Friday, September 5, 2014

బొంబాయిరవ్వతో...వడియాలు


బొంబాయిరవ్వతో...
కావలసినవి
బొంబాయిరవ్వ-పావుకిలో, నీళ్లు-అరలీటరు, నువ్వులు-50గ్రా
సగ్గుబియ్యం-50గ్రా, ఉప్పు-తగినంత
తయారుచేసే విధానం
సగ్గుబియ్యాన్ని ఓ రాత్రంతా నీళ్లల్లో నానబెట్టుకోవాలి. మర్నాడు రవ్వ ఎన్ని గ్లాసులు ఉందో చూసుకుని, ఒక గ్లాస్‌ రవ్వకి రెండు గ్లాస్‌ల చొప్పున నీళ్లు తీసుకుని స్టౌమీద పెట్టాలి.
నీళ్లు బాగా మసలేటప్పుడు రవ్వ, ఉప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలపాలి. మిశ్రమం చిక్కబడేవరకు ఉంచి దించేసుకోవాలి. చల్లారాక ఒక కవర్‌పై చెంచాతో బిళ్లల్లా వేసుకోవాలి. ఎండలో రెండు,మూడు రోజులుంచి ఎండిన తరువాత నూనెలో వేయించుకోవాలి.

No comments:

Post a Comment