Tuesday, June 10, 2014

ఉండ్రాళ్ళ పాయసం

ఉండ్రాళ్ళ పాయసం

బియ్యాన్ని శుభ్రం చేసుకుని ఆరు గంటల పాటు నానపెట్టుకోవాలి,తరువాత నీళ్ళతో వున్న బియ్యాన్ని చిల్లుల గిన్నిలో వడవేసుకోవాలి.కొద్దిసేపు పొడి వస్త్రంపైన ఆరపెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సిలో వేసి పిండి చెసుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించుకుని మందపాటి గిన్ని తీసుకుని సగం నీళ్ళు పొసి వెడి చెయ్యాలి.సిద్ధం చేసుకున్న బియ్యం పిండిని ఉండలు లేకుండా వేడి నీటిలో పోసి తిప్పాలి.పిండి ఉడికిన తరువాత స్టవ్ పైనుంచి గిన్ని దించుకుని ఆరబెట్టుకోవాలి.పిండి ఆరిన తరువాత చిన్న చిన్న ఉండలుగా చెసుకోవాలి.మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మరొక పెద్ద గిన్ని తీసుకుని నీళ్లు పొయ్యాలి.అందులో సగం బెల్లం సగం పంచదార వేసి కరిగిం చుకోవాలి.లేత పాకం వచ్చిన తరువాత ముందుగా సిద్ధం చెసుకున్న ఉండ్రాళ్ళను బెల్లం పాకంలో వేసి ఉడికించుకోవాలి.ఉండ్డ్రాళ్ళు ఉడికిన తరువాత గిన్ని దించుకుని మరొక గిన్నిలో పాలు తీసుకుని బాగా మరిగించుకుని ఉడికిన ఉండ్రాళ్ళలో పొసి కలపాలి.తరువాత యాలుకులు పొడి చెసి వెయ్యాలి.జీడిపప్పు, కిస్ మిస్ నేతిలో వెయించి కలపాలి.చివరిగా చిటికెడు ఉప్పు కలిపి వినాయకుడికి నైవేద్యం పెట్టాలి.


కావల్సిన వస్తువులు....
బియ్యం...1 కిలొ
బెల్లం...1 కిలొ
పాలు...1 లీటర్లు
యాలుకులు...10
జీడిపప్పు...10
కిస్ మిస్...10

No comments:

Post a Comment