Wednesday, November 18, 2015

మట్టి లేకుండానే మొక్కలు...కోకోపీట్‌. దీంతో మీరు మట్టి లేకుండానే మొక్కలు పెంచొచ్చు. నమ్మలేకపోతున్నారా, ఇది చదవండి.

కోకోపీట్‌ను తయారుచేసేప్పుడే స్టెరిలైజ్‌ చేస్తారు, వేపను వాడతారుగనుక మొక్కలకు చీడపీడలు రావు, పురుగులు పట్టవు. మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్లు దీనిలో ఉండవు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్‌ మైదానాల నిర్మాణం, పుట్టగొడుగుల పెంపకం, వానపాముల పెంపకం, పౌల్ట్రీ పరిశ్రమ, గ్రీన్‌హౌస్‌లు, వాణిజ్యనిర్మాణాలు, గులాబీల సాగులో కోకోపీట్‌ చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కోకోపీట్‌ వేసిన కుండీల్లో విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. ఇంట్లో పెంచే పువ్వులు, కూరగాయల సాగులో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. సెల్యులోజ్‌ ఎక్కువగా ఉంటుంది కనుక దీనిలో పుట్టగొడుగులు బాగా పెరుగుతాయి. 
coco peat block కోసం చిత్ర ఫలితం
1. కోకోపీట్‌ దిమ్మను తీసుకుని సుత్తి లేదా స్కూడ్రైవర్‌ ఉపయోగించి బలం ప్రదర్శిస్తే అది రెండు పొరలుగా విడిపోతుంది.
2. అరబకెట్‌ నీటిలో ఒక పొరను పదినిమిషాల సేపు నానబెట్టాలి.
3. కుండీలో కొంత కోకోపీట్‌ను వేసి దాన్ని చేత్తో చదును చెయ్యాలి.
4. నర్సరీ నుంచి తెచ్చిన మొక్కకు ఉన్న మట్టిలో కొంత భాగాన్ని తొలగించి కుండీలో నాటుకోవాలి.
5. కోకోపీట్‌ను ఒకొక్క పొరగా నింపాలి.
6. మూడు నెలల్లో వేరు బలం పుంజుకుంటుంది, మొక్క ఏపుగా ఎదుగుతుంది.
7. ప్రతిరోజూ నీళ్లు పోయనవసరం లేదు, ఎరువులేమీ వెయ్యాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా మట్టిని మార్చనవసరమూ లేదు.
8. జీరో పర్సంట్‌ మెయింటెనెన్స్‌.

డిమాండ్ ఎందుకంటే...
 తక్కువ స్థలం ఉండే అపార్ట్‌మెంట్లలో మట్టితో పని లేకుండా పాటింగ్ మిక్స్‌తో మొక్కలు పెంచవచ్చు. మార్బుల్, ఖరీదైన ఫ్లోరింగ్‌పై ఎలాంటి మరకలు పడకపోవడంతో ఈ మిక్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మట్టితో పోలిస్తే ఇది ఐదు రెట్లు తేలికగా కూడా ఉంటుంది. దీంతో కుండీలను ఒక చోటు నుంచి మరో చోటికి తరలించడం సులభమవుతుంది. అందుకే పాటింగ్‌మిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇక్రిశాట్‌లో జొన్నపంట కోసం పాంటింగ్ మిక్స్‌నే వాడుతున్నారు. డీఆర్‌డీవో, మోన్‌శాంటో, నేషనల్ పోలీసు అకాడమీ, గౌతమ్ మోడల్ స్కూల్స్ కూడా ఈ మిక్స్‌నే వాడుతున్నాయి. ఈ సాగు చేయాలనుకునేవారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సురభి ఎన్‌క్లేవ్‌లోని మహాగ్రో హార్టిటెక్‌ను సంప్రదించవచ్చు.
 
 ఏమిటీ పాటింగ్ మిక్స్!
 కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్ (మొక్కల వేళ్లకు గాలి బాగా అందేలా చేస్తుంది) మిశ్రమమే ఈ పాట్ మిక్స్. వారానికి ఒకసారి నీళ్లు పోస్తే చాలు. మొక్కలకు తెగుళ్లు వచ్చే అవకాశాలూ చాలా తక్కువ. ఎరువుల అవసరం కూడా ఉండదు. ఏడాదిన్నర తర్వాత మొక్క కుండీ పరిమితిని దాటి పెరుగుతుంది. అప్పుడు దానిని వేరే దానిలోకి మార్చుకుంటే సరిపోతుంది.


కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్
 వివిధ పాళ్లలో కలిపి వాటితో మొక్కలు పెంచాం.

No comments:

Post a Comment