Showing posts with label జామ్లు - జెల్లీలు. Show all posts
Showing posts with label జామ్లు - జెల్లీలు. Show all posts

Sunday, July 6, 2014

జామ్ బిస్కెట్స్


కావలసిన పదార్థాలు : 
మైదా పిండి... పావు కేజీ 
డాల్డా లేక మార్గరిన్... 150 గ్రాములు
బేకింగ్ పౌడర్... అర టీస్పూన్
పంచదార... 50 గ్రాములు
మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్... 75 గ్రాములు
ఐస్ వాటర్... తగినంత

తయారీ విధానం : 
మైదా పిండి శుభ్రం చేసుకుని, బేకింగ్ పౌడర్ కలపాలి. దీనికి డాల్డా లేక మార్గరిన్‌ను కలిపి ఐస్ వాటర్‌తో ముద్దగా చేసుకోవాలి. ఈ పిండిని చపాతీల్లాగా చేసుకుని, ఒక్కో చెపాతీని రెండుగా కట్ చేసి, మడతవేసి 1/4 అంగుళాల మందంకలిగి ఉండేలా పూరీల్లాగా వత్తుకోవాలి. వీటిని చక్కెరలో దొర్లించి పెట్టుకోవాలి.

ఇడ్లీ కుక్కర్ ప్లేట్ల గుంతల్లో నెయ్యి రుద్ది, పైన తయారు చేసుకున్న పూరీలను గుండ్రంగా కోసి పైన ఒకటి, కింద ఒకటి మధ్యలో జామ్ పెట్టి అమర్చాలి. ఇప్పుడు ఓవెన్‌లో 40 డిగ్రీల ఫారన్ హీట్ వేడి వద్ద పదిహేను నిమిషాలపాటు ఉడికించి తీసేయాలి. అంతే జామ్ బిస్కెట్ రెడీ. పిల్లలు వీటిని బాగా ఇష్టంగా తింటారు. మీరూ ప్రయత్నిస్తారు కదూ...!

మిక్సడ్‌ ఫ్రూట్‌ జామ్‌

కావలసినవి
యాపిల్స్‌- కేజీబొప్పాయి పండు, ద్రాక్ష- అరకేజీ చొప్పునఅరటి పండ్లు -నాలుగుపంచదార- రెండు కేజీలుసిట్రిక్‌ ఆసిడ్‌- నాలుగు స్పూన్లు
పెక్టిన్‌- ఒక స్పూన్‌
తయారీ: 
యాపిల్‌. అరటి, బొప్పాయి పండ్లు శుభ్రంగా కడిగి పొడివస్త్రంతో తుడవాలి. తరువాత చెక్కు తీసి ముక్కలుగా కోయాలి. ఈ పండ్ల ముక్కలు, ద్రాక్షపండ్లు ఓ పాత్రలోకి తీసుకుని సరిపడ నీళ్లు పోసి, సన్నని మంటపై ఉంచాలి. నీళ్లు ఆవిరై పండ్ల ముక్కలు గుజ్జుగా అయాక పంచదార చేర్చి సన్నని మంటపై ఉంచాలి. అరకప్పు నీటిలో సిట్రిక్‌ యాసిడ్‌ పోసి కలిపి మరి కాసిని నీరు పెక్టిన్‌ మిశ్రమంలో వేసి కలపాలి. ఎరుపు లేదా పసుపు రంగులో ఉండాలనుకునేవారు ఆ ఎసెన్సును కొద్దిగా వాడాలి. మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ సిద్ధమైనట్టే. చల్లారాక గారిచొరని డబ్బాలోకి తీసుకుని గట్టిగా మూతపెడితే సరిపోతుంది.

ఫ్రూట్‌ జామ్‌


కావలసినవి :
2 మీడియం సైజ్‌ యాపిల్స్‌
2 స్లైసుల పైనాపిల్‌
12-15 స్ట్రాబెర్రీస్‌
200 గ్రాముల పంచదార
1/2 టీ స్పూన్‌ దాల్చిన చెక్కపొడి (ఇష్టమైతేనే)
సిట్రిక్‌ యాసిడ్‌ (ఇది కూడా అవసరాన్ని బట్టి)
తయారుచేసే విధానం :
యాపిల్స్‌ చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. పైనాపిల్‌ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. ఆకులు తీసివేసి స్ట్రాబెర్రీస్‌కూడా చిన్న ముక్కలు చేసుకోవాలి.
రెండు కప్పుల నీటిని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేడిచేసి అందులో ఈ పండ్ల ముక్కల్ని వేసి సన్నమంటపై ఉడికించాలి. పండ్ల ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టౌమీద నుంచి దించి జ్యూస్‌ఫిల్టర్‌లో ముక్కల్ని వేసి నీటిని వడకట్టాలి. ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్‌ చెయ్యాలి. వడగట్టిన నీటిని తిరిగి స్టౌమీద ఉంచి అందులో పండ్ల గుజ్జును కూడా వేసి తక్కువ మంటపై ఉడికించాలి. పంచదార వేసి మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా చూసుకుని స్టౌమీద నుంచి దించి చల్లార్చాలి. దీన్ని సీసాల్లో భద్రపరచుకోవాలి. ఇది ఎక్కువకాలం నిలువ ఉంచుకోవాలనుకుంటే సిట్రిక్‌ యాసిడ్‌ కలుపుకోవాలి ఒక కేజీ పండ్ల ముక్కలకు 2 1/2 టీస్పూన్ల సిట్రిక్‌ యాసిడ్‌ కలుపుకోవాలి. రెండు చెంచాల గోరువెచ్చని నీటిలో సిట్రిక్‌ యాసిడ్‌ కలిపి జామ్‌ స్టౌమీద నుంచి దించబోయే ముందు ఈ నీటిని జామ్‌లో పూర్తిగా కలిసిపోయేలా కలపాలి.

మురబ్బా

 తయారీకి కావలసిన పదార్ధాలు: 
ఉసిరి పండ్లు, 
పంచదార, 
నీరు, 
నిమ్మ ఉప్పు
తయారీ: కడిగిన ఉసిరి పండ్లను పలచటి బట్టలో ఉంచి మరిగే నీటిలో మెత్తబడేవరకు ఉంచాలి. 
తర్వాత మూటలోని పండ్లను బయటకి తీసి ప్రతి పండును సూదులతో రంధ్రాలు చేసి ఈ పండ్లను మూడుపాళ్లు, పంచదార, ఏడుపాళ్లు నీరు 30 శాతంగల సిరప్‌లో మునిగేటట్టు ఒక రాత్రి ఉంచాలి. 
మరునాడు పండ్లను బయటకి తీసి సిరప్‌కు మరికొంత పంచదార చేర్చి తిరిగి పండ్లను సిరప్‌లోకి మా ర్చాలి. ఈవిధంగా వారంరోజులు చేసిన తర్వాత సిరప్‌ 70శాతం వరకు చేరుకుంటుంది. 
అప్పుడు సిరప్‌కు ఒక టీ స్పూన్‌ నిమ్మ ఉప్పు కలిపి శుభ్రంగా కడిగిన గాజుజాడీలలో ఉసిరిపండ్లను సిరప్‌తో పాటు నింపి నిల్వ చేసుకోవాలి, 
గుజ్జు శాతం ఎక్కువగా ఉండి, గింజభాగం తక్కువగా ఉన్న బనారసి, కాంచన్‌, క్రిష రకాలతో యీ మురబ్బా చేసుకుని ప్రతిరోజూ ఉదయం సేవిస్తే చాల మంచిది.

మిశ్రమ పండ్ల జామ్‌


కావలసిన పదార్ధాలు: 
రెండున్నర కిలోల బొప్పాయి పండ్లు, 
12 అరటిపండ్లు, 
250 గ్రాముల ద్రాక్షపండ్లు, 
ఆరు సపోటా పండ్లు, 
మూడు కిలోల చ క్కెర, 
అయిదు చెంచాల నిమ్మఉప్పు, 
2 చెంచాల మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ ఎసెన్స్‌.

తయారీ: 
బాగా పండిన బొప్పాయి పండ్లను మధ్యకి కోసి గింజలు తీసివేసిన పిదప సన్నగా తరిగి ఒక గిన్నెలో వేయాలి. తర్వాత బాగా పండిన అరటిపండ్లను తొక్కలు తీసివేసి వేరొక గిన్నెలో వేసి చేతితో మెత్తగా చేయాలి. 
ఆ తర్వాత సపోటా పండ్ల పైపొర మధ్యలోని గింజలు తీసివేసి బొప్పాయి గుజ్జులో వేసి, చేతితో మెత్తగా చేయాలి. తర్వాత బాగా పండిన గింజలు లేని ద్రాక్షపండ్లను వేరొక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి. 
ఈ నాలుగు రకాల పండ్ల గుజ్జును ఒక గిన్నెలో వేసి కలిపి మెత్తగా చేయాలి. 
తర్వాత ఈ పండ్ల గుజ్జును సన్ననిసెగలో వేడిచేయాలి. పదినిమిషాల తర్వాత దానిలో చక్కెర వేసి కలపాలి, 
ఈ మిశ్రమం ఉడికిన కొద్దిసేపటికి నిమ్మ ఉప్పు వేయాలి. 
ఈ మిశ్రమం పాకం వచ్చిన తర్వాత ఎస్సెన్స్‌ కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే వెడల్పు మూతగల సీసాలో నింపి మూతపెట్టి నిల్వ చేయాలి. 
దీనిపై వాడే సీసాలను ముందుగానే బాగా శుభ్రపరిచి ఆరబెట్టి ఉంచుకోవాలి.

మిక్స్డ్ ఫ్రూట్ జామ్ 1

యాపిల్,బొప్పాయి,సపోటా,అరటిపండ్లు ఎక్కువ తీసుకోవాలి.కమలా,ద్రాక్షపండ్లు తక్కువ తీసుకోవాలి.యాపిల్
ముక్కలు చిన్నవిగాచేసి ఉడికించి గుజ్జుతీసి రసం తీయాలి.(ఒకకిలో ముక్కలకు అరగ్లాసునీళ్ళు)బొప్పాయి,సపోటా గుజ్జు తీసుకోవాలి.ద్రాక్ష ఉడికించి రసం తీసుకోవాలి.అన్నిటిగుజ్జు కలిపివేయాలి.
                    గుజ్జు-1కిలో
                   పంచదార-1కిలో
                   నిమ్మఉప్పు-1టీస్పూను
                   మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ -1 టీ స్పూను
                  సోడియం బెంజాఎట్-1 టీస్పూను
       గుజ్జు,పంచదార కలిపి పొయ్యిమీద పెట్టి ఉడికించుకోవాలి.తీగపాకం వచ్చిన తర్వాత నిమ్మఉప్పు వేసి 5,10ని.లు ఉడికించాలి.ముద్దలాగా ఉంది జారిపడకుండా గట్టిగా ఉండాలి.పొడులను కలిపి తడిలేని పొడిసీసాలలో
(వెడల్పు సీసాలు)పోసి జామ్ చల్లారిన తర్వాత మూతపెట్టాలి.

Friday, July 4, 2014

మ్యాంగోజామ్

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • మామిడిపండ్ల ముక్కలు - 2 కేజీలు
  • చక్కెర - 2 కేజీలు
  • మామిడి ఎసెన్స్ - 1 టీస్పూ//
  • సిట్రిక్ ఆసిడ్ - 8 గ్రాములు
  • సోడియమ్ బెంజోట్ - 3 గ్రాములు
  • నారింజరంగు - కొద్దిగా

తయారీ విధానం

మామిడి పండ్లు, బాగా పండినవి తీసుకొని కడిగి తుడిచిపెట్టుకోవాలి.
తొక్క తీసి ముక్కలుగా చేయండి.
ఒక పెద్ద స్టీల్ లేదా అల్యూమినియం పాత్ర తీసుకొని మామిడి ముక్కల్ని అందులో వేసి, చక్కెర వేసి పొయ్యి మీద సన్నటి సెగ మీద ఉడికించండి.
చక్కెర కరిగి పాకం చిక్కబడి గుజ్జుగా వస్తుంది.
పొయ్యి మీద పెట్టిన పదార్థాలు మరుగుతూండగా, సిట్రిక్ యాసిడ్ ను కలపండి.
దించి, చల్లరిన తరువాత ఎసెన్స్ మరియు సోడియం బెంజోట్ వేసి కలిపండి.
జామ్ నిల్వ వుంచుకోడానికి వాడే సీసాలను వేడి నీటిలో బాగా కడిగి, ఆరపెట్టిన తరువాతే నింపుకోవాలి.

యాపిల్ జెల్లీ

Picture  Recipe

కావలసిన పదార్థాలు

  • యాపిల్ రసం – 1/2 లీటరు
  • చక్కెర – 1/2 కేజీ
  • రంగు . మీకు నచ్చినది మరియు ఎసెన్స్
  • సిట్రిక్ యాసిడ్ - కొద్దిగా

తయారీ విధానం

యాపిల్ ముక్కలు కోసి గింజలు తీసేసుకోవాలి.
పాత్రలో ముక్కల్ని వేసుకొని, అవి పూర్తిగా మునిగేటట్లు నీళ్ళు వేయాలి.
15ని. సన్నటి సెగ మీద ఉడకనివ్వాలి.
రసం వేరు పడేటప్పుడు సిట్రిక్ యాసిడ్ కలపాలి.
రసం వేరుపడిన తర్వాత దించి ఈ మిశ్రమాన్ని ఒక పల్చని గుడ్డలో పోసి వడకట్టుకోవాలి.
వడకట్టుకొన్న రసాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని చక్కెర చేర్చి పాకం పట్టాలి.
బాగా ముదురు పాకం వచ్చాక, చల్లారనిచ్చి ఎసెన్స్ కలపాలి.
శుభ్రపరచుకొన్న సీసాలోనే జెల్లీని నింపుకోవాలి.