
Free shipping any ware in India For best Deals on Tupperware Products, Dry fruits, Oriflame beauty products plz Contact email: somulakshmisaran@gmail.com
Showing posts with label ఒడియాలు. Show all posts
Showing posts with label ఒడియాలు. Show all posts
Tuesday, April 19, 2016
Thursday, November 13, 2014
సహజమైన రంగుతో ఊర మిరపకాయలు
పచ్చిమిర్చిలో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే తినాలంటే కారం కాబట్టి తినలేం. ఆ కారాన్ని తగ్గించడానికి కొన్ని రుచులు కలుపుకొంటే పోషకాలతో పాటూ మిర్చి రుచిని కూడా ఆస్వాదించవచ్చు. పచ్చి మిరపకాయని ఎండబెట్టినా, వూరబెట్టినా దాని రంగూ, రుచీ పూర్తిగా మారిపోతాయి. సహజమైన రంగుతో తినాలంటే ఇలా చేసి చూడండి. పిండేసిన నిమ్మచెక్కలని పారేయకుండా ఒక జాడీలో వేసి అందులో కొద్దిగా ఉప్పు చల్లండి. అందులో బజ్జీలకు వాడే పచ్చిమిర్చిని, అక్కడక్కడా చిన్న గాట్లు పెట్టి దాన్లో వేయండి. ఓ వారం తరవాత తీస్తే ఉప్పూ, పులుపూ పీల్చుకుని తినడానికి బాగుంటాయి. వాటి రంగు కూడా మారదు. వీటిని సమోసాలతో తినొచ్చు. మరికొంచెం పులుపుగా తినాలి అనుకొనే వారు వెనిగర్‌లో నానబెట్టుకోవచ్చు. వీటిని కూడా పప్పన్నంతోనంజుకోవచ్చు. వెనిగర్‌లో కాస్త పంచదార కలుపుకొని పచ్చి మిర్చీలను నానబెట్టినా బాగుంటాయి. తియ్యగా, పుల్లగా మరో రకం రుచి.
Friday, September 5, 2014
రేగు పండ్ల వడియాలు / రేగు వడియాలు
రేగుపండ్లు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 7-10 (కారాన్ని బట్టి), జీలకర్ర - 1 టేబుల్ స్పూన్,
ఉప్పు - తగినంత
తయారీ:
- ముందుగా రేగుపండ్లను శుభ్రంగా కడిగి, గాలికి ఆరబెట్టుకోవాలి.
- శుభ్రం చేసుకున్న ఈ రేగుపండ్లను రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి.(గింజతో సహా)
- దీనికి జీలకర్ర, ఉప్పు కూడా కలిపి దంచుకోవాలి.
- ఇలా దంచుకున్న దానిని పక్కకు పెట్టి, పచ్చిమిరపకాయలను కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీనికి ముందే దంచి పెట్టుకున్న రేగు పండ్ల మిశ్రమాన్నీ కలిపి, అన్ని కలిసేలా దంచుకోవాలి.(రోట్లో దంచితేనే మరింత రుచిగా ఉంటుంది.)
- వీటిని కవర్‌పై కానీ, ప్లేటులో కానీ వడియాలుగా పెట్టి, ఎండ పెట్టాలి. బాగా ఎండే వరకూ ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండిన వడియాలను గాలి చొరని డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తినొచ్చు. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల రేగుపండ్లు శీతాకాలంలోనే కాక తినాలనిపించినప్పుడల్లా తినడానికి వీలుగా ఉంటుంది. మరి మీరూ వెంటనే ఈ రేగుపండ్ల వడియాల్ని తయారు చేసుకోండి!
రేగు పండ్ల బెల్లం వడియాలు
రేగుపండ్లు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 7-10 (కారాన్ని బట్టి), బెల్లం - కప్పు, జీలకర్ర - 1 టేబుల్ స్పూన్,
ఉప్పు - తగినంత
తయారీ:
- ముందుగా రేగుపండ్లను శుభ్రంగా కడిగి, గాలికి ఆరబెట్టుకోవాలి.
- శుభ్రం చేసుకున్న ఈ రేగుపండ్లను రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి.(గింజతో సహా)
- దీనికి జీలకర్ర, బెల్లం, ఉప్పు కూడా కలిపి దంచుకోవాలి.
- ఇలా దంచుకున్న దానిని పక్కకు పెట్టి, పచ్చిమిరపకాయలను కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీనికి ముందే దంచి పెట్టుకున్న రేగు పండ్ల మిశ్రమాన్నీ కలిపి, అన్ని కలిసేలా దంచుకోవాలి.(రోట్లో దంచితేనే మరింత రుచిగా ఉంటుంది.)
- వీటిని కవర్‌పై కానీ, ప్లేటులో కానీ వడియాలుగా పెట్టి, ఎండ పెట్టాలి. బాగా ఎండే వరకూ ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండిన వడియాలను గాలి చొరని డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తినొచ్చు. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల రేగుపండ్లు శీతాకాలంలోనే కాక తినాలనిపించినప్పుడల్లా తినడానికి వీలుగా ఉంటుంది. మరి మీరూ వెంటనే ఈ రేగుపండ్ల వడియాల్ని తయారు చేసుకోండి!
అల్లం - సగ్గుబియ్యం వడియాలు;

కావలసినవి:
సగ్గుబియ్యం కేజీ ,
పచ్చిమిర్చి 50 గ్రా
, ఉప్పు సరిపడా ,
అల్లం 25 గ్రా ,
వాము, జీలకర్ర 2 స్పూనులు
తయారీ :
సగ్గుబియ్యాన్ని రాత్రి ఒక గ్లాసుకి ఐదు గ్లాసుల చొప్పున నిల్లు పోసి నాననివ్వాలి .
ప్రొద్దుటే పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలి.
తెల్లదనం పోయి సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు దీనికి పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు,వాము. జీలకర్ర ,అల్లం మిక్సీ వేసినది కలపాలి
.
ఉడికిన తరువాత దించి చల్లారాక ప్లాస్టిక్ పేపర్ మీద ఒక మాదిరి సైజులో వడియాలు పెట్టి ఎండనివ్వాలి.
రెండు రోజులు ఎండనిచ్చి నిల్వ ఉంచి అవసరమైనప్పుడు వేపుకోవాలి.
రైస్ టమాటతో...వడియాలు
రైస్ టమాటతో...
కావలసినవి
అన్నం-అరకిలో, టమాల-పావు కిలో, జీలకర్ర-వందగ్రా.
నువ్వులు-50గ్రా, పచ్చిమిర్చి-పావు కిలో, ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం
ముందుగా టమాట ముక్కల్ని, కొత్తిమీరని, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని, జీలకర్ర, ఉప్పుని వండిన అన్నంలో కలుపుకోవాలి. తరువాత బిళ్లలుగా చేత్తో వత్తుకుని ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత నూనెలో వేయించుకోవాలి.
కావలసినవి
అన్నం-అరకిలో, టమాల-పావు కిలో, జీలకర్ర-వందగ్రా.
నువ్వులు-50గ్రా, పచ్చిమిర్చి-పావు కిలో, ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం
ముందుగా టమాట ముక్కల్ని, కొత్తిమీరని, పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని, జీలకర్ర, ఉప్పుని వండిన అన్నంలో కలుపుకోవాలి. తరువాత బిళ్లలుగా చేత్తో వత్తుకుని ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత నూనెలో వేయించుకోవాలి.
బొంబాయిరవ్వతో...వడియాలు
బొంబాయిరవ్వతో...
కావలసినవి
బొంబాయిరవ్వ-పావుకిలో, నీళ్లు-అరలీటరు, నువ్వులు-50గ్రా
సగ్గుబియ్యం-50గ్రా, ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం
సగ్గుబియ్యాన్ని ఓ రాత్రంతా నీళ్లల్లో నానబెట్టుకోవాలి. మర్నాడు రవ్వ ఎన్ని గ్లాసులు ఉందో చూసుకుని, ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాస్‌ల చొప్పున నీళ్లు తీసుకుని స్టౌమీద పెట్టాలి.
నీళ్లు బాగా మసలేటప్పుడు రవ్వ, ఉప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలపాలి. మిశ్రమం చిక్కబడేవరకు ఉంచి దించేసుకోవాలి. చల్లారాక ఒక కవర్‌పై చెంచాతో బిళ్లల్లా వేసుకోవాలి. ఎండలో రెండు,మూడు రోజులుంచి ఎండిన తరువాత నూనెలో వేయించుకోవాలి.
పెసరపప్పుతో... వడియాలు
పెసరపప్పుతో...
కావలసినవి
పెసరపప్పు-పావుకేజి, గోరుచిక్కుడు కాయలు-పావుకేజి
పచ్చిమిర్చి-100గ్రా., జీలకర్ర, ఇంగువ-ఒక టీస్పూన్ ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం
రెండు గంటలు నానబెట్టిన పెసరపప్పులో పీచుతీసి ముక్కలు చేసుకున్న గోరుచిక్కుడు కాయలు వేసి బాగా రుబ్బుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముద్ద, ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకుని పాలిథిన్ పేపరు మీద చిన్నచిన్న ముద్దలుగా పెట్టుకోవాలి. బాగా ఎండిన తరువాత నూనెలో వేయించుకుంటే అన్నంలోకి, సాంబారులోకి నంజుకోవటానికి చాలా బాగుంటాయి.
సగ్గుబియ్యంతో...వడియాలు 3
కావలసినవి
సగ్గుబియ్యం-ఒక కప్పు, మంచినీళ్లు-4 కప్పులు
పచ్చిమిర్చి- 4, జీలకర్ర-కొద్దిగా
ఉప్పు-తగినంత, నువ్వులపప్పు-పావు కప్పు
తయారుచేసే విధానం
మందపాటి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. బాగా మరిగిన తరువాత సగ్గుబియ్యం పోసి మంట తగ్గించాలి. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఓ గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. సగ్గుబియ్యం పూర్తిగా కరిగిపోయినట్లుగా రంగు లేకుండా అయితే అవి ఉడికినట్లే. తరువాత పాత్రను కిందకి దించి దంచిన పచ్చిమిర్చి, ఉప్పు కలపాలి. జీలకర్ర నువ్వులు కూడా వేయాలి. కాస్త చిక్కగా గంజిలా ఉన్న దీన్ని చల్లారిన తరువాత ప్లాస్టిక్ కవర్‌మీద కావలసిన సైజులో పెట్టుకోవాలి.
ఇవి రెండు రోజుల్లో ఎండిపోతాయి. వేయించిన సగ్గుబియ్యం వడియాల్ని స్నాక్స్‌లా కూడా తినవచ్చు.
మినప పొట్టుతో వడియాలు
మినప పొట్టుతో
కావలసినవి
మినపప్పు-ఒక కప్పు,
మినప్పొట్టు- నాలుగు కప్పులు
ఇంగువ-కొద్దిగా,
ఉప్పు-తగినంత,
పచ్చిమిరపకాయలు-పది
తయారుచేసే విధానం
ముందుగా మినపప్పుని మెత్తగా రుబ్బాలి. తరువాత పొట్టు, ఉప్పు, పచ్చిమిర్చి ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు వేసి రుబ్బాలి. (మరీ మెత్తగా రుబ్బుకోకూడదు) మినప వడియాలు మాదిరిగానే ప్లాస్టిక్ కవర్‌మీద సరిపడా సైజులో పెట్టుకోవాలి. ఒకరోజులో ఆరిపోతాయి. వీటిని నూనెలో వేయించి వేడి వేడి అన్నంతో నేతిలో కలుపుకుని తింటే బాగుంటాయి.
బూడిద గుమ్మడితో...వడియాలు4
బూడిద గుమ్మడితో...
కావలసినవి
బూడిద గుమ్మడికాయ(చిన్నది)-1, పొట్టుమినపప్పు-అరకిలో, పచ్చిమిర్చి-50గ్రా.
ఉప్పు-తగినంత, ఇంగువపొడి-టీ స్పూన్
తయారుచేసే విధానం
బూడిద గుమ్మడికాయను బాగా కడిగి రాత్రిపూటే చిన్నచిన్న ముక్కలుగా కోసి కొంచెం ఉప్పువేసి ఓ బుట్టలో మూటగట్టి దానిమీద బరువైన రాయి లాంటిది పెట్టాలి. ఇలా చేయటం వల్ల ముక్కల్లోని నీరంతా కారిపోతుంది. మినపప్పు కూడా రాత్రే నానపెట్టాలి. ఉదయాన్నే మినపప్పు పొట్టుతీసి నీళ్లు తక్కువగా పోసి మెత్తగా రుబ్బాలి. మిర్చి, ఉప్పు, ఇంగువ మెత్తగా నూరి మినప్పిండిలో వేసి కలపాలి. తరువాత బూడిద గుమ్మడి ముక్కలు కూడా వేసి బాగా కలిపి కావలసిన సైజులో ప్లాస్టిక్ కవర్‌మీద పెట్టుకోవాలి. బాగా ఎండిన తరువాత వీటిని ఒలిచి తిరగవేసి మళ్లీ ఎండనివ్వాలి. వేయించిన తరువాత వీటిని అన్నంతో పాటే తింటే బాగుంటుంది.
బియ్యపు పిండి వడియాలు 3
కావలసినవి
బియ్యపు పిండి-ఒక పెద్దగ్లాసు,
నీరు- నాలుగు గ్లాసు
ఉప్పు- తగినంత,
జీలకర్ర-కొద్దిగా,
అల్లం, పచ్చిమిర్చి-కొద్దిగా
తయారుచేసే విధానం
ముందుగా పచ్చిమిర్చి, అల్లంను ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. పాత్రలో నాలుగుగ్లాసుల నీటిని పోసి బాగా మరగనివ్వాలి. నీళ్లు కెర్లుతుండగా అందులో పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉప్పు, జీలకర్రను వేసి కలపాలి. 5నిమిషాల తర్వాత పిండిని అందులో పోస్తూ పెద్ద గరిటెతో పిండి ఉండలు కట్టకుండా బాగా కలియతిప్పాలి. 10నిమిషాలు ఉడికించాక దించుకుని వేడిగా ఉన్నప్పుడే త్వరత్వరగా మీకు నచ్చిన సైజులో పెట్టుకోవాలి. పిండి కాస్త పలచగా ఉన్నప్పుడే పెడితే త్వరగా ఆరిపోతాయి. పిండి చల్లబడే కొద్దీ చిక్కబడిపోతుంది. అపుడు ఆరడం లేటవుతుంది. పప్పులోకి, సాంబారులోకి ఇవి చాలా బాగుంటాయి
Subscribe to:
Posts (Atom)