Tuesday, September 8, 2015

క్యారెట్, బీట్‌రూట్ చెట్లు ఎందులో పెంచాలి..!!

మొక్కలు పెంచడం ఒక కళ. కొంత సమయాన్ని, మరికొంత పరిశ్రమనుజోడిస్తే ఆ కళలో నైపుణ్యాన్ని సాధించవచ్చు. ఇంటి ఆవరణలో చక్కటి తోటను పెంచవచ్చు. గార్డెన్‌ను చక్కగా మెయింటెయిన్ చేస్తే ఇల్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. తాజా గాలిని, పూల పరిమళాన్ని ఆస్వాదించవచ్చు.

రోజంతా ఎన్ని ఒత్తిడులకు లోనయినా అరగంట సమయం మొక్కల మధ్య తిరిగితే టెన్షన్ నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా ఇంట్లో పెరిగిన కూరగాయలతో తాజాగా, రుచికరమైన భోజనం కూడా చేయవచ్చు.

* ఇంటి ఆవరణలో ఏడాదిలో ఏ కాలంలోనైనా సూర్యరశ్మి, గాలి వెలుతురు ప్రసరించే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. గింజలు లేదా మొక్కలను సిద్ధం చేసుకోవాలి. నర్సరీ నుంచి మొక్కలను కొనడం కంటే మనమే గింజలు చల్లి నారు పెంచుకుంటే ఖర్చు తగ్గుతుంది. గింజలు చల్లాల్సిన సీజన్‌లో సాధ్యం కాకపోయినా, చల్లిన గింజలు సరిగా మొలవక పోతే అప్పుడు నేరుగా మొక్కలను తెచ్చుకోవచ్చు.

* మొక్కను నాటే ముందు చెట్టు వేర్లు భూమిలోకి చొచ్చుకుపోవడానికి వీలుగా, రాళ్లను తొలగించి మట్టిని గుల్లబరిచి, నేలను చదును చేయాలి. పై పొరలో ఆకులు, గడ్డి నింపాలి. ఇది నీరు ఎక్కువ - తక్కువల ప్రభావం మొక్కల మీద పడకుండా నిరోధిస్తుంది. ఈ పొర భూమిలోని అదనపు తేమను పీల్చుకుంటుంది. అలాగే నేల త్వరగా ఎండిపోకుండా కాపాడుతుంది.

* గింజలు చల్లిన నేలను నీటితో నింపకుండా, ప్రతిరోజూ కాస్త నీటిని చిలకరించినట్లు చల్లాలి. మొక్కల మొదళ్లకు మాత్రం నీటిని సరిపెట్టకుండా ఆకుల మీద కూడా చల్లాలి. అలాగే ఎండుటాకులు, మొక్కలకు హాని కలిగించే పురుగులను ఎప్పటికప్పుడు తొలగించాలి.

* క్యారెట్, బీట్‌రూట్ వంటి దుంపకూరలను లోతుగా ఉండే బాక్సుల్లో నాటాలి. పాలకూర, కొత్తిమీర వంటి ఆకు కూరలకు గింజలను టబ్‌లలో చల్లాలి.

* టొమాటో, బఠాణి, కీరదోస వంటి వాటికి నిలువుగా ఉన్న కంటెయినర్‌లను వాడాలి. తీగ జాతి చెట్లకు కాయలు కిందకు వేళ్లాడుతాయి. అవి నేలకు తగలకుండా ఉండడానికే ఈ ఏర్పాటు.

అలాంటి మొక్కలను ఇంట్లో పెంచకూడదట!

రబ్బరు మొక్కలు, పాలు కారే మొక్కలను ఇంట్లో ఉంచకండి. వీటిని ఇంట్లో పెంచితే అనారోగ్య సమస్యలతో పాటు మానసిక అశాంత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే పనిచేయని వస్తువులు.. పగిలిన గడియారాలు, టెలిఫోన్, రేడియో, మిక్సర్ వంటివి ఇంట్లో ఉంటే వాటిని వెంటనే తొలగించండి. ఇవి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. 

ప్రశాంతత కరువైందా? అయితే ఈ మొక్కలు పెంచండి!!

మనస్సులో తెలియని ఆలోచనలా.... అనుకున్న ఉద్యోగాలు దొరుకుట లేదా.... ఆర్థిక సమస్యలా.... ఆర్థిక పరంగా ఎదుగుదలలో ఏవైనా అడ్డంకులా.... ఇక దిగులుపడవలసిన అవసరం లేదు. అన్ని బాధలను మర్చిపోండి. మనస్సు ప్రశాంతత కోసం ఎన్నో ప్రయత్నాలు చేసివుంటారు. ఏ రకమైన బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ తగిన పరిష్కారపు మొక్కలు ఇంట్లో పెంచుకున్నట్టయితే మీ కష్టాలు తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుందంటున్నారు మన వాస్తు నిపుణులు చెప్తున్నారు.

'ప్లోరల్ వెల్ట్ ఆంట్ ది కిలే ష్టోర్ అధికారి ఇక్కడ క్రోటన్స్, ఒకే రోజా, పసుపు అరలీ, వాడామల్లి, అలమండా పువ్వు అనే రకరకాల చెట్లను పెంచడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టవచ్చునని వారు సూచిస్తున్నారు. ఒక్కో మొక్క ఒక్కో కష్టం తీర్చే శక్తిని కలిగివుంటుంది.

కొన్ని ఉదాహరణలు:
* క్రోటాన్స్ (Crotons)- చెడు ఆలోచనలను తరిమేస్తుంది.
Crotons కోసం చిత్ర ఫలితం
* నందివర్థిని- మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తుంది. 
* తులసి- భక్తిని పెంచుతుంది.
తులసి కోసం చిత్ర ఫలితం
* మందారం- ఉత్సాహకరమైన శక్తిని కలిగిస్తుంది.
మందారం కోసం చిత్ర ఫలితం
* వైట్ గనేరా (White Ghanera)- మనస్సు ప్రశాంతతను పొందుటకు సహాయపడును.

* రెడ్ గనేరా (Red Ghanera)- తప్పులను సరిచేయును.
Red Ghanera కోసం చిత్ర ఫలితం
* ఒపంటియా (opuntia)- కీర్తి, సంపదలను ప్రసాదించును.
opuntia కోసం చిత్ర ఫలితం
* పేపర్ పువ్వు (Bougainvillea)- భగవంతుని పూర్తి ఆదరణలను ఇచ్చును.
Bougainvillea కోసం చిత్ర ఫలితం
* ఆల్‌మందా ఫ్లవర్ (Alamonda flower) - అన్ని అడ్డంకులను తొలగించును. 
Alamonda flower కోసం చిత్ర ఫలితం
* మల్లి పువ్వు (Jasmine)- మరణ భయాన్ని తొలగిస్తుంది. 
మల్లి పువ్వు కోసం చిత్ర ఫలితం
* రోజా మొక్క (Rose)ను పెంచడం ద్వారా కోరుకున్న ఉద్యోగము లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Rose కోసం చిత్ర ఫలితం