Showing posts with label కేకు స్వీట్లు. Show all posts
Showing posts with label కేకు స్వీట్లు. Show all posts

Wednesday, September 3, 2014

స్వస్‌రోల్‌ కేక్‌



కావలసిన పదార్థాలు...
మైదాపిండి : 80 గ్రా
కోడిగుడ్లు : మూడు
బేకింగ్‌ పౌడర్‌: పావు చెంచా
వేడినీరు : ఒక
వెనిల్లా ఎసెన్స్‌: కాసిన్ని చుక్కలు
చక్కెర : 85 గ్రా
జామ్‌ : 55 గ్రా

తయారీ విధానం...
మైదాపిండిని, బేకింగ్‌ పౌడర్‌ను జల్లెడలో జల్లించుకుని, రెండింటిని కలిపి వేడి నీరు పోసి ముద్దలా చేసుకోవాలి. కోడిగుడ్డు సొనను తీసుకుని బాగా కలియ బెట్టాలి. ఇందులో పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి నీరు మరుగు తున్న పాత్రలో ఉంచాలి, ఆవిరి వల్ల కోడిగు డ్డు సొన వేడెక్కి, సొనంతా చిక్కగా అయి గట్టి పడినట్లవు తుంది. దీనిని చెంచాతో కలిపి క్రీమ్‌లా చేయాలి.
ఈ క్రీమ్‌కు మైదా, బేకింగ్‌ పౌడర్‌ మిశ్రమా న్ని కూడా జత చేసి, కాస్త ఎసెన్స్‌ కలపాలి. 

స్వస్‌రోల్‌ డబ్బా తీసు కుని దాని లోపలి గోడ లకు నెయ్యి గానీ, నూనె గానీ రాయాలి. దాంట్లో పైన కలిపి ఉంచుకున్న పదార్ధం అంతటిని పోయాలి.ఈ డబ్బాను ఓవెన్‌లో ఉంచి 200 సెంటీగ్రేడ్‌ వద్ద 15 నిమిషాలు ఉంచాలి.ఒక పేపర్‌ తీసుకుని పంచదార పోసి, దా నిపైన ఓవెన్‌లో ఉడికించిన పదార్థాన్ని వేడి చల్లారకుండా వేయాలి. పదార్ధం వేడిగా ఉన్న ప్పుడే స్పూన్‌ సాయంతో కేక్‌ మీద జామ్‌ రాయాలి. ఈ కే్‌ పై ఐసింగ్‌ షుగర్‌, కోకో మొ దలైన వాటితో అలం రించి సర్వ్‌ చేస్తే సరి..! 

Thursday, July 17, 2014

బట్టర్ పుడ్డింగ్

బ్రెడ్ అండ్ బట్టర్ పుడ్డింగ్-బ్రేక్ ఫాస్ట్  రిసిపి
కావల్సిన పదార్థాలు: 
బ్రెడ్: 10 slice 
పాలు: 300 ml 
వెన్న: 70gms(కరిగించుకోవాలి) 
బ్రౌన్ షుగర్: 80gms 
స్పైస్ పొడి: 2tbsp
 గుడ్లు: 2 (కొట్టిన)
 డ్రై ఫ్రూట్స్: 180gms(blackcurrant, orange peels and raisins) 
జాజికాయ: 1tbsp(తురుము కోవాలి) 

తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో బ్రెడ్ ముక్కలను బ్రేక్ చేసి పెట్టుకోవాలి 
2. తర్వాత ఈ బ్రెడ్ ముక్కల మీద పాలు పోయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా కలుపుకోవాలి. 
3. కలిపిన ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. 
4. తర్వాత హాఫ్ లీటర్ బేకింగ్ డిష్ తీసుకొని, దానికి బట్టర్ ను రాసిపెట్టాలి. 
5. ఇప్పుడు కరిగించి పెట్టుకొన్న వెన్న, బ్రౌన్ షుగర్, గుడ్లు, మరియు స్పసీలను అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి. 
6. తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా పాలతో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బ్రెడ్ పేస్ట్ ను, పాలతో సహా ఇందులో పోయాలి. 
7. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి, బాగా మిక్స్ చేసుకోవాలి. 
8. తర్వాత ఈ మొత్తం మిశ్రమానికి జాజికాయ తురుమును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
 9. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బేకింగ్ వోవెన్ లో పెట్టి 35నిముషాలు, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకూ బేక్ చేయాలి. అంతే ఇప్పుడు మీకు నోరూరించే బ్రేక్ ఫాస్ట్ రిసిపి బట్టర్ పుడ్డింగ్ రెడీ. ఈ నోరూరించే పుడ్డింగ్ ను చల్లచల్లగా లేదా వేడిగా కూడా తినవచ్చు.

క్రిస్మస్ పుడ్డింగ్

క్రిస్మస్ పుడ్డింగ్ - క్రిస్మస్ స్పెషల్
కావలసిన పదార్థాలు:
పాలు: 1ltr 
పంచదార: సరిపడినంత
 ఆరెంజ్ తొనలు: 12-14(గింజలు తీసినవి) 
యాపిల్‌: 1(పై పొట్టు, గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగాలి) 
ఆపిల్: 1 (తోలుతో సహా లావుపాటి ముక్కలుగా తరిగినవి) 
కిస్‌మిస్‌లు, బాదం, జీడిపప్పు, పలుకులు: 1cup 
బ్రెడ్‌ స్లైస్: 4-6 
బేస్‌ తయారీకి చిన్నచిన్న ముక్కలుగా చిదిమిన బిస్కెట్‌లు : 2cups 
వెన్న: 3tbsp 

తయారు చేయు విధానం: 
1. ముందుగా బేస్‌ తయారీకి: బిస్కట్‌ ముక్కలకి వెన్నని బాగా పట్టించి ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ డిష్‌ అడుగుభాగంలో సర్ది కదలకుండా ఉండేలా చేతులతో ఒత్తండి. 
2. ఈ గిన్నెని గంటపాటు ఫ్రిజ్‌ లో ఉంచండి. ఆలోపు ఫుడ్డింగ్‌ ని తయారుచేసుకోండి. తాజా బ్రెడ్‌ ముక్కలని చిన్నచిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోండి.
 3. తర్వాత మందపాటి గిన్నెలో పాలుపోసి సగమయ్యేదాకా సన్నని సెగమీద మరిగించండి. దించి పంచదార, బ్రెడ్‌ముక్కలు వేసి కలిపి చల్లారనివ్వండి. 
4. తరువాత కోసి ఉంచుకున్న ఆపిల్‌ ముక్కలు, డ్రైఫ్రూట్స్‌ వేసి కలిపి బేస్‌ తయారుచేసి ఉంచుకున్న గిన్నెలో పోయండి. గిన్నెను కుక్కర్‌లో పెట్టి పది పన్నెండు నిమిషాలు సన్నని సెగమీద ఉడికించండి. అప్పటికి సగం ఉడుకుతుంది. 
5. దానిమీద చుట్టూ గుండ్రంగా ఆపిల్‌ముక్కలు సర్ది మళ్లీ పన్నెండు నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. తరువాత దించి మూత తీసి చల్లారనివ్వాలి. దీనిని కనీసం రెండుమూడు గంటల ఫ్రిజ్‌ లో ఉంచి తింటే చాలా బాగుంటుంది.

Sunday, July 6, 2014

డ్రైఫూట్ బటర్ కేక్


కావలసిన పదార్థాలు :
మైదాపిండి... 100 గ్రాములు 
బేకింగ్ పౌడర్... అరచెంచా 
ఎండు ద్రాక్ష.. పది 
వెనిల్లా ఎసెన్స్... అర టీస్పూన్ 
బటర్... 50 గ్రాములు
చక్కెర పొడి...100 గ్రాములు.
గుడ్డు... రెండు
పాలు...ఒక కప్పు 

తయారీ విధానం :
ముందుగా మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లెడలో జల్లించి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండుద్రాక్షలను కూడా శుభ్రం చేసుకుని వాటైపైగల తొడిమలు తీసి తయారు చేసుకోవాలి. తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్‌లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్‌లాగా తయారు చేసుకోవాలి.

వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమానికి శుభ్రం చేసిన ఎండు ద్రాక్షను చేర్చి, మైదాను కూడా కలిపి, అరకప్పు పాలు కలుపుకుంటే పిండి జారుగా తయారవుతుంది. జారుగా ఉండే, క్రీమింగ్ చేసుకున్న పిండిని పేపర్ కప్స్‌లో పోసి 500 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 30 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టౌవ్ మీద నుంచి దించి కేక్‌పై చెర్రీ పండ్లతో కానీ, మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో, క్రీమ్‌తోనూ అలంకరించుకుని సర్వ్‌చేయొచ్చు.

Friday, June 13, 2014

హనీ కేక్



హనీ కేక్ రెసిపి
కావలసినవి:
తేనె: పావులీటరు
కోడిగుడ్లు: 3
ఆరెంజ్‌పీల్‌  తురుము : టీస్పూను
ఆరెంజ్‌జ్యూస్‌: పావులీటరు
వెన్న: అరకప్పు
దాల్చినచెక్కపొడి: టీస్పూను
బాదంపొడి: అరకప్పు
 మైదా: పావుకిలో
బేకింగ్‌పౌడర్‌: 3 టీస్పూన్లు
 బేకింగ్‌సోడా: అరటీస్పూను
ఉప్పు: అరటీస్పూను

తయారుచేసే విధానం  
ముందుగా ఓవెన్‌ను  180 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర వేడిచేసి ఉంచుకోవాలి.  సుమారు పది అంగుళాల ఎత్తు ఉన్న కేకుటిన్నుకి నెయ్యి రాసి మైదాపిండి చల్లి పక్కన ఉంచాలి. మైదాలో బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు, దాల్చినచెక్క పొడి వేసి కలపాలి.  మరో గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి బాగా గిలకొట్టాలి. అందులోనే తేనె, వెన్న, ఆరెంజ్‌జ్యూస్‌ వేసి బాగా కలపాలి. తరవాత బాదంపొడి కూడా వేసి కలిపి ఈ మిశ్రమాన్ని మైదా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేకు టిన్నులో వేసి ఓవెన్‌లో పెట్టి సుమారు 45 నిముషాల పాటు  బేక్‌ చేయాలి. చల్లారిన తరవాత ముక్కలుగా ఆ  ముక్కల  పైన తేనెను వేసి సర్వ్ చేసుకోవాలి. 

చాక్లెట్ కేక్


చాక్లెట్ కేక్

కావలసిన పదార్ధాలు:

మైదాపిండి - 250 గ్రాములు
కొకో పౌడర్‌ - 4 టేబుల్‌ స్పూన్లు
వెన్న - 250 గ్రాములు
చక్కెర - పావు కేజీ
గుడ్లు -  4
పెరుగు - 1 కప్పు
వెనిల్లా ఎస్సెన్స్‌: 1 టీ స్పూన్‌
బేకింగ్‌ పౌడర్‌ - 2 టీ స్పూన్లు
సాల్ట్‌ -  చిటికెడు

తయారు చేసే విధానం:

ముందుగా ఒవెన్‌ను 180 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకూ వేడి చేయండి. తరువాత  ఒక టిన్‌ తీసుకొని దాని చుట్టూ నెయ్యి రాయ్యాలి. ఇప్పుడు మైదాలో బేకింగ్‌ పౌడర్‌, సాల్ట్, కొకో పౌడర్‌ వేసి బాగా కలపాలి. వెన్నలో ఉండలు లేకుండా  చేసుకొని అందులో  చక్కెర పొడి కలిపి ఎగ్‌ బీటర్‌తో   బీట్‌ చేయాలి. తర్వాత ఒక్కొక్క గుడ్డూ పగులకొట్టి ఇందులో కలపాలి. ఇప్పుడు కొకో పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత  మైదా పిండిని మూడు స్పూన్ల చొప్పున అందులో వేస్తూ కొద్దిగా  పెరుగును కూడా వేస్తు పేస్ట్ లా చేసుకోవాలి. చివరిలో వెనిలా  ఎస్సెన్స్‌ కలుపుకొని కేక్‌ టిన్‌లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసి ఒవెన్‌ ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో  వుంచి 40 నిముషాలు బేక్ చెయ్యాలి.

డ్రైఫ్రూట్స్‌ కేక్‌

డ్రైఫ్రూట్స్‌ కేక్‌


కావల్సినవి: 
మైదా - 200 గ్రాములు
డ్రైఫ్రూట్స్‌ - ఒక కప్పు
పాలు - అర కప్పు
ఆరెంజ్ జ్యూస్ - ఒక కప్పు
వెన్న - 150 గ్రాములు
యాలకులపొడి - అరచెంచా,
బేకింగ్‌ పొడి - ఒకటిన్నర స్పూన్
పంచదార - 150 గ్రాములు
మిల్క్‌మెయిడ్‌ - యాభై గ్రాములు
మిక్సెడ్ ఫ్రూట్ ఎసెన్సు - కొద్దిగా

తయారీ : 

ముందుగా పాత్రలో వెన్న, పంచదార, మిల్క్‌మెయిడ్‌, పాలు, యాలకులపొడి తీసుకుని బాగా కలపాలి. తరువాత  డ్రైఫ్రూట్స్‌ ఆరెంజ్ జ్యూస్ వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు  మైదా వేసి బాగా కలిపి చివరిలోమిక్సెడ్ ఫ్రూట్ ఎసెన్సు వేసుకుని మరోసారి కలపాలి. ఓవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల దగ్గర వేడిచేసి పెట్టుకోవాలి. తరువాత కేక్‌ టిన్ కి వెన్న రాసి ఈ మిశ్రమాన్ని అందులో వేసుకుని 35 నిముషాల పాటు  బేక్‌ చేయ్యాలి.

ఫ్రూట్ కేక్



ఫ్రూట్ కేక్



కావలసిన పదార్థాలు:
 గుడ్లు - నాలుగు
 మైదా - రెండు కప్పులు
 పంచదార - 120 గ్రాములు,
మిక్స్‌డ్ ఫ్రూట్ ఎసెన్స్ - అర స్పూన్
పెరుగు - రెండు కప్పులు
టూటి ఫ్రూటీలు - ఒక కప్పు
లెమన్ ఎల్లో కలర్ - నాలుగు చుక్కలు.

తయారుచేయు విధానం: 

ముందుగా గుడ్డులో తెల్లసొనని వేరు చేసి బాగా గిలకొట్టాలి.  అందులో పంచదార పొడి వేసి మళ్లీ గిలకొట్టాలి. తరువాత పచ్చసొన కూడా వేసి బాగా గిలకొట్టాలి. ఇందులో మైదా, ఎసెన్స్, లెమన్ ఎల్లో కలర్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ మౌల్డ్ లో పెరుగు రాసి ఈ మిశ్రమాన్ని వేయాలి. దీన్ని ఓవెన్‌లో 180 డిగ్రీల  వద్ద 30 నిమిషాలపాటు బేక్ చేయాలి. తరువాత టూటి ఫ్రూటీలతో కేక్‌ని డెకరేట్ చేసుకోవాలి.

యాపిల్‌ కేక్‌




యాపిల్‌ కేక్‌
కావలసినవి :

యాపిల్స్‌-మూడు,
బటర్‌కాగితం-ఒకటి
మైదా-రెండు కప్పులు
క్యాస్టర్‌ షుగర్‌-250 గ్రాములు
వెన్న- 100 గ్రాములు
గుడ్లు-రెండు
దాల్చిన చెక్కపొడి-రెండు స్పూన్లు
పాలు -అర లీటర్
బేకింగ్‌ పౌడర్ - ఒక స్పూన్
వంట సొడా - ఒక స్పూన్
గరంమసాలా- అర స్పూన్

తయారుచేసే విధానం :

ఓవెన్‌ను ముందుగా175 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. కేక్‌ ఉంచే పాత్రకు బటర్‌ కాగితాన్ని రాయాలి. మైదా, బేకింగ్‌పొడి, వంటసోడా, గరంమసాలా దాల్చిన చెక్కపొడులను విడివిడిగా జల్లించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో క్యాస్టర్‌ షుగర్‌ వెన్న తీసుకుని బాగా గిలక్కొట్టాలి. ఇందులో కోడిగుడ్ల సొన చేర్చి ఆ తరువాత ముందుగా జల్లించిన పొడులు, సన్నగా తరిగిన యాపిల్‌ ముక్కల్ని కలపాలి. చివరగా పాలు చేర్చి కేక్‌ పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ట్రేలో నీళ్లు పోసి నలభై నిమిషాల పాటు బేక్‌ చేయాలి. అంతే యాపిల్‌ కేక్‌ రెడీ

ఆరెంజ్‌ కేక్‌ రెసిపి

ఆరెంజ్‌ కేక్‌ రెసిపి

కావలసిన పదార్థాలు: 
ఆరెంజెస్‌ - 2 
కేక్‌ పౌడర్‌ - 4 కప్పులు
గుడ్లు - 6
అల్యూ మినియం పేపర్‌ - చిన్నది
పాలు - పావు కప్పు
వెన్న - అర కప్పు
చక్కెర - ఒకటిన్నర కప్పు

