Wednesday, July 16, 2014

ఇడ్లీ – జీడిపప్పు ఉప్మా స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ :

ఇడ్లీ – జీడిపప్పు ఉప్మా స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ :
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXzUTWUUHZf7ZtdGMvgBd3_kmNviMwfsK-KKUg_kxnzpX1lmjntwFf7sIYVYhrYfz3teMb1zdGCcPiZBgg58kq_q9z2Pd9qppkvAu30RAmvG8BYZq8zftzazuuTX6hx5D6w4lN_JyTel4/s400/DSC03340%5B1%5D.JPG
ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోస, ఉప్మా కామన్. ప్రతి రోజూ ఇవేనా అని పిల్లలు మారాం చేస్తుంటారు. రోజూ చేసేవే అయినా, కొంచెం వెరైటీగా చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలను ఒక్కోసారి వేస్ట్ అవుతుంటాయి. అలాకాకుండా కొంచెం వెరైటీగా ఉప్మా చేసి పెడితే అందరూ తింటారు..
 కావలసిన పదార్థాలు:
ఇడ్లీలు: 4 – 6 
జీడిపప్పులు: 10-15
 పచ్చిబఠాణీ: 1/2కప్పు 
క్యారట్ తురుము: ½ కప్పు
 నిమ్మరసం: 1 కప్పు
 పెద్ద ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి), 
పచ్చిమిర్చి: 2-4(నిలువుగా కట్ చేసుకోవాలి) 
తాలింపు గింజలు(ఆవాలు, శెనపప్పు, ఉద్దిపప్పు): 1టేబుల్ స్పూన్
 నూనె: సరిపడా
 పసుపు: చిటికెడు
 కరివేపాకు: రెండు రెమ్మలు
 కొత్తిమీరతరుగు: 2 టేబుల్ స్పూన్
 ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా ఇడ్లీలను ఒక ప్లేట్‌లో పొడిపొడిగా చేసి ఉంచుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేడి చేసి అందులో తాలింపు వేయించాలి. బాగా వేగిన  తరవాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు, వేసి వేయించాలి.
3. తరవాత పచ్చిబఠాణీ, కరివేపాకు, జీడిపప్పులను జత చేయాలి. అన్నీ బాగా వేగాక, అందులో ఇడ్లీ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి, ఆ పైన క్యారట్ తురుము చల్లాలి. ఈ మిశ్రమాన్ని ఒక డిష్‌లోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మరసం, జీడిపప్పు పలుకులు వేసి కలిపి అల్లం చట్నీతో సర్వ్ చేయాలి. అంతే జీడిపప్పు ఇడ్లీ ఉప్మా రెడీ.

No comments:

Post a Comment