Thursday, November 13, 2014

సహజమైన రంగుతో ఊర మిరపకాయలు


పచ్చిమిర్చిలో విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే తినాలంటే కారం కాబట్టి తినలేం. ఆ కారాన్ని తగ్గించడానికి కొన్ని రుచులు కలుపుకొంటే పోషకాలతో పాటూ మిర్చి రుచిని కూడా ఆస్వాదించవచ్చు. పచ్చి మిరపకాయని ఎండబెట్టినా, వూరబెట్టినా దాని రంగూ, రుచీ పూర్తిగా మారిపోతాయి. సహజమైన రంగుతో తినాలంటే ఇలా చేసి చూడండి. పిండేసిన నిమ్మచెక్కలని పారేయకుండా ఒక జాడీలో వేసి అందులో కొద్దిగా ఉప్పు చల్లండి. అందులో బజ్జీలకు వాడే పచ్చిమిర్చిని, అక్కడక్కడా చిన్న గాట్లు పెట్టి దాన్లో వేయండి. ఓ వారం తరవాత తీస్తే ఉప్పూ, పులుపూ పీల్చుకుని తినడానికి బాగుంటాయి. వాటి రంగు కూడా మారదు. వీటిని సమోసాలతో తినొచ్చు. మరికొంచెం పులుపుగా తినాలి అనుకొనే వారు వెనిగర్‌లో నానబెట్టుకోవచ్చు. వీటిని కూడా పప్పన్నంతోనంజుకోవచ్చు. వెనిగర్‌లో కాస్త పంచదార కలుపుకొని పచ్చి మిర్చీలను నానబెట్టినా బాగుంటాయి. తియ్యగా, పుల్లగా మరో రకం రుచి.

No comments:

Post a Comment