Saturday, August 30, 2014

జామ హల్వా

Picture
కావలసిన పదార్థాలు :
జామకాయలు - రెండు,
పంచదార - పది టేబుల్ స్పూన్లు,
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్,
నీళ్లు - అరకప్పు,
యాలక్కాయపొడి - చిటికెడు,
బాదం, జీడి పప్పు, ఎండుద్రాక్షలు - అలంకరణకు.




తయారుచేసే పద్ధతి : 
  • జామకాయల్ని నాలుగు పెద్ద ముక్కలుగా కోసి గింజలు తీసేయాలి. ఆ తరువాత చిన్న ముక్కలు కోయాలి. కుక్కర్లో జామకాయ ముక్కల్ని ఉడికించాలి. చల్లారిన తరువాత మిక్సీలో మెత్తటి గుజ్జులా పట్టాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలపొచ్చు.
  • కళాయిలో పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. పంచదార కరిగిన తరువాత జామ గుజ్జును వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కొద్దిగా నెయ్యి కలిపి సన్నటి సెగ మీద ఉడికించాలి.
  • గిన్నెకు మిశ్రమం అంటుకోకుండా గరిటెతో కలియపెడుతూనే ఉండాలి. బాగా చిక్కపడిన తరువాత యాలక్కాయపొడి వేసి నట్స్తో అలంకరించాలి. ఆరోగ్యకరమైన నోరూరించే హల్వా రెడీ.

No comments:

Post a Comment