Showing posts with label గారెలు. Show all posts
Showing posts with label గారెలు. Show all posts

Tuesday, July 1, 2014

పాకం గారెలు

పాకం గారెలు : 
Nutrition
:సోడియంప్రోటీన్లువిటమిన్ ఎకాల్షియం.
మినప్పప్పుపంచదారయాలకుల పొడి టీ స్పూన్నూనె తగినంత.

తయారు చేసే విధానం:  పాకం గారెలు తయారు చేయడానికి రెండు మూడు గంటలు ముందే మినప్పప్పు ను నానబెట్టి గ్రైండ్ చేసిపెట్టుకోవాలిఆ తరవాత ఒక స్టవ్ పై డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలిఆ లోపు ఇంకో స్టవ్ పై కప్పు పంచదార ,ఒక కప్పు నీళ్ళు వేసి పాకం తయారు చేసుకోవాలి.నూనె కాగాక గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు పిండిని గారెల్లా వత్తుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.తయారైన పాకంలో యాలకుల పొడి వేసి కలిపి ఫ్రై చేసుకున్న గారెలనుకూడా అందులో  వేసి నిమిషాలు ఉంచి తీసేయాలి. వేడి వేడి పాకం గారెలు రెడీ.

Sunday, June 29, 2014

తీపి గారెలు

తీపి గారెలు 
కావాల్సినపదార్థాలు: 
మినపప్పు- రెండు కప్పులు
బెల్లం తురుము- 11/2 కప్పులు
ఉప్పు - రుచికి తగినంత
మిరియాల పొడి - రుచికి కొద్దిగా
నీళ్ళు - రెండు కప్పులు
నూనె- గారెలు వేయించడానికి తగినంత
తయారుచేయువిధానం: 
మినప్పప్పుని నీటిలో వేసి రెండు గంటల పాటు నాననివ్వాలి. పప్పుని నీటిలో శుభ్రంగా
కడిగి, నీళ్ళు తక్కువగా వేసి గట్టిగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బెటప్పుడే రుచికి తగినంత
ఉప్పు వేసుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో బెల్లం తురుము, నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి తీగ
పాకం వచ్చే వరకూ మరగనివ్వాలి. కొద్దిగా మిరియాల పొడి వేసి, స్టవ్ మీద నుంచి దించి
చల్లారనివ్వాలి. బాణలిని స్టవ్ మీద పెట్టి గారెలు వేయించడానికి తగినంత నూనె వేయాలి.
చేతులు కొంచెం తడి చేసుకుని మినప్పిండిని నిమ్మకాయ సైజులో ఉండలు చేసి ప్లాస్టిక్
పేపర్ మీద కానీ, అరటి ఆకు ముక్కపై వుంచి గుండ్రంగా తట్టాలి. మధ్యలో చిన్న రంధ్రం
చేసి, మరుగుతున్న నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేగిన
గారెలను కాగాబెట్టి ఉంచుకున్న బెల్లం పాకంలో వేయాలి. రెండో వాయి గారెలు వేగిన
తరువాత పాకం గిన్నెలో ఉన్న గారెలను తీసి, వేరే పళ్ళెంలో విడి విడిగా పేర్చుకోవాలి.
అలా గారెలన్నింటినీ పాకంలో ముంచి తీసిన తర్వాత, మిగిలిన పాకాన్ని గారెల మీద వేసి,
సర్వ్ చేయండి. కరకరలాడే తీపి గారెలు రెడీ.

Thursday, June 5, 2014

మసాలా గారెలు

మసాలా గారెలు: ఉగాది స్పెషల్
కావలసిన పదార్ధాలు : 
మినప పప్పు : 1/2kg 
పచ్చిమిర్చి: 2-4 
కొత్తమీర తరుగు కొద్దిగా 
కరివేపాకు: కొద్దిగా 
జీలకర్ర: 1/4tsp 
అల్లం: కొద్దిగా 
మిరియాలు: 1tsp 
ఉల్లిపాయలు: 4-5 
ఉప్పు: రుచికి సరిపడ 
నూనె: వేయించడానికి సరిపడా 
వంటసోడ : చిటికెడు 

తయారు చేయు విధానం : 
1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.
 2. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగు, జీలకర్ర, మిరియాలపొడి, ఉప్పు మూడింటిని కొద్దిగా రుబ్బి, అలా వచ్చిన మిశ్రమాన్ని రుబ్బిన పప్పులో కలపాలి. 
3. తర్వాత స్టౌ వేలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, కాగనివ్వాలి. 
4. ఇప్పుడు పిండిలో వంటసోడా కలిపి, కొద్దికొద్దిగా పిండిని తడిచేసిన కాగితంపై గారెల రూపంలో వత్తి, కాగిన నూనెలో వెయ్యాలి. బాగా వేగాక ప్లేటులోకి తీసి చెట్నీతో తినటమే. అంతే మినపగారెలు రెడీ.

గారెలు

గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. 
ఉగాది స్పెషల్ మినప గారెలు
మరి ఈ వంటకాన్ని ఉగాది స్పెషల్ గా చేసుకుంటే కావలసిన పదార్ధాలు : 
మినప పప్పు : 1/2kg 
పచ్చిమిర్చి: 2
 అల్లం: కొద్దిగా
 మిరియాలు: 1tsp 
ఉల్లిపాయలు: 4-5 
ఉప్పు: రుచికి సరిపడ 
నూనె: వేయించడానికి సరిపడా
 వంటసోడ : చిటికెడు 

తయారు చేయు విధానం : 

1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.
 2. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, మిరియాలపొడి, ఉప్పు మూడింటిని కొద్దిగా రుబ్బి, అలా వచ్చిన మిశ్రమాన్ని రుబ్బిన పప్పులో కలపాలి.
 3. తర్వాత స్టౌ వేలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, కాగనివ్వాలి. 
4. ఇప్పుడు పిండిలో వంటసోడా కలిపి, కొద్దికొద్దిగా పిండిని తడిచేసిన కాగితంపై గారెల రూపంలో వత్తి, కాగిన నూనెలో వెయ్యాలి. బాగా వేగాక ప్లేటులోకి తీసి చెట్నీతో తినటమే. అంతే మినపగారెలు రెడీ
Read this post in English: