Showing posts with label జ్యూస్. Show all posts
Showing posts with label జ్యూస్. Show all posts

Wednesday, July 16, 2014

కమలా లేక బత్తాయి జ్యూస్

కమలా లేక బత్తాయి జ్యూస్

         కమల లేక బత్తాయి రసం -1 లీటరు
         పంచదార -1 3/4 కే .జిలు
         నీరు - 1 1/4 లీటరు
        ఆరంజ్ ఎస్సెన్స్  లేక ఎమల్షన్ -4 టీస్పూనులు
        ఆరంజ్ రెడ్ కలర్ -1/2 స్పూను
       పొటాషియం మెటా బై సల్ఫేట్ లేక సోడియం బెంజాఎట్ - 3/4 టీస్పూను    

                  కమలా లేక బత్తాయి రసం తీసి వడకట్టి,పంచదార కరగనిచ్చి వడకట్టి చల్లారిన తర్వాత నిమ్మ ఉప్పు
లేక సిట్రిక్ యాసిడ్ ,ఆరంజ్ ఎస్సెన్స్ ,సోడియం బెంజాఎట్ ని సీసాలలో నింపుకోవాలి.1 లీటరు జ్యూస్ కి 5 సీసాలు
అవుతుంది.1 గ్లాసు రసంకి 3 గ్లాసులు చల్లటినీళ్ళు కలిపి సర్వ్ చెయ్యాలి.

బీట్‌రూట్- క్యారట్ జ్యూస్


 

కావలసినవి:
బీట్‌రూట్ జ్యూస్ - అర కప్పు
క్యారట్ జ్యూస్ - అర కప్పు
వెల్లుల్లి - అర ముక్క (క్రష్ చేయాలి)
ఉప్పు - రుచికి తగినంత
నిమ్మరసం - అర టీ స్పూన్
పంచదార - చిటికెడు

తయారి: ఈ పదార్థాలన్నీ కలిపి మిక్సర్ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి. చల్లగా సేవించాలనుకునేవారు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ జ్యూస్ లో బీపీని వెంటనే సాధారణ స్థితికి తీసుకువస్తుంది.

కర్బూజ(పుచ్చకాయ)జ్యూస్

వేసవితాపాన్ని తీర్చే కర్బూజ(పుచ్చకాయ)జ్యూస్
కావలసిన పదార్థాలు: 
పుచ్చకాయ ముక్కలు: 2cups 
మిరియాల పొడి: 2tsp 
ఉప్పు: చిటికెడు 
తేనే: 1tsp 
పంచదార: 1tbsp 
పుదీనా ఆకులు : 3 
ఐస్‌ ముక్కలు: సరిపడినన్ని (ఇష్టమైతే వేసుకోవచ్చు)

 తయారు చేయు విధానం: 
1. మొదటగా మందాపాటి కవచం నుండి పుచ్చకాయ ముక్కలను వేరు చేసి కట్ చేసి పెట్టుకోవాలి. 
2. తర్వాత మిక్సీలో పుచ్చముక్కలు, పంచదార, మిరియాల పొడి, పుదీనా ఆకులు, ఉప్పు గ్రైండ్‌ చెయ్యాలి. 
3. దీన్ని అరగంట ఫ్రీజర్‌ లో పెట్టి తర్వాత బయటకు తీసి అందులో తేనె, కావలసినంత ఐస్ ముక్కలు వేసి, పుదీనా ఆకుతో గార్నిష్ గా అలంకరించి సర్వ్‌ చేయండి. ఎంత ఎండలో వచ్చిన వారైనా ఈ పానీయం తాగితే కూల్‌ కూల్‌ అయిపోతారు.

ఆరెంజ్-బనానా జ్యూస్

ఆరెంజ్-బనానా జ్యూస్ తో కూల్ సమ్మర్
కావలసిన పదార్థాలు: 
ఐస్ క్యూబ్స్: 4 
ఆరెంజ్ జ్యూస్: 2cups 
వెన్నతీసిన పాలు: 2cups 
అరటిపండ్లు: 4 
పంచదార: 2-3tbsp
 నిమ్మరసం: 1tsp 
తేనె: 4tsp 

