వాతావరణం ఏర్పడి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. 

ఇంటిపంటకు చీడను తొలగించే సులభ చిట్కాలు .. సేంద్రియ పద్ధతులు

ఇంటి దగ్గరే పెరటి తోటల్లో మొక్కలు పెంచుకునే వారిని ఆ మొక్కలకు పట్టే చీడపీడలు సతమతం చేస్తుంటాయి. పోషకాలను సమతుల్యంగా అందించడంపై అవగాహన పెంచుకుంటే నిరుత్సాహపడాల్సినపని ఉండదు. సమస్య మూలాలు తెలుసుకుంటే.. ఆ సమస్యను నివారించుకోవడం లేదా అధిగమించడం సులభమవుతుంది...సజీవమైన మట్టిలో లెక్కలేనన్ని సూక్ష్మ జీవులుంటాయి. సూక్ష్మజీవులు ఎక్కువగాలంగా ఉన్న మట్టిలో మొక్కలు ఆరోగ్యంగా ఎదగడంతోపాటు చక్కటి దిగుబడులిస్తాయి. మొక్కలు చీడపీడలను తట్టుకుంటూ ఆరోగ్యంగా ఎదగడానికి సూక్ష్మపోషకాలు దోహదపడతాయి. మట్టి నుంచి మొక్క తీసుకునే సూక్ష్మ పోషకాలు సక్రమంగా అందకపోవడం వల్ల మొక్కలు బలహీనపడతాయి. బలహీనంగా ఉన్న మొక్కలకే పురుగులు, తెగుళ్లు సోకుతాయి. రసాయనిక ఎరువులు వాడితే గంధకంతోపాటు ఐరన్, జింక్ వంటి సూక్ష్మపోషకాల లోపాలు మొక్కల్లో అధికంగా కనిపిస్తాయి. విషరసాయనాలు చల్లితే.. అవి పురుగులతోపాటు ఉపయోగపడే కీటకాలను, ఇతర జీవులను కూడా అంతం చేస్తాయి. ఈ కారణం వల్లే మట్టిని సజీవంగా ఉంచడం ద్వారా పోషకాల సమతుల్యతకు దోహదపడేందుకుగాను కంపోస్టు, పశువుల పేడ తదితరాలతో అనేక సహజ ఉత్పత్తులను తరచూ వాడుతూ మొక్కలను కాపాడు కోవచ్చు. అప్పటికీ చీడపీడలు సోకితే ఇంట్లోనే వివిధ ద్రావణాలు, కషాయాలు తయారుచేసుకొని చల్లడం ద్వారా నివారించుకోవచ్చు కుండీలు, మడుల్లో ఆకుకూరలు, కూరగాయలను ఇంటి పట్టున పెంచుకునే వారు నిపుణుల తోడ్పాటుతో అవగాహనను పరిపుష్టం చేసుకుంటూ.. సేంద్రియ పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యదాయకమైన ఇంటి పంటలు పండించుకునే అవకాశం ఉంది.
ఉల్లిపాయ 1 మిరపకాయ 1 వెల్లుల్లి గడ్డ 1 కోసం చిత్ర ఫలితం



సేంద్రియ ఇంటిపంటలు సాగుచేసే వారు దృష్టిలో ఉంచుకోదగిన ముఖ్యవిషయం: చీడపీడల నివారణ కాదు నియంత్రణే ప్రధానం. మొక్కలను చీడపట్టిన తరువాత, తెగుళ్లు సోకిన తరువాత నివారణ చర్యలను చేపట్టడం కాకుండా.. మొక్కలు వేసింది మొదలు క్రమానుగతంగా నియంత్రణ చర్యలు చేపట్టాలి. 


‘జనరల్ పర్పస్ స్ప్రే' 
వెల్లుల్లి గడ్డ 1 కోసం చిత్ర ఫలితం
మిరపకాయ కోసం చిత్ర ఫలితంఉల్లిపాయ కోసం చిత్ర ఫలితం


‘జనరల్ పర్పస్ స్ప్రే' తయారీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ 1 మిరపకాయ 1 వెల్లుల్లి గడ్డ 1 ఈ మూడింటినీ మెత్తగా మిక్సీలో రుబ్బుకొని ఒక రాత్రంతా కొంచెం నీటిలో నానబెట్టుకోవాలి. వడకట్టి ద్రావణంలో 1:5 రెట్ల నీరు కలిపి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసే ముందు చిటికెడు సర్ఫ్ పొడి కలిపితే మొక్క ఆకులకు మందు అంటుకోవడానికి ఉపయోగపడుతుంది. 

సబ్బు నీరు
సబ్బు కోసం చిత్ర ఫలితం
సబ్బు నీరు: సబ్బు నీరు పిచికారీతో పచ్చదోమ, తెల్లదోమ, పాకుడు పురుగులు, పిండి నల్లి, ఆకు దొలిచే పురుగు, ఎర్రనల్లి వంటి వాటిని పారదోలవచ్చు. తయారీ విధానం: 30 గ్రాముల బార్ సబ్బును సన్నగా తురుము కోవాలి. (డిటర్జెంట్ కాదు) దీనిని లీటర్ నీటిలో కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక చెంచాడు వంట నూనె లేదా కిరసనాయిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి.