తయారీ 
ముందుగా  ఒక గిన్నెలో వెన్న తీసుకుని బాగా కలపాలి. దీనికి పాలు, చక్కెర, కోడిగుడ్ల సొన, వలిచిన ఆరెంజ్ తొనలు వేసి బాగా కలపాలి. ఇందులో కేక్‌ పౌడర్‌ని నెమ్మదిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తరువాత  కేక్ పాన్ తీసుకుని చుట్టూ ఆయిల్ రాసి మిశ్రమాన్నికేక్‌ పాన్‌ పోయాలి. దీన్ని ఓవెన్‌లో 350 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో ఒక ఇరవై నిముషాలు పాటు బేక్‌ చేయాలి. తరువాత కేక్ పాన్ నుంచి కేక్ ను బయటకి తీసి క్రీమ్ తో డెకరేట్ చేసుకుని ముక్కలు కట్ చేసి సర్వ్ చేసుకోవాలి....

Thursday, June 12, 2014

వెనిల్లా ఎసెన్స్‌తో కేక్‌





వెనిల్లా ఎసెన్స్‌తో కేక్‌

కావలసిన పదార్థాలు:
పంచదార పొడి : 50గ్రా, గుడ్డు : 1, పాలు : 15 మి.లీ, వెన్న : 30గ్రా, మైదాపిండి : 50గ్రా, బేకింగ్ పౌడర్ : 1/4 చెంచా, వెనిల్లా ఎస్సెన్స్ : కొన్ని చుక్కలు, ఎండు ద్రాక్ష : 30గ్రాములు.

తయారి:
వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేయాలి. వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమానికి ఎండు ద్రాక్ష చేర్చాలి. మైదాను కూడా కలిపి, పిండి జారుగా ఉండేందుకు కాసిని పాలు కలపాలి. ఇప్పుడు పిండిని పేపర్ కప్స్‌లో పోసి 400 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 25 నిమిషాల పాటు బేక్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన కేక్ రెడీ.

వెన్నకేక్‌ (BUTTER CAKE)


కావలసిన పదార్థాలు..వెన్న - అర కప్పు
చక్కెర - ఒకటిన్నర కప్పు
గుడ్లు - 6
బ్రాందీ - నాలుగు టేబుల్‌ స్పూన్లు
తొక్కతీసి కట్‌ చేసిన ఆరెంజ్‌ పండ్లు - 2
కేక్‌ పౌడర్‌ - నాలుగు కప్పులు
అల్యూమీనియం పేపర్‌ - చిన్నది
పాలు - పావు కప్పు
చక్కెర పొడి - ఒక కప్పు
కొబ్బరి తురుగు - ఇష్టం వుంటే
తయారు చేసే విధానం...
పదార్థాలన్నీ గది ఉష్ణోగ్రత వద్ద వుండేలా చూసుకోవాలి. తరు వాత ఒక గిన్నెలో వెన్న వేసుకుని బాగా మిక్స్‌ చేయాలి. చక్కెర, గుడ్లు కూడా బాగా వేసి కలుపు కోవాలి. అందులో ఆరెంజ్‌ ము క్కలు కూడా వేసి బాగా కలపా లి. ఇందులో పాలు, పిండి నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. మిగిలిప పదార్థాలు కూడా వేసు కుని కలుపుకోవాలి. తరువాత మిశ్రమాన్ని మరీ మందంగా లేదా మరీ పలుచగా గాకుండా కేక్‌ పాన్‌లో వేసుకోవాలి. మిశ్ర మాన్ని వేసుకునే ముందు దానిపై కొద్దిగా వెజిటెబుల్‌ ఆయిల్‌ని రాయాలి. దీన్ని ఓవెన్‌లో పెట్టుకోవాలి. 45 నిమి షాల పాటు ఓవెన్‌లో 350 ఫార న్‌ీహ ట్‌ వద్ద వుంచాలి. ఎంతో రుచిగా వుండే కేక్‌ రెడీ... దీనిపై క్రీమ్‌తో డెకరేషన్‌ చేసుకోవాలి. దానిపై చెర్రీస్‌ అమరిస్తే మరింత బాగుంటుంది.

బనానా కేక్‌



కావలసిన పదార్థాలు..
స్వీట్‌ లేకుండా ఉండే కోవా - ఒక కప్పు
డ్రై మిల్క్‌ పౌడర్‌ - పావు కప్పు
బేకింగ్‌ సోడా - రెండు చెంచాలు
ఉప్పు - కొద్దిగా
బాగా పండిన అరటి పండు - ఒకటి
గుడ్లు - రెండు
చక్కెర - ఒక కప్పు
మజ్జిగ - కొద్దిగా
వెనీలా - పావు కప్పు
మిక్స్‌డ్‌ ఫ్లోర్‌ - పావు కప్పు
తయారు చేసే విధానం...
పిండి, కోవా, మిల్క్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు అన్నీ ఒక గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. బనానాను ప్యూరీలాగా చేసుకోవాలి. అందులో చక్కెర, గుడ్డులోని తెల్లసోనా, మజ్జిగ, వెనీలా అన్నీ కలుపుకుని పిండిలో కలుపుకోవాలి. దీన్ని కాస్త మృదువుగా అయ్యేవరకు ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి. దీన్ని కేక్‌ తయారు చేసుకునే పాత్రలో వేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్‌ అమర్చుకోవాలి. తరువాత ఓవెన్‌లో పెట్టాలి.

ఓవెన్‌ టెంపరేచర్‌ 350 ఫారన్‌ హీట్‌ వుండేలా చూడాలి. అందులో 25 నిమిషాల పాటు ఉంచాలి. 
బయటికి తీసిన తరువాత అరటి పండు ముక్కలు, చర్రీలతో అలంకరించుకుంటే ఎంతో బాగుంటుంది.
ఇందులో ఒక గ్రాము ప్రోటీను, ఫ్యాట్‌ 0 శాతం, సోడియం 42 గ్రామ్స్‌, 15 గ్రాములు, కార్బోహైడ్రేట్స్‌ 15 గ్రామ్స్‌, 65 కాలరీస్‌ వుంటాయి.

యాపిల్‌ కేక్‌



కావలసిన పదార్థాలు..
తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు - ఐదు కప్పులు
చక్కెర - ఒక కప్పు
బ్లాక్‌ రెయిసిన్స్‌ - ఒక కప్పు
డ్రై ఫ్రూట్స్‌ - ఒక కప్పు
పీకాన్స్‌ - అరకప్పు
వెజిటేబుల్‌ ఆయిల్‌ - పావు కప్పు
వెనీలా ‚ - రెండు స్పూన్లు
గుడ్డు - బాగా బీట్‌ చేసినది ఒకటి
మిక్స్‌డ్‌ కేక్‌ ఫ్లోర్‌ - రెండున్నర కప్పులు
బేకింగ్‌ సోడా - ఒకటిన్నర స్పూను
దాల్చిన చెక్క పొడి - ఒక స్పూను
తయారు చేసే విధానం...
ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో యాపిల్‌ ముక్కలు, చక్కెర, పీకాన్స్‌, రెయిసిన్స్‌ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆయిల్‌లో వెనీలా, గుడ్డు వేసి కలపాలి. పిండిలో సోడా వేసి బాగా కలపి వీటన్నిటినీ యాపిల్‌ మిశ్రమంలో కలిపేయాలి. అన్నిటినీ బాగా కలిపాలి. ముందుగా కేక్‌ పాన్‌ని వేడ చేయాలి. దానిమీద కొద్దిగా వెజిటెబుల్‌ ఆయిల్‌ని రాసుకోవాలి. తరువాత మిశ్రమాన్ని పరిచి దానిపై జీడిపప్పు వంటివి వేసుకోవచ్చు. దీన్ని 35 నుండి 40 నిమిషాల పాటు ఓవెన్‌లో పెట్టాలి. టెంపరేచర్‌ 350 ఫారన్‌ హీట్‌ వుండేలా చూసుకోవాలి. దీన్ని సర్వ్‌ చేసే ముందు ఫ్రిజ్‌లో పెట్టి కాస్త కూల్‌గా వుండేలా అందించాలి.
ఇందులో కాలరీస్‌ 18, ఫ్యాట్‌ 5 గ్రా, కొలెస్ట్రాల్‌ - 11 మిగ్రా, సోడియం 68 మిగ్రా వుంటాయి.

