Saturday, August 30, 2014

పాల పూరీ / పాల్ పోలీ

Picture
కావలసినవి:  
 మైదా - కప్పు; 

పాలు - అర లీటరు; 
మిల్క్ - 3 టేబుల్ స్పూన్లు; 
నూనె - టీ స్పూను; 
నీరు - పావు కప్పు; 
నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా; 
పంచదార - 4 టేబుల్ స్పూన్లు; 
ఉప్పు - చిటికెడు; 
బాదంపప్పులు - కొద్దిగా; 
కుంకుమపువ్వు - చిటికెడు; 
ఏలకులపొడి - పావు టీ స్పూను

 తయారి:  

  •  ఒక పాత్రలో మైదా వేసి నీరు పోస్తూ పూరీ పిండిలా క లిపి, మూత పెట్టి గంటసేపు నాననివ్వాలి  
  •   కడాయిలో పాలు మరిగించి, మంట తగ్గించి, కండెన్స్‌డ్ మిల్క్ పోయాలి
  •   చిన్న గ్లాసులో కొద్దిగా నీరు, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి, మరుగుతున్న పాలలో వేయాలి
  •   పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి
  •   ఈ పాలను వెడల్పాటి పాత్రలో పోయాలి  
  •   పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, పూరీల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించాలి  
  •   పూరీలన్నీ తయారుచేసుకుని, పాలలో వేయాలి  
  •   గంటసేపు నానినతర్వాత పూరీలను బయటకు తీసి, బాదంపప్పులతో గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment