Sunday, July 6, 2014

ఫ్రూట్‌ జామ్‌


కావలసినవి :
2 మీడియం సైజ్‌ యాపిల్స్‌
2 స్లైసుల పైనాపిల్‌
12-15 స్ట్రాబెర్రీస్‌
200 గ్రాముల పంచదార
1/2 టీ స్పూన్‌ దాల్చిన చెక్కపొడి (ఇష్టమైతేనే)
సిట్రిక్‌ యాసిడ్‌ (ఇది కూడా అవసరాన్ని బట్టి)
తయారుచేసే విధానం :
యాపిల్స్‌ చెక్కుతీసి చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. పైనాపిల్‌ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. ఆకులు తీసివేసి స్ట్రాబెర్రీస్‌కూడా చిన్న ముక్కలు చేసుకోవాలి.
రెండు కప్పుల నీటిని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేడిచేసి అందులో ఈ పండ్ల ముక్కల్ని వేసి సన్నమంటపై ఉడికించాలి. పండ్ల ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టౌమీద నుంచి దించి జ్యూస్‌ఫిల్టర్‌లో ముక్కల్ని వేసి నీటిని వడకట్టాలి. ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్‌ చెయ్యాలి. వడగట్టిన నీటిని తిరిగి స్టౌమీద ఉంచి అందులో పండ్ల గుజ్జును కూడా వేసి తక్కువ మంటపై ఉడికించాలి. పంచదార వేసి మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా చూసుకుని స్టౌమీద నుంచి దించి చల్లార్చాలి. దీన్ని సీసాల్లో భద్రపరచుకోవాలి. ఇది ఎక్కువకాలం నిలువ ఉంచుకోవాలనుకుంటే సిట్రిక్‌ యాసిడ్‌ కలుపుకోవాలి ఒక కేజీ పండ్ల ముక్కలకు 2 1/2 టీస్పూన్ల సిట్రిక్‌ యాసిడ్‌ కలుపుకోవాలి. రెండు చెంచాల గోరువెచ్చని నీటిలో సిట్రిక్‌ యాసిడ్‌ కలిపి జామ్‌ స్టౌమీద నుంచి దించబోయే ముందు ఈ నీటిని జామ్‌లో పూర్తిగా కలిసిపోయేలా కలపాలి.

No comments:

Post a Comment