గుమ్మడికాయ కేక్‌


కావలసిన పదార్థాలు.
 చక్కెర - 2 కప్పులు
ఆయిల్‌ - ఒక కప్పు
గుడ్లు - నాలుగు
కేక్‌ పౌడర్‌ - 3 కప్పులు
బేకింగ్‌ పౌడర్‌-రెండు టేబుల్‌ స్పూన్లు
బేకింగ్‌ సోడా-రెండు టేబుల్‌స్పూన్లు
దాల్చిన చెక్క పొడి - ఒక స్పూను
జాజికాయ పొడి - పావు స్పూను
లవంగాల పొడి - అర టేబుల్‌ స్పూను
ఉప్పు - కొద్దిగా
గుమ్మడికాయ ప్యూరీ - ఒక చిన్న టిన్‌
చాకొలేట్‌ చిప్స్‌ - 6
నట్స్‌ - అర కప్పు
తయారు చేసే విధానం...
పైన చెప్పిన పదార్థాలన్నీ ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పదా ర్థాన్ని ఒక అరగంట పా టు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి మృదువుగా మారుతుంది. దీన్ని కేక్‌ పాన్‌లోకి తీసుకుని ఓవెన్‌లో 350 ఫారన్‌ హీట్‌ వద్ద పెట్టాలి. ఇది తయారుకావడానికి 50-60 నిమిషాలు పడుతుంది. బయటికి తీసిన తరువాత అందంగా అలంకరించుకోవాలి. కేక్‌ రెడీ...

బనానా జెల్లీ

బనానా జెల్లీ


కావలసిన పదార్థాలు.
వెనీలా కస్టర్డ్‌ పొడి - 50 గ్రా
చక్కెర - 100 గ్రా
పాలు - అర లీటరు
అరటి పండ్లు - 4
తయారు చేసే విధానం...
గోరువెచ్చని నీటిలో జెల్లీపేకెట్‌ నుండి తీసిన పౌడర్‌ను గరిటెతో కలుపుతూ పోస్తే ఆ పొడి కరిగి పోయి ఎర్రని నీళ్ళు తయారవుతాయి. ఆ నీళ్ళని చల్లార్చి, గుండ్రంగా కోసిన అర టిపండ్లను కలిపి జెల్లీ మూసలో గాని, ట్రేలోగానీ పోసి ఫ్రిజ్‌లో ఒక గంట సేపు ఉంచితే జెల్లీ తయారవుతుంది. దీనిని మూస నుండి బయటకు తీసి పెద్ద సైజు ముక్క లుగా కోసి, కస్టర్డ్‌ సాస్‌తో తింటే మంచి రుచిగా వుంటుంది.
కస్టర్డ్‌ సాస్‌ తయారీ: ఒక కప్పు చల్లని నీళ్ళలో కస్టర్డ్‌ పౌడర్‌ వుండలు లేకుండా కలుపుకుని, దానిలో మరుగుతున్న పాలలో పోసి గరిటెతో తిప్పుతుంటే సాస్‌ తయారవు తుంది. దానిలో చక్కెర కలిపి, గిన్నె దించి బయట చల్లార్చి, ఫ్రిజ్‌లో పెట్టాలి.

చాక్లెట్ కేక్

చాక్లెట్ కేక్

కావలసిన వస్తువులు:
మైదా – 1 3/4 కప్పు
కోకో పౌడర్ – 1/4 కప్పు
ఉప్పు – చిటికెడు
తాజా గడ్డ  పెరుగు – 1 కప్పు
పంచదార  పొడి – 1 కప్పు
బేకింగ్ పౌడర్ – 1/2 tsp
వంట సోడా – 1 tsp
రిఫైండ్ నూనె – 1/2 కప్పు
లేదా వెన్న -1/2  కప్పు
వెనిల్లా ఎస్సెన్స్ – 1 tsp
జీడిపప్పు, అక్రోట్లు, బాదాం – 1/2కప్పు
పాలు – అరకప్పు

