Saturday, August 30, 2014

గుల్ గూలె

Picture
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ     -           100 గ్రా.
పాలు                  -            100 మి.లీ.
మైదా                  -             50 గ్రా.
గోధుమ పిండి        -             50 గ్రా.
పంచదార             -             50 గ్రా.
యాలకుల పొడి     -             టీస్పూన్ 
నెయ్యి                  -            వేయించడానికి సరిపడా

తయారుచేసే పద్ధతి :
  • బొంబాయి రవ్వను పాలల్లో వేసి 20 నిమషాల సేపు నాననివ్వాలి.
  • తరువాత మైదా, గోధుమ పిండి వేసి చిక్కని ముద్దలా కలుపుకోవాలి. 
  • ఇప్పుడు పంచదార, యాలకుల పొడి కూడా వేసి అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా చిలకరించి ఓ పది నిముషాలు నాననివ్వాలి.
  • బాణలిలో నెయ్యి వేసి కాగాక మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేస్తూ బోండాం మాదిరిగా వేయించి తీయాలి.

No comments:

Post a Comment