Showing posts with label పిజ్జా. Show all posts
Showing posts with label పిజ్జా. Show all posts

Wednesday, November 19, 2014

లెట్యూస్ పిజ్జా

కావలసినవి:
 పిజ్జాబేస్ - 1,
 లెట్యూస్ ఆకులు - కప్పు,
 చెర్రీ టొమాటోలు - 2;
ఒరిగానో - పావు టీ స్పూను,
 తులసి ఆకులు - 5,
 ఫెటా చీజ్ - టేబుల్ స్పూను, పర్మెజాన్ చీజ్ - టీ స్పూను
 
 తయారీ:
 పిజ్జాబేస్ మీద పిజ్జా సాస్‌ను పొరలా పూయాలి. వాటి మీద ముందుగా ఫెటా చీజ్, పర్మెజాన్ చీజ్ వేయాలి.
     
 చెర్రీ టొమాటో ముక్కలు, లెట్యూస్ ఆకులు అందంగా అమర్చి వాటి మీద  ఒరిగానో, తులసి ఆకులు వేసి  అవెన్‌లో ఉంచి 30 నిమిషాల తరవాత తీసేయాలి.

ఆంధ్రా వెజ్ పిజ్జా


కావలసినవి :
పిజ్జా బేస్‌లు -2
నూనె - తగినంత
మొజిల్లా చీజ్ - 1/2 కప్పు
మిరియాల పొడి - 1/2 టీ.స్పూ.
క్యారట్ తురుము -3 టీ.స్పూ.
కొత్తిమీర - కొద్దిగా
క్యాబేజీ తురుము- 1/4 కప్పు
క్యాప్సికమ్ ముక్కలు - 1/4 కప్పు
టమాటో -2
ఉల్లిపాయ -1
కీరా -1
ఉప్పు - తగినంత

సాస్ తయారీ కోసం :
క్యాప్సికమ్ తురుము - 1/ 2 కప్పు
ఉల్లిపాయ తరుగు - 1/2 కప్పు
టమాటో ప్యూరీ - 1/2 కప్పు
వెల్లుల్లి రెబ్బలు -5
కారం పొడి - 1టీ.స్పూ.
గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత

తయారీ :

 ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి దోరగా వేపాలి. తర్వాత క్యాప్సికమ్ తరుగు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో టమాటో ప్యూరీ వేసి కలిపి ఉడికించాలి. ఉడుకుతున్న మిశ్రమంలో కారం పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి నూనె తేలేవరకు ఉడికించాలి. తరువాత పిజ్జా బేస్‌కి రెండు వైపులా కొద్దిగా వెన్న రాసుకుని పెనం మీద రెండు వైపులా కొద్దిగా వేడి చేసుకోవాలి. తర్వాత ఒక్కో పిజ్జా బేస్ తీసుకుని ముందుగా దానిమీద క్యాబేజీ తరుము, తయారు చేసి పెట్టుకున్న సాస్ కూడా వేయాలి. దానిపైన సన్నగా కట్ చేసుకున్న టమాటా, కీరా స్లైసులు, దానిమీద ఉల్లిపాయ తురుము, క్యారట్ తురుమువేయాలి. చీజ్ తురుము వేసి కొత్తిమీర చల్లి ఓవెన్‌లో పెట్టి చీజ్ కరిగేవరకు బేక్ చేయాలి. 

Thursday, July 17, 2014

బట్టర్ పుడ్డింగ్

బ్రెడ్ అండ్ బట్టర్ పుడ్డింగ్-బ్రేక్ ఫాస్ట్  రిసిపి
కావల్సిన పదార్థాలు: 
బ్రెడ్: 10 slice 
పాలు: 300 ml 
వెన్న: 70gms(కరిగించుకోవాలి) 
బ్రౌన్ షుగర్: 80gms 
స్పైస్ పొడి: 2tbsp
 గుడ్లు: 2 (కొట్టిన)
 డ్రై ఫ్రూట్స్: 180gms(blackcurrant, orange peels and raisins) 
జాజికాయ: 1tbsp(తురుము కోవాలి) 

తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో బ్రెడ్ ముక్కలను బ్రేక్ చేసి పెట్టుకోవాలి 
2. తర్వాత ఈ బ్రెడ్ ముక్కల మీద పాలు పోయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా కలుపుకోవాలి. 
3. కలిపిన ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. 
4. తర్వాత హాఫ్ లీటర్ బేకింగ్ డిష్ తీసుకొని, దానికి బట్టర్ ను రాసిపెట్టాలి. 
5. ఇప్పుడు కరిగించి పెట్టుకొన్న వెన్న, బ్రౌన్ షుగర్, గుడ్లు, మరియు స్పసీలను అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి. 
6. తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా పాలతో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బ్రెడ్ పేస్ట్ ను, పాలతో సహా ఇందులో పోయాలి. 
7. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి, బాగా మిక్స్ చేసుకోవాలి. 
8. తర్వాత ఈ మొత్తం మిశ్రమానికి జాజికాయ తురుమును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
 9. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బేకింగ్ వోవెన్ లో పెట్టి 35నిముషాలు, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకూ బేక్ చేయాలి. అంతే ఇప్పుడు మీకు నోరూరించే బ్రేక్ ఫాస్ట్ రిసిపి బట్టర్ పుడ్డింగ్ రెడీ. ఈ నోరూరించే పుడ్డింగ్ ను చల్లచల్లగా లేదా వేడిగా కూడా తినవచ్చు.

క్యారెట్ శాండ్‌విచ్ స్ప్రెడ్


కావలసిన పదార్థాలు :
మొలకెత్తిన పెసలు... రెండు కప్పులు
క్యారెట్ ముక్కలు... ఒక కప్పు
ఉల్లిపాయముక్కలు... ఒక కప్పు
కొత్తిమీర... కొద్దిగా
బ్రెడ్... ఒక ప్యాకెట్
క్యాప్సికమ్ ముక్కలు... ఒక కప్పు
నూనె, ఉప్పు... తగినంత

తయారీ విధానం :
మొలకెత్తిన పెసలు ఉడకబెట్టి, వడకట్టి ఉంచాలి. పాన్‌లో నూనె, ఆవాలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిముక్కలను వేసి వేయించాలి. దాంట్లో ఉడికించిన పెసలు కలిపి మరో ఐదు నిమిషాలపాటు వేయించి చివర్లో కొత్తిమీర కలపాలి.ఇప్పుడు బ్రెడ్‌కు చుట్టూ బ్రౌన్ కలర్లో ఉన్న దాన్నంతా తీసివేసి... నెయ్యిపూసి, కడాయిలో గోల్డ్ కలర్ వచ్చేదాకా రెండువైపులా కాల్చాలి.

ఇలా చేసిన ప్రతి రెండు బ్రెడ్ పీసుల మధ్యలో పైన తయారు చేసుకున్న పెసల మిశ్రమాన్ని ఉంచి తినాలి. అంతే క్యారెట్ శాండ్‌విచ్ స్ప్రెడ్ తయారైనట్లే..! ఎన్నో పోషకాలు కలగలసిన ఈ వంటకం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.

Wednesday, July 16, 2014

వెజిటబుల్ చీజ్ శాండ్‌విచ్

 

కావలసినవి: హోల్ వీట్ బ్రెడ్ - 2 స్లైసులు, చీజ్ స్లైసులు - నాలుగు టొమాటో స్లైసులు - 2, కీరా స్లైసులు - 4
లెట్యూస్ - 2 ఆకులు, క్యారట్ తురుము - టేబుల్ స్పూన్
మయోనైజ్ (మార్కెట్లో లభిస్తుంది) - తగినంత

తయారి: బ్రెడ్ సైడ్స్ కట్ చేసి, ఒకవైపు మయోనైజ్, చీజ్‌ను స్ప్రెడ్ చేయాలి. టొమాటో, కీరా స్లైసులు, లెట్యూస్, క్యారట్ తురుము వేసి, పైన మరో బ్రెడ్ స్లైసును ఉంచాలి. రెండు బ్రెడ్ స్లైసులను గట్టిగా అదిమి, సిల్వర్ ఫాయిల్‌లో చుట్టి, స్నాక్ బాక్స్‌లో పెట్టాలి.

పెప్పరోని పిజ్జా


 

కావలసినవి: మైదాపిండి - 140 గ్రా.
గుడ్డులోని పచ్చసొన - టీ స్పూన్
నీళ్లు - 10 మి.లీ
పాలు - 5 మి.లీ
ఉప్పు - రుచికితగినంత

తయారి:
పిజ్జా బేస్ కోసం మైదా, పచ్చసొన, నీళ్లు, పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండి ముద్దపై ఒక గిన్నెను బోర్లించి, గంట సేపు ఉంచాలి.



పిజ్జా పైన...
టొమాటో ప్యూరీ - 20 గ్రా.
మోజరెల్లా ఛీజ్ - 100 గ్రా.
చికెన్ సాసేజ్ (మార్కెట్లో లభిస్తుంది) - 80 గ్రా.
చికెన్ సలామీ - తగినంత, వెల్లుల్లిపేస్ట్ - 5 గ్రా.
ఎండుమిర్చి (కచ్చాపచ్చాగా దంచాలి) - అర టీ స్పూన్
 Homemade Pizza (photo)


తయారి: పాన్‌లో పిండి మిశ్రమాన్ని వెడల్పుగా పరచి బేస్ తయారుచేయాలి. దాని పైన టొమాటో ప్యూరీ, మోజరెల్లా ఛీజ్, చికెన్ సాసేజ్, చికెన్ సలామి, వెల్లుల్లి, పండు మిర్చి వేసి, పైన మూత పెట్టాలి. అవెన్‌లో అయితే పది నిమిషాలు, స్టౌ మీద అయితే పిజ్జా ఉడికేంత వరకు సన్నని మంట మీద ఉంచాలి.

Tuesday, July 8, 2014

బ్రెడ్ పిజ్జా

Picture
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసెస్         -            ఆరు 
వెన్న                -        రెండు చెంచాలు 
ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికం - ఒక్కొక్కటి చొప్పున 
చీజ్ తురుము     -             అరకప్పు 
టొమాటో సాస్ లేదా పిజ్జా సాస్ - పావు కప్పు 
ఉప్పు, మిరియాల పొడి -       తగినంత 

తయారుచేసే పద్ధతి :
  • ముందుగా ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికమును సన్నగా తరిగి పెట్టుకోవాలి. 
  • ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని కొద్దిగా వెన్న రాసి దానిపైన టొమాటో కెచప్ లేదా పిజ్జా సాస్ ను టాపింగ్ లా రాయాలి. పైన తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు పరిచి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. దానిపైన తగినంత చీజ్ ను పరవాలి. ఇలా మిగిలిన స్లైసులను కూడా చేయాలి. 
  • వీటన్నింటిని ఓవెన్ లో మూడు లేక నాలుగు నిముషాలు బేక్ చేస్తే సరిపోతుంది. పైన కావాలనుకుంటే మరికాస్త మిరియాల పొడి చల్లుకోవచ్చు. ఈ పిజ్జా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది.

Monday, July 7, 2014

ఓట్స్ శాండ్ విచ్

Picture
కావలసిన వస్తువులు: 
ఓట్స్ – 1/4 కప్పు 
బ్రెడ్ స్లైసులు – 6 
నెయ్యి – 1 టీస్పూన్ 
గడ్డ పెరుగు – 1 కప్పు 
క్యాప్సికమ్ తురుము – 2 టీ స్పూన్ 
క్యారట్ తురుము – 3 టీ స్పూన్ 
వేయించిన జీలకర్ర – చిటికెడు
టమాటా సాస్ – 1 టీ స్పూన్ 
కొత్తిమిర – కొద్దిగా 
మిరియాల పొడి – చిటికెడు 
ఉప్పు – తగినంత 
వెన్న – 4 టీ స్పూన్ 

తయారుచేసే పద్ధతి :
  • పెరుగును ఒక బట్టలో కట్టి నీరంతా పోయేవరకు వ్రేలాడదీయాలి.
  • ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి ఓట్స్‌ని దోరగా వేయించుకోవాలి.
  • ఒక గిన్నెలో వేయించిన ఓట్స్, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తురుము, పెరుగు, టమాటా సాస్, మిరియాలపొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమిర వేసి బాగా కలియబెట్టాలి.
  • బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి పలుచగా వెన్న రాయాలి.
  • దీనిమీద చెంచాడు పెరుగు, కూరగాయల మిశ్రమాన్ని పరిచి ఇంకో వెన్న రాసిన బ్రెడ్ స్లైసుతో మూసేసి వేడి పెనం మీద కొద్దిగా వెన్న వేసుకుంటూ రెండు వైపులా బంగారురంగు వచ్చేవరకు కాల్చుకోవాలి లేదా ఓవెన్‌లో కూడా కాల్చుకోవచ్చు..

Sunday, July 6, 2014

ఫ్రూట్ అండ్ నట్ జామ్ సాండ్‌విచ్


కావలసినవి
బ్రెడ్ స్లైసులు - 6-8
ఆపిల్ ముక్కలు - 1/2 కప్పు
ద్రాక్ష ముక్కలు - 1/2 కప్పు
నారింజ ముక్కలు - 1/4 కప్పు
జీడిపప్పు, బాదం - 1/4 కప్పు
మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్ -1/2 కప్పు
వెన్న - 1/4 కప్పు
ఇలా చేయాలి
పళ్లను చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గినె్నలో జామ్, పళ్ల ముక్కలు, బాదం, జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి పలుచగా వెనె్న రాయాలి. వెన్న రాసిన స్లైసు మీద చెంచాడు జామ్, పళ్ల మిశ్రమం పెట్టి పరిచి దానిమీద ఇంకో బ్రెడ్ స్లైసు పెట్టాలి. దాన్ని మెల్లిగా అదిమి పెట్టి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. సర్వ్ చేసేముందు తీసి రెండు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి.