Saturday, August 30, 2014

మోహన్ ఖీర్

Picture
కావలసిన పదార్థాలు :
పన్నీర్ తురుము  -        2 కప్పులు
కోవా                   -        అర కప్పు
బాదం,పిస్తా,జీడిపప్పు, కిస్మిస్ -        అరకప్పు
యాలకుల పొడి     -          అరటీస్పూన్


పాకం కోసం :
పంచదార         -            4 కప్పులు
మంచి నీళ్ళు    -             4 కప్పులు
కుంకుమ పువ్వు -           కొద్దిగా 
యాలకులపొడి  -             అరటీస్పూన్

తయారుచేసే పద్ధతి :
  • నట్స్ అన్నింటినీ చిన్న ముక్కలుగా చేయాలి. కోవాలో నట్స్ ముక్కలు, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచుకోవాలి.
  • పన్నీర్ ను మెత్తగా చేసి కావలసిన ఆకారంలో అంటే గుండ్రంగా లేదా కోలాకారంలో గానీ చేయాలి. ఒక్కో ఉండ మధ్యలో గుంతలా చేసి నట్స్ మిశ్రమాన్ని అరటీస్పూన్ చొప్పున వేసి మూసేయాలి.
  • మందపాటి గిన్నెలో పంచదార, మంచి నీళ్ళు పోసి మరిగించాలి. సుమారు పావు గంట సేపు మరిగిన తరువాత పన్నీర్ ఉండల్ని పాకంలో వేయాలి. ఇప్పుడు మూతపెట్టి సిమ్ లో మరో పదిహేను నిముషాలు ఉడికించి దించాలి. ఆరిన తర్వాత వడ్డించాలి.

No comments:

Post a Comment