Showing posts with label ఉండ్రాళ్ళు. Show all posts
Showing posts with label ఉండ్రాళ్ళు. Show all posts

Sunday, June 29, 2014

పాల ఉండ్రాళ్ళు

పాల ఉండ్రాళ్ళు 
కావాల్సినపదార్థాలు: 
బియ్యం పిండి - ఒక కప్పు
చక్కెర - ఒక కప్పు
పాలు - ఒక కప్పు
ఏలకుల పొడి - పావు టీ స్పూన్
నీళ్ళు - 1 1/2 కప్పులు
తురిమిన పచ్చి కొబ్బరి - ఒక కప్పు
వేయించి పొడి కొట్టిన తెల్ల నువ్వుల పొడి - అరకప్పు
తయారుచేయువిధానం:
రెండు కప్పుల నీటిని గిన్నెలో పోసి బాగా మరగనివ్వాలి. బియ్యప్పిండిని వేసి, బాగా
కలియదిప్పి, వెంటనే గిన్నెపై మూత పెట్టాలి. సన్నని సెగమీద 4 -5 నిముషాల పాటు
ఉడకనివ్వాలి. విడిగా గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి. చిన్న ఉండలు చేసి ప్లేటులో విడిగా
పెట్టుకోవాలి. మరొక గిన్నెలో చక్కెర వేసి, నీటిని పోసి మరిగించాలి. సెగ తగ్గించి,
కొబ్బరితురుము వేసి కొద్ది సేపు కలపాలి. బియ్యప్పిండి ఉండలను కుడా వేసి బాగా
కలియ దిప్పాలి. రెండు నిముషాల తరువాత కప్పు పాలను పోసి, ఉండలను అందులో వేసి
5 నిముషాల సేపు ఉడకనివ్వాలి. మెత్తగా నూరిన నువ్వల పొడి, ఏలకుల పొడి వేసి
కలపాలి. స్టవ్ మీద నుండి దించి చల్లార నివ్వాలి.

పప్పులో ఉండ్రాళ్ళు

పప్పులో ఉండ్రాళ్ళు 
కావలసిన పదార్థములు: 
బియ్యం పిండి - ఒక కప్పు
నీళ్ళు - తగినన్ని
పప్పు కోసం పెసరపప్పు - ఒక కప్పు
నీళ్ళు సరిపడినన్ని
బెల్లం - అర కప్పు
యాలకుల పొడి - అర చెంచా
తయారు చేయు విధానం : 
బియ్యం పిండిలో నీళ్ళుపోసి గట్టి పిండి తయారు చేసుకుని, దీన్ని చిన్న చిన్న ఉండలుగా
చేసుకోవాలి. ఈ ఉండలను మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఉడికించాలి. ఉడికిన ఉండలను
తీసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు లో తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన
పెసర పప్పులో బెల్లం పొడిగొట్టి వేసుకోవాలి. పప్పు స్టౌ మీద ఉండగానే ఉడికిన ఉండలను
వేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి యాలకుల పొడి వేసి స్టౌ మీద నుంచి దించాలి.

ఉండ్రాళ్ళు

ఉండ్రాళ్ళు 
కావలసినవి: 
బియ్యంపిండి లేదా బియ్యం రవ్వ- రెండు కప్పులు
బెల్లం- ఒక కప్పు
పచ్చిశెనగపప్పు- రెండు టీస్పూన్లు
నీరు- ఒక కప్పు
తయారు చేసుకునే విధానం :
బియ్యం ముందురోజు రాత్రి నానబెట్టి గుడ్డ మీద వేసి ఆరనివ్వాలి. నీరంతా ఇంకిపోయి,
బియ్యం పొడిగా అయినాక, మిక్సీలో వేసి రవ్వగా చేసుకోవాలి. బియ్యప్పిండితో ఉండ్రాళ్ళు
చేసుకొనే వారు పిండిగా చేసుకోవచ్చు. స్టౌ మీద బాణలీ పెట్టి తగినన్ని నీళ్ళు పోసి
మరిగించి అందులో బెల్లం వేసి కరిగే దాక కలియతిప్పాలి. తరువాత శనగపప్పు,
బియ్యంపిండి లేదా రవ్వ వేసి దగ్గర పడేదాక కలపాలి. దీనిని చిన్న చిన్న ఉండలు
చేసుకొని ఆవిరి మీద ఉడికించాలి అంతే... బొజ్జ గణపయ్యకు ప్రీతిపాత్రమైన తియ్యని,
కమ్మనైన ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే...!

Tuesday, June 10, 2014

గణపయ్యతో పాటు మానకూ... * కుడుములు * పాల ఉండ్రాళ్లు * బెల్లం తాళికలు * మోదుగలు * తుమ్మికూర పప్పు *

గణపయ్యతో పాటు మానకూ... * కుడుములు * పాల ఉండ్రాళ్లు * బెల్లం తాళికలు * మోదుగలు * తుమ్మికూర పప్పు *
విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు ఒకటే. తెలంగాణ ప్రాంతాలలో మాత్రం తుమ్మికూర పప్పు అదనం. ఈ తినుబండారాలన్నీ ఎలా చేయాలో తెలుసుకోండి.
పాల ఉండ్రాళ్లు


పాల ఉండ్రాళ్లు





పాల ఉండ్రాళ్లు

కావలసిన పదార్థాలు :
 బియ్యప్పిండి-ఒక కప్పు, 
నీళ్లు-రెండున్నర కప్పులు, 
పంచదార-ఒక కప్పు, 
కొబ్బరి తురుము-ఒక కప్పు, 
పాలు-ఒక కప్పు, 
సారపప్పు పొడి-అర కప్పు, 
యాలకుల పొడి-పావు టీస్పూన్.

తయారుచేసే విధానం : 
ఒక పాత్రలో నీళ్లు పోసి స్టవ్‌పై పెట్టాలి. నీళ్లు మరిగాక బియ్యప్పిండి వేసి ఈ మిశ్రమాన్ని కలపకుండానే మూత పెట్టేసి చిన్న మంటపై నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. తర్వాత స్టవ్ కట్టేసి, పిండిని చల్లారనివ్వాలి. 
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన ప్లేటులో ఉంచుకోవాలి. మరో పాత్ర స్టవ్‌పై ఉంచి, అందులో కాసిని నీళ్లు పోసి, పంచదార కూడా వేసి మరిగించాలి. 
మంట తగ్గించి అందులో కొబ్బరి తురుము వేసి కలపాలి. 
తరువాత బియ్యప్పిండి ఉండలను అందులో వేసి పాలు పోసి మూడు నాలుగు నిమిషాల సేపు ఉడికించాలి. 
తరువాత సారపప్పు పొడి వేసి బాగా కలపాలి. 
పాకం కాస్త చిక్కగా అయ్యేటప్పుడు పైన యాలకుల పొడి చల్లి దించేయాలి.  

బియ్యపు రవ్వ ఉండ్రాళ్లు

బియ్యపు రవ్వ ఉండ్రాళ్లు

ఉండ్రాళ్లు కావలసిన పదార్థాలు: 
బియ్యపు రవ్వ: 1cup 
నీళ్ళు: 11/2cup 
శనగపప్పు: 1/2cup 
జీలకర్ర: 1tsp 
నూనె : 3tsp 

తయారు చేయు విధానం: 
1. ముందుగా మందపాటి గిన్నెలో నూనె వేసి వేడి అయిన తర్వాత జీలకర్ర వేసి వేయించాలి. 
2. అందులో నీరు పోసి ఉప్పు వేసి, మరిగాక శనగపప్పు, బియ్యం రవ్వ వేసి కలపాలి. 
3. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద ఉడికించాలి. దించే ముందు నెయ్యి వేసి కలపాలి. ఉడికిన తర్వాత కిందకు దింపి చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి.

ఉండ్రాళ్ళ పాయసం

ఉండ్రాళ్ళ పాయసం

బియ్యాన్ని శుభ్రం చేసుకుని ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలి,తరువాత నీళ్ళతో వున్న బియ్యాన్ని చిల్లుల గిన్నిలో వడవేసుకోవాలి.కొద్దిసేపు పొడి వస్త్రంపైన ఆరపెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సిలో వేసి పిండి చెసుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించుకుని మందపాటి గిన్ని తీసుకుని సగం నీళ్ళు పొసి వెడి చెయ్యాలి.సిద్ధం చేసుకున్న బియ్యం పిండిని ఉండలు లేకుండా వేడి నీటిలో పోసి తిప్పాలి.పిండి ఉడికిన తరువాత స్టవ్ పైనుంచి గిన్ని దించుకుని ఆరబెట్టుకోవాలి.పిండి ఆరిన తరువాత చిన్న చిన్న ఉండలుగా చెసుకోవాలి.మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మరొక పెద్ద గిన్ని తీసుకుని నీళ్లు పొయ్యాలి.అందులో సగం బెల్లం సగం పంచదార వేసి కరిగిం చుకోవాలి.లేత పాకం వచ్చిన తరువాత ముందుగా సిద్ధం చెసుకున్న ఉండ్రాళ్ళను బెల్లం పాకంలో వేసి ఉడికించుకోవాలి.ఉండ్డ్రాళ్ళు ఉడికిన తరువాత గిన్ని దించుకుని మరొక గిన్నిలో పాలు తీసుకుని బాగా మరిగించుకుని ఉడికిన ఉండ్రాళ్ళలో పొసి కలపాలి.తరువాత యాలుకులు పొడి చెసి వెయ్యాలి.జీడిపప్పు, కిస్ మిస్ నేతిలో వెయించి కలపాలి.చివరిగా చిటికెడు ఉప్పు కలిపి వినాయకుడికి నైవేద్యం పెట్టాలి.


కావల్సిన వస్తువులు....
బియ్యం...1 కిలొ
బెల్లం...1 కిలొ
పాలు...1 లీటర్లు
యాలుకులు...10
జీడిపప్పు...10
కిస్ మిస్...10