Sunday, July 6, 2014

మిశ్రమ పండ్ల జామ్‌


కావలసిన పదార్ధాలు: 
రెండున్నర కిలోల బొప్పాయి పండ్లు, 
12 అరటిపండ్లు, 
250 గ్రాముల ద్రాక్షపండ్లు, 
ఆరు సపోటా పండ్లు, 
మూడు కిలోల చ క్కెర, 
అయిదు చెంచాల నిమ్మఉప్పు, 
2 చెంచాల మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ ఎసెన్స్‌.

తయారీ: 
బాగా పండిన బొప్పాయి పండ్లను మధ్యకి కోసి గింజలు తీసివేసిన పిదప సన్నగా తరిగి ఒక గిన్నెలో వేయాలి. తర్వాత బాగా పండిన అరటిపండ్లను తొక్కలు తీసివేసి వేరొక గిన్నెలో వేసి చేతితో మెత్తగా చేయాలి. 
ఆ తర్వాత సపోటా పండ్ల పైపొర మధ్యలోని గింజలు తీసివేసి బొప్పాయి గుజ్జులో వేసి, చేతితో మెత్తగా చేయాలి. తర్వాత బాగా పండిన గింజలు లేని ద్రాక్షపండ్లను వేరొక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి. 
ఈ నాలుగు రకాల పండ్ల గుజ్జును ఒక గిన్నెలో వేసి కలిపి మెత్తగా చేయాలి. 
తర్వాత ఈ పండ్ల గుజ్జును సన్ననిసెగలో వేడిచేయాలి. పదినిమిషాల తర్వాత దానిలో చక్కెర వేసి కలపాలి, 
ఈ మిశ్రమం ఉడికిన కొద్దిసేపటికి నిమ్మ ఉప్పు వేయాలి. 
ఈ మిశ్రమం పాకం వచ్చిన తర్వాత ఎస్సెన్స్‌ కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే వెడల్పు మూతగల సీసాలో నింపి మూతపెట్టి నిల్వ చేయాలి. 
దీనిపై వాడే సీసాలను ముందుగానే బాగా శుభ్రపరిచి ఆరబెట్టి ఉంచుకోవాలి.

No comments:

Post a Comment