Showing posts with label ఇడ్లీ. Show all posts
Showing posts with label ఇడ్లీ. Show all posts

Wednesday, November 19, 2014

మేతి ఇడ్లీ


కావల్సిన పదార్థాలు: బియ్యం: 1cup కొబ్బరి తురుము: 1cup మెంతులు: 1tbsp పెరుగు: 4tbsp బెల్లం: 3tbsp ఉప్పు: రుచికి సరిపడా 


తయారుచేయు విధానం: 1. ముందుగా ఒక గిన్నెలో బియ్యం వేసి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి 6గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని రాత్రిల్లో నానబెట్టుకొంటే మరింత మంచిది. తర్వాత రోజు పిండి మొత్తగా రుబ్బుకోవడానికి సులభం అవుతుంది.
 2. మరో గిన్నె తీసుకొని అందులో కొద్దిగా పెరుగులో మెంతులను వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేసి బియ్యం లాగే వీటిని కూడా రాత్రంత నానబెట్టుకోవలి. కనీసం 6 గంటల సేపు నానాలి. 
3. బియ్యం, మెంతులు నానిన తర్వాత మిక్సీ జార్ లో మెంతులను వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మొంతి పేస్ట్ ను తీసి పక్కన పెట్టుకోవాలి.
 4. ఇప్పుడు అదే జార్ లో బియ్యం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేస్తుండగానే అందులో కొబ్బరి తురుము వేసి, స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. 
5. తర్వాత అందులో బెల్లం కూడా వేయాలి. 
6. మొత్తం మిశ్రమాన్ని గరిటతో బాగా మిక్స్ చేయాలి. ఇలా పిండి తయారుచేసుకొన్నాక, రుబ్బుకొన్ని పిండిని రాత్రంతా అలాగే ఉడనివ్వాలి.
 7. తర్వాత రోజు ఉదయం, ఇడ్లీపిండిలో, మేంతి పేస్ట్, ఉప్ప వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ లో పిండిని పోయాలి.
 8. ఇడ్లీ కుక్కర్ ను స్టౌ మీద పెట్టి మీడియం మంట మీద, ఆవిరి మీద ఇడ్లీలను 10నిముషాలు ఉడికించుకోవాలి . స్టీమర్ నుండి ఆవిరి ఒత్తిడి భయటకు వచ్చినప్పుడు, ఇడ్లీ కుక్కర్ మూత తీసి, స్పూన్ సహాయంతో ఇడ్లీలను సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవాలి. అంతే తినడానికి మేతి ఇడ్లీ రెడీ.ఈ ఇడ్లీని కొబ్బరి చట్నీ లేదా గార్లిక్ చట్నీతో సర్వ్ చేయాలి .

Wednesday, July 16, 2014

ఇడ్లీ – జీడిపప్పు ఉప్మా స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ :

ఇడ్లీ – జీడిపప్పు ఉప్మా స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ :
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXzUTWUUHZf7ZtdGMvgBd3_kmNviMwfsK-KKUg_kxnzpX1lmjntwFf7sIYVYhrYfz3teMb1zdGCcPiZBgg58kq_q9z2Pd9qppkvAu30RAmvG8BYZq8zftzazuuTX6hx5D6w4lN_JyTel4/s400/DSC03340%5B1%5D.JPG
ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోస, ఉప్మా కామన్. ప్రతి రోజూ ఇవేనా అని పిల్లలు మారాం చేస్తుంటారు. రోజూ చేసేవే అయినా, కొంచెం వెరైటీగా చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలను ఒక్కోసారి వేస్ట్ అవుతుంటాయి. అలాకాకుండా కొంచెం వెరైటీగా ఉప్మా చేసి పెడితే అందరూ తింటారు..
 కావలసిన పదార్థాలు:
ఇడ్లీలు: 4 – 6 
జీడిపప్పులు: 10-15
 పచ్చిబఠాణీ: 1/2కప్పు 
క్యారట్ తురుము: ½ కప్పు
 నిమ్మరసం: 1 కప్పు
 పెద్ద ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి), 
పచ్చిమిర్చి: 2-4(నిలువుగా కట్ చేసుకోవాలి) 
తాలింపు గింజలు(ఆవాలు, శెనపప్పు, ఉద్దిపప్పు): 1టేబుల్ స్పూన్
 నూనె: సరిపడా
 పసుపు: చిటికెడు
 కరివేపాకు: రెండు రెమ్మలు
 కొత్తిమీరతరుగు: 2 టేబుల్ స్పూన్
 ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఇడ్లీలను ఒక ప్లేట్‌లో పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేడి చేసి అందులో తాలింపు వేయించాలి. బాగా వేగిన  తరవాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, వేసి వేయించాలి.
3. తరవాత పచ్చిబఠాణీ, కరివేపాకు, జీడిపప్పులను జత చేయాలి. అన్నీ బాగా వేగాక, అందులో ఇడ్లీ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి, ఆ పైన క్యారట్ తురుము చల్లాలి. ఈ మిశ్రమాన్ని ఒక డిష్‌లోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మరసం, జీడిపప్పు పలుకులు వేసి కలిపి అల్లం చట్నీతో సర్వ్ చేయాలి. అంతే జీడిపప్పు ఇడ్లీ ఉప్మా రెడీ.

Thursday, June 12, 2014

కాంచీపురం ఇడ్లీ

కాంచీపురం ఇడ్లీ

కావాల్సినవి:
-------------
బియ్యం - 1కప్పు
మినపప్పు - 1/2కప్పు
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1/2స్పూన్
మిరియాలు - అరడజను
ఇంగువ - చిటికెడు
ఆవాలు - 1/2స్పూన్
ఉప్పు - తగినంత, నూనె - 1 స్పూన్
కరివేపాకు - కొంచెం
తయారీ విధానం:
---------------------
ముందుగా బియ్యాన్ని సుమారు ఎనిమిది గంటల పాటు నీళ్లలో నానపెట్టాలి. అలాగే మినపప్పును కూడా. అల్లంను చాలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వుంచాలి. మిరియాలను చితక్కొట్టి పక్కన వుంచాలి. ఆపై బియ్యం, మినపప్పు విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన తరువాత రెండింటినీ బాగా కలపాలి. ఆ మిశ్రమంలో ఉప్పు వేసి ఒక పూట అలా వదిలేయాలి. నానిన ఆ పిండికి అల్లం, జీలకర్ర, ఇంగువ, దంచిన మిరియాలు కలపాలి. పాన్‌లో నూనె వేసి, కాస్త కాగాక, ఆవాలు, కరివేపాకు వేసి, ఒక్క నిమషం ఆగి, ఆ పోపును తీసి పిండిలో వేయాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె లేదా నెయ్యి రాసి, ఈ పిండి మిశ్రమాన్ని వేసి, ఆవిరిపై ఉడికించాలి.

Saturday, May 3, 2014

బనానా ఇడ్లీ


బనానా ఇడ్లీ
banan
కావలసిన పదార్థాలు :
రవ్వ - ఒక కప్పు
కొబ్బరి తురుము 
- పావు కప్పు
పండిన అరటిపండ్లు - 4
చక్కెర - అరకప్పు
బేకింగ్ సోడా 
- అర టీ స్పూన్
నెయ్యి - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:
పండిన అరటిపండ్లను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అరటిపండ్ల గుజ్జు, రవ్వ, కొబ్బరి తురుము, ఉప్పు, చక్కెర, బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్ళు కలిపి మిక్స్ చేయాలి. ఈ పిండి మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కు నెయ్యి రాసి, అరటిపండ్లతో చేసిన మిశ్రమాన్ని పోసి 15నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ఇంకేముంది.. బనానా ఇడ్లీ రెడీ! పాలతో కలిపి ఈ ఇడ్లీలు తింటే ఎంతో ఆరోగ్యం!

రాగి ఇడ్లీ

రాగి ఇడ్లీ

raagi-idli
కావలసిన పదార్థాలు :
రాగి పిండి - 2 కప్పులు
ఇడ్లీ రవ్వ - ఒక కప్పు
మినపప్పు - అర కప్పు
మెంతులు - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం : 
ఇడ్లీ రవ్వ, మెంతులు, మినపప్పు విడివిడిగా 6గంటల పాటు నానబెట్టాలి. మూడు కలిపి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో రాగి పిండి, కొన్ని నీళ్ళు పోసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఆరు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్‌కు నూనె రాసి మిశ్రమాన్ని కొద్ది, కొద్దిగా వేయాలి. ఆవిరి మీద పదినిమిషాల పాటు ఉడికించాలి. ఈ ఇడ్లీలను కొత్తిమీర చట్నీతో లాగిస్తే బాగుంటాయి. 

ఓట్స్ ఇడ్లీ

ఓట్స్ ఇడ్లీ
Instant
కావలసిన పదార్థాలు :
ఓట్స్ - ఒక కప్పు
రవ్వ - అర కప్పు
పెరుగు - అర కప్పు
పసుపు - పావు టీ స్పూన్
కొత్తిమీర - అర కట్ట
బేకింగ్ సోడా - కొద్దిగా 
పచ్చిమిరపకాయలు - 2
అల్లం పేస్ట్ - అర టీ స్పూన్ 
మినపప్పు - అర టీ స్పూన్
ఆవాలు - అర టీ స్పూన్
ఇంగువ - కొద్దిగా
కరివేపాకు - 4 రెమ్మలు
నూనె - 2 స్పూన్
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
ఓట్స్‌ని వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. రెండు నిమిషాల పాటు సన్నని సెగ మీద రవ్వను కూడా వేయించాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలను వేయాలి. తర్వాత మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, అల్లం పేస్ట్ వేసి రెండు నిమిషాలు అలాగే ఉంచి దించేయాలి. ఇందులో వేయించుకున్న రవ్వ, ఓట్స్ పొడి వేసి కలపాలి. ఇంకా పెరుగు, పసుపు, బేకింగ్ సోడా, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి. కొన్ని నీళ్ళు కూడా పోసి మరికాసేపు కలిపి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని ఒక్కో ప్లేటుకు నూనె రాసి ఆ మిశ్రమాన్ని అందులో వేయాలి. అలా అన్ని రాసిన తర్వాత మూత పెట్టి 10నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. ఓట్స్ ఇడ్లీలు తయారైనట్టే! 

పాలకూర ఇడ్లీ & క్యారట్ ఇడ్లీ

కావలసిన వస్తువులు:
ఇడ్లీ పిండి  – 6 కప్పులు
పాలకూర రసం – 1/4 కప్పు
బీట్రూట్/క్యారట్  రసం -  3  చెంచాలు
జీలకర్ర పొడి – 1/2 tsp
ఉప్పు – తగినంత

ఒక కప్పు మినప్పప్పు, మూడు కప్పుల ఇడ్లీ రవ్వ కొలతలతో ఇడ్లీ పిండి తయారు చేసుకోవాలి. పులిసిన పిండిలో తగినంత ఉప్పు, జీలకర్ర కలిపి ఉంచుకోవాలి. ఆరుకప్పులు ఇడ్లీపిండిని మూడు భాగాలు చేసుకోవాలి. ఒక భాగంలో పాలకూర రసం, ఒక భాగంలో బీట్రూట్ రసం కలిపి, మూడోభాగం అలాగే ఉంచుకోవాలి.. ఇడ్లీగిన్నెలకు నూనె రాసుకుని మామూలుగానే ఇడ్లీలు తయారు చేసుకోవాలి. ఆకర్షణీయమైన మువ్వన్నెరంగుల ఇడ్లీలు తయారు కాగానే సాంబార్, కొబ్బరి పచ్చడితో సర్వ్ చేయండి..