Thursday, June 5, 2014

మసాలా గారెలు

మసాలా గారెలు: ఉగాది స్పెషల్
కావలసిన పదార్ధాలు : 
మినప పప్పు : 1/2kg 
పచ్చిమిర్చి: 2-4 
కొత్తమీర తరుగు కొద్దిగా 
కరివేపాకు: కొద్దిగా 
జీలకర్ర: 1/4tsp 
అల్లం: కొద్దిగా 
మిరియాలు: 1tsp 
ఉల్లిపాయలు: 4-5 
ఉప్పు: రుచికి సరిపడ 
నూనె: వేయించడానికి సరిపడా 
వంటసోడ : చిటికెడు 

తయారు చేయు విధానం : 
1. మినపప్పును మూడు గంటల ముందుగా నానపెట్టాలి. నానిన పప్పును బాగా కడిగి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేట్టు రుబ్బాలి.
 2. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరుగు, జీలకర్ర, మిరియాలపొడి, ఉప్పు మూడింటిని కొద్దిగా రుబ్బి, అలా వచ్చిన మిశ్రమాన్ని రుబ్బిన పప్పులో కలపాలి. 
3. తర్వాత స్టౌ వేలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, కాగనివ్వాలి. 
4. ఇప్పుడు పిండిలో వంటసోడా కలిపి, కొద్దికొద్దిగా పిండిని తడిచేసిన కాగితంపై గారెల రూపంలో వత్తి, కాగిన నూనెలో వెయ్యాలి. బాగా వేగాక ప్లేటులోకి తీసి చెట్నీతో తినటమే. అంతే మినపగారెలు రెడీ.

No comments:

Post a Comment