 వెల్లుల్లి రసం
వెల్లుల్లి గడ్డ 1 కోసం చిత్ర ఫలితం
 వెల్లుల్లి రసం: గొంగళి పురుగు, క్యాబేజీ ఫ్లై, దోమలు, నత్తలు ఇతర రకాల పాకుడు పురుగులను నాశనం చేస్తుంది. దీనికి తోడు ఆకు ముడత, ఆకు మచ్చలు, తేనే మంచు, బూడిద తెగులును నిరోధిస్తుంది. తయారీ విధానం: 90 గ్రాముల వెల్లుల్లి తీసుకొని మెత్తగా దంచాలి. దీనికి రెండు చెంచాల కిరోసిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని 600 మిల్లీ లీటర్ల నీటిలో నానబెట్టాలి. రెండు రోజుల తరువాత వడకట్టి 25 గ్రాముల సబ్బుపొడిని కలిపి పిచికారీ చేసుకోవాలి. 

వెల్లుల్లి-పచ్చిమిర్చి రసం
వెల్లుల్లి గడ్డ 1 కోసం చిత్ర ఫలితంమిరపకాయ కోసం చిత్ర ఫలితం
వెల్లుల్లి-పచ్చిమిర్చి రసం: ఇది వెల్లుల్లి రసం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుంది. తయారీ విధానం: 10 వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చి మిరపకాయలు, 3 ఓ మోస్తరు ఉల్లిపాయలు మెత్తగా రుబ్బుకొని మిశ్రమాన్ని లీటర్ నీటికి కలిపి మరిగించాలి. రెండు, మూడు పొంగుల తరువాత దించి చల్లారనివ్వాలి. వడపోసుకున్న ద్రావణాన్ని ఒక సీసాలో నిలువ చేసుకోవాలి. పిచికారీ మోతాదు: ఒక కప్పు ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి కలిపి ఒక షాంపూ ప్యాకెట్ లేదా కుంకుడు రసం లేదా పచ్చి పాలు కొంచెం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకు ముడత వచ్చిన మొక్కలకు వరుసగా వారం రోజుల పాటు పిచికారీ చేసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది. 


పచ్చిపాల ద్రావణం
milk కోసం చిత్ర ఫలితం
పచ్చిపాల ద్రావణం: పచ్చిపాల ద్రావణం బూడిద తెగులుపై బాగా పనిచేస్తుంది. పచ్చి పాలను రెట్టింపు నీటితో కలిపి పిచికారీ చేస్తే వైరస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రధానంగా మొజాయిక్ వైరస్‌పై ఇది బాగా పనిచేస్తుంది. 


పుల్ల మజ్జిగ
మజ్జిగ కోసం చిత్ర ఫలితం
పుల్ల మజ్జిగ: నాలుగైదు రోజులు పులియబెట్టాలి. ఈ పుల్ల మజ్జిగను ఒకటికి తొమ్మిది పాళ్లు నీరు కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. పుల్ల మజ్జిగ వివిధ కీటకాలను పారదోలడమే కాక వాటి గుడ్లను నశింపజేస్తుంది.

కీటకాల రసం
కీటకాల రసం కోసం చిత్ర ఫలితం
కీటకాల రసం: పంట మీద ఏదైనా పురుగు ఉధృతంగా కనిపిస్తుంటే.. ఆ పురుగులు కొన్నిటిని ఏరి రెండు కప్పుల నీరు కలిపి రుబ్బాలి. ఆ రసాన్ని లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేస్తే ఆ పురుగులు పారిపోతాయి.

దవనం ఆకుల కషాయం
దవనం కోసం చిత్ర ఫలితం
దవనం ఆకుల కషాయం: ఒక లీటర్ నీటిలో గుప్పెడు దవనం ఆకులను కలిపి మరిగించాలి. ఈ కషాయానికి రెట్టింపు నీరు చేర్చి పిచికారీ చేస్తే దోమ, పెంకు పురుగు, నత్తలు, క్యాబేజీ తొలిచే పురుగులు వైదొలగుతాయి. ఉప్పు నీళ్ల స్ప్రే: 60 గ్రాముల ఉప్పు, 2 చెంచాల సబ్బు పొడి, 4.5 లీటర్ల గోరు వెచ్చటి నీటిలో బాగా కలిపి వడకట్టుకోవాలి. ఈ ద్రావణం క్యాబేజీని తొలిచే పురుగులపై బాగా పనిచేస్తుంది. 

ఎప్సమ్ సాల్ట్

ఎప్సమ్ సాల్ట్: వైరస్ ఆశించిన మొక్కల ఆకులు పచ్చగా మారి బలహీన పడతాయి. మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 50 గ్రాముల ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్) నాలుగు లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పండుటీగ నిరోధక ద్రావణం: 15 లీటర్ల నీటిలో ఒక కిలో పంచదార వేసి కరిగించాలి. ఈ ద్రావణానికి ఒక లీటరు సముద్రపు నీరు లేదా సైంధవ లవణం కరిగించిన నీటితోపాటు.. ఒక లీటరు బెల్లం ద్రావణం లేదా డయటోమసియా ఎర్త్ లేదా పుట్టమన్నును కరిగించి.. వడకట్టి నీరు కలిపి పిచికారీ చేయాలి. పలుమార్లు పిచికారీ చేస్తే పండుటీగ హాని తొలగిపోతుంది.