Friday, September 5, 2014

మినప పొట్టుతో వడియాలు


మినప పొట్టుతో
కావలసినవి
మినపప్పు-ఒక కప్పు, 
మినప్పొట్టు- నాలుగు కప్పులు
ఇంగువ-కొద్దిగా,
 ఉప్పు-తగినంత,
 పచ్చిమిరపకాయలు-పది

తయారుచేసే విధానం
ముందుగా మినపప్పుని మెత్తగా రుబ్బాలి. తరువాత పొట్టు, ఉప్పు, పచ్చిమిర్చి ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు వేసి రుబ్బాలి. (మరీ మెత్తగా రుబ్బుకోకూడదు) మినప వడియాలు మాదిరిగానే ప్లాస్టిక్‌ కవర్‌మీద సరిపడా సైజులో పెట్టుకోవాలి. ఒకరోజులో ఆరిపోతాయి. వీటిని నూనెలో వేయించి  వేడి వేడి అన్నంతో నేతిలో కలుపుకుని తింటే బాగుంటాయి.

No comments:

Post a Comment