Friday, September 5, 2014

రేగు పండ్ల బెల్లం వడియాలు


రేగుపండ్లు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 7-10 (కారాన్ని బట్టి), బెల్లం - కప్పు, జీలకర్ర - 1 టేబుల్‌ స్పూన్‌, 
ఉప్పు - తగినంత
తయారీ:
- ముందుగా రేగుపండ్లను శుభ్రంగా కడిగి, గాలికి ఆరబెట్టుకోవాలి.
- శుభ్రం చేసుకున్న ఈ రేగుపండ్లను రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి.(గింజతో సహా)
- దీనికి జీలకర్ర, బెల్లం, ఉప్పు కూడా కలిపి దంచుకోవాలి.
- ఇలా దంచుకున్న దానిని పక్కకు పెట్టి, పచ్చిమిరపకాయలను కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీనికి ముందే దంచి పెట్టుకున్న రేగు పండ్ల మిశ్రమాన్నీ కలిపి, అన్ని కలిసేలా దంచుకోవాలి.(రోట్లో దంచితేనే మరింత రుచిగా ఉంటుంది.)
- వీటిని కవర్‌పై కానీ, ప్లేటులో కానీ వడియాలుగా పెట్టి, ఎండ పెట్టాలి. బాగా ఎండే వరకూ ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండిన వడియాలను గాలి చొరని డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తినొచ్చు. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల రేగుపండ్లు శీతాకాలంలోనే కాక తినాలనిపించినప్పుడల్లా తినడానికి వీలుగా ఉంటుంది. మరి మీరూ వెంటనే ఈ రేగుపండ్ల వడియాల్ని తయారు చేసుకోండి!

No comments:

Post a Comment