తయారు చేయు విధానం: 
1. మొదటగా ఆరెంజ్ తొనలు తీసి ఆరెంజ్ జ్యూస్ ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. 
2. తర్వాత ఆరెంజ్ జ్యూస్, పాలు, అరటిపండ్ల ముక్కలను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. 
3. ఈ మిశ్రమానికి అర టీస్పూన్ నిమ్మరసం, పంచదార కలిపి ఒక పాత్రలో పోసి ఫ్రిజ్‌ లో ఉంచాలి. 
4. బాగా చల్లబడిన తరువాత తీసి జ్యూస్ గ్లాసులలో ఈ మిశ్రమాన్ని నింపి, పైన ఒక్కోదాంట్లో రెండు టీస్పూన్ల తేనెను కలిపి అతిథులకు సర్వ్ చేయాలి. అంతే ఆరెంజ్-బనానా జ్యూస్ రెడీ. అరటి, కమలాపండ్లతో తయారు చేసిన ఈ బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ కొత్త రుచితో అలరించటమేగాకుండా.. తక్షణ శక్తిని ఇస్తుంది. వేసవితాపాన్ని చల్లారుస్తుంది, వడదెబ్బనుంచి కాపాడుతుంది. హాట్‌ హాట్ సమ్మర్‌ ను, కూల్ కూల్‌ చేసేస్తుంది.

బొప్పాయి జ్యూస్


బొప్పాయి జ్యూస్ తయారి: 
బాగా పండిన బొప్పయి ముక్కలు ఒక కప్పు,
 ఆరెంజ్ జ్యూస్: ఒక కప్పు, 
నిమ్మరసం 3చెంచాలు, 
తేనె 1 చెంచా. 

ఈ పదార్థాలన్నింటిని జ్యూసర్ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి తర్వాత, సరిపడా నీళ్ళు పోసి, ఫ్రిజ్ లో పెట్టాలి. 10-15నిముషాల తర్వాత తీసుకోవాలి.

డ్రై ఫ్రూట్ జ్యూస్

డ్రై ఫ్రూట్ జ్యూస్

కావలసిన పదార్ధాలు : 

జీడిపప్పులు : అర కప్పు 
బాదం పప్పులు : అర కప్పు 
ఎండి  ద్రాక్ష : అర కప్పు 
పాలు : అర లీటరు 
పంచదార : కప్పు 
తేనే : రెండు టేబుల్ స్పూన్లు 

తయారుచేయు విధానం :

1) ముందురోజు రాత్రి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షా నీటిలో నానబెట్టాలి.
2) ఇప్పుడు జ్యూస్ జార్లో నానపెట్టిన పప్పులు వేసి మిక్సి పట్టాలి.
3) ఇవి మెత్తగా అయ్యిన తరువాత పాలు, పంచదార వేసి ఒకసారి మిక్సి పట్టాలి.
4) ఇప్పుడు తయారయిన జ్యూస్ ని  గ్లాస్ లోకి పోసి తేనే, నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసి అతిధులకు అందించటమే.


* వేసవిలో తాగటానికి చల్లచల్లని డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడి. 

Friday, July 4, 2014

బార్లీ షర్బత్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • బార్లీ. 2 టీస్పూ//
  • నీళ్ళు. 2 కప్పుల నీళ్ళు
  • రుచి కోసమై నిమ్మకాయ రసము/తేనె /పంచదార

తయారీ విధానం

ముందుగా పావు కప్పు (అనగా రెండు ఔన్సులు) బార్లీని , కొంచెము చల్ల నీళ్ళలోనే బాగా కలిపి ఉంచుకోవాలి.
ఆ తర్వాత, బాగా తెర్లే నీళ్ళలో ఆ బార్లీ పిండి గుజ్జును బాగా కలపాలి.(మరిగే నీళ్ళలోకలిసి పోయేలా,గరిటతో కలియ త్రిప్పుతూ ). ఇలాగ చేయక పోతే, పిండి ఉండలు కడుతుంది.
తేనెను కానీ, చక్కెరను గానీ, జాగరీని గానీ రుచి కోసము వేసుకో వచ్చును.

ఆరెంజ్ స్క్వాష్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • అప్పుడే తీసిన కమలారసం – 500 గ్రా//
  • నీళ్ళు - 300 గ్రా//
  • చక్కెర – 400 గ్రా//
  • గోరువెచ్చని నీళ్ళు – 3 టీస్పూ//
  • పొటాషియం బై సల్ఫేట్ – 3 టీస్పూ//
  • సొడియం బెంజోయేట్ - చిటికెడు

తయారీ విధానం

నీళ్ళలో చక్కెరవేసి బాగా కరిగేవరకూ ఉంచాలి.
మిగుళ్ళు యేమీ ఉండకుండా ఒకసారి వడకట్టుకుంటే మంచిది
దీనికి చల్లారిన తర్వాత కమలారసాన్ని బాగా కలుపుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి
గోరువెచ్చటి నీటిలో పొటాషియం బై సల్ఫేట్ , సొడియం బెంజోయేట్ కరిగించి, స్క్వాష్ సిరప్ కు కలపాలి.
మొత్తం మిశ్రమం బాగా కలిసేటట్టు చూసుకోవాలి.
ఈ సిరప్ గాలిదూరని బాటిల్ లో భద్రపరచుకొని, ఫ్రిడ్జులో పెట్టుకోవాలి.
ఒక గ్లాసు స్క్వాషు తయారీకి ఒక గ్లాసు నీటిలో రెండు స్పూనుల సిరప్ కలుపుకుంటే చాలు.
దీనికి ఐస్ ముక్కలు జోడించండి.

నిమ్మ స్క్వాష్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • నిమ్మకాయ రసం - 300 గ్రా//
  • చక్కెర - 600 గ్రా//
  • నీళ్ళు -300 గ్రా//
  • సిట్రిక్ ఆసిడ్ (ఆమ్లం) – ½ టీస్పూ//
  • నిమ్మ ఎసెన్సు - 1 టీస్పూ//

తయారీ విధానం

నీళ్ళలో చక్కెర, సిట్రిక్ ఆసిడ్ వేసి బాగా కరిగేవరకూ ఉంచాలి.
మిగుళ్ళు యేమీ ఉండకుండా ఒకసారి వడకట్టుకుంటే మంచిది.
దీనికి చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని కలుపుకోవాలి.
దీనికి కొంచం నిమ్మ ఎసెన్సు కలపాలి.
ఈ సిరప్ గాలిదూరని బాటిల్ లో భద్రపరచుకొని, ఫ్రిడ్జులో పెట్టుకోవాలి.
ఒక గ్లాసు స్క్వాషు తయారీకి ఒక గ్లాసు నీటిలో రెండు స్పూనుల సిరప్ కలుపుకుంటే చాలు.
దీనికి ఐస్ ముక్కలు జోడించండి.

జింజర్ షర్బత్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • అల్లం - 300గ్రా.
  • నిమ్మకాయలు - 10
  • పంచదార - 500గ్రా.
  • ఉప్పు - 1 టీస్పూ//

తయారీ విధానం

అల్లంను శుభ్రంగా కడిగి, తుడిచి కాస్త నీళ్ళు చల్లుతూ తొక్కాలి ((అంటే రోట్లో చితకకొట్టుకోవాలి, లేకపోతే మిక్సీలో కచ్చా-పచ్చగా చేసుకోవాలి).
ఇలా రెండుసార్లు నీళ్ళు చల్లుతూ తొక్కి, సుమారు ఒక అరకప్పు రసం దాకా పిండుకోవాలి.
రసంలో తొక్క లేకుండా వడకట్టుకోవాలి.
నిమ్మరసం తీసి పలుచని బట్టలో వడకట్టి ఉప్పు కలపండి.
ఒక పాత్రలో పంచదార మరియు అల్లపురసం కలిపి సన్నని సెగమీద లేతపాకం వచ్చేదాక ఉంచి దించి ఆరిన తరువాత నిమ్మరసం కలపండి. బాగా ఆరిన తరువాత సీసాల్లో నింపుకోవాలి.

ఆమ్ కా షరబత్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మామిడి రసం – ½ లీటరు
  • చక్కెర - 450 గ్రాములు
  • నీళ్ళు - 2 కప్పులు
  • పొటాషియం - చిటికెడు
  • ఎల్లో కలర్ - 1 టీస్పూ//

తయారీ విధానం

చక్కెరలో నీళ్ళు పోసి పొయ్యి మీద సన్నని సెగ మీద పెట్టాలి.
ఇది చిక్క పడిన తర్వాత ముందుగా తీసి ఉంచుకొన్న మామిడిరసం, ఎల్లోకలర్, పొటాషియం అన్నీ కలపాలి. సెగమీద కాసేపు ఉంచుకోవాలి
చల్లారిన తర్వాత శుభ్రమైన సీసాలో నింపుకోవాలి.