మైదా , కోకో  పౌడర్, ఉప్పు కలిపి జల్లించాలి. పెరుగులో పంచదార పొడి కలిపి బాగా గిలక్కొట్టాలి. ఇందులో వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తర్వాత కరిగించిన వెన్న లేదా నూనె, వెనిల్లా ఎస్సెన్స్ కలిపి మరి కొద్ది సేపు గిలక్కొట్టాలి.  జల్లించిన మైదా, సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. పిండి జారుడుగా ఉండడానికి అవసరమైతే కొద్దిగా పాలు కలపాలి. ఒక కేకు టిన్నులో లోపల భాగమంతా వెన్న రాసి ,కొద్దిగా మైదా వేసి మొత్తం గిన్నెకంతా అంటుకునేట్టు కదిపి  కలిపి ఉంచుకున్న కేకు మిశ్రమాన్ని వేసి ముందే వేడి చేసుకున్న ఓవెన్ లో 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 45 – 50 నిమిషాలు బేక్ చేయాలి. రుచికరమైన చాక్లెట్ కేక్ రెడీ అయింది. మీకు కావాలంటే ,ఓపిక ఉంటే ఐసింగ్ చేసుకోండి లేదంటే అలాగే ముక్కలు చేసి సర్వ్ చేయండి..

చాకొలేట్‌ కేక్‌

చాకొలేట్‌ కేక్‌


కావలసిన పదార్ధాలు:
మైదాపిండి: 250 గ్రా.
బేకింగ్‌ పౌడర్‌: 2 టీ స్పూన్లు
సాల్ట్‌: 1 చిటికెడు
కొకోవా పౌడర్‌: 3-4 టేబుల్‌ స్పూన్లు
వెన్న: 250 గ్రా.
పొడిచేసిన చక్కెర: 250 గ్రా.
గుడ్లు: 4
మజ్జిగ: 1 కప్పు
వెనిల్లా ఎస్సెన్స్‌: 1 టీ స్పూన్‌

తయారు చేసే విధానం:
ఒవెన్‌ను ముందుగా 180 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకూ వేడి చేయండి. ఒక టిన్‌ తీసుకొని దాని చుట్టూ నెయ్యి పోయండి. మైదాలో బేకింగ్‌ పౌడర్‌, సాల్టు, కొకోవా పౌడర్‌ వేసి బాగా కలపండి. వెన్నలో ఎలాంటి గడ్డలూ లేకుండా చేసుకొని అందులో పొడి చేసిన చక్కెర కలిపి ఎగ్‌బీటర్‌తో కలిసేలా కొట్టాలి. నురగ వచ్చే దాకా దీనిని బీట్‌ చేయాలి. తర్వాత ఒక్కొక్క గుడ్డూ పగులకొట్టి ఇందులో కలపాలి. తర్వాత కొకోవా కలుపుకున్న మైదా పిండిని రెండు మూడు స్పూన్ల చొప్పున అందులో వేస్తూ కొద్దిగా మజ్జిగ కూడా పోస్తూ మెత్తగా అయ్యేలా చూసుకోవాలి. చివరగా వెనెల్లా ఎస్సెన్స్‌ కలుపుకొని కేక్‌ టిన్‌లో పోసి ఒవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో అరగంట, నలభై నిమిషాల పాటు ఉంచి తీసెయ్యాలి.

స్ట్రాబెర్రీ స్పాంజ్ కేక్

స్ట్రాబెర్రీ స్పాంజ్ కేక్


కావలసిన పదార్థాలు :
కోడిగ్రుడ్లు... ఐదు
పంచదార... రెండు కప్పులు
మైదాపిండి... రెండు కప్పులు
కేక్‌జెల్... ఒక కప్పు
కోకో పౌడర్.... ఒక కప్పు
స్ట్రాబెర్రీలు... ఒక కప్పు
చాక్‌లెట్... అరకప్పు
లెమన్ జ్యూస్... రెండు టీస్పూన్లు
బట్టర్... పావుకేజీ
షుగర్ సిరప్... తగినంత

తయారీ విధానం :
ముందుగా కోడిగ్రుడ్లను పగులగొట్టి ఒక పాత్రలో వేసి బాగా నురగ వచ్చేలాగా గిలక్కొట్టాలి. తరువాత అందులో కేక్‌జెల్, పంచదార, మైదాపిండి ఒకదాని తరువాత ఒకటి వేసి పిండి ముద్దలా చేసుకోవాలి. దీనికి కోకో పౌడర్, లెమన్ జ్యూస్‌ను కూడా కలిపి పిండిని బాగా మర్దనా చేసి ఆపై, ఈ మిశ్రమాన్ని కేక్ ట్రేలో సర్ది బేక్ చేసుకోవాలి.

ఈలోపు చాక్‌లెట్, బట్టర్ కలుపుకుని హెవీ క్రీముని తయారు చేసుకోవాలి. కేక్ తయారవగానే మీ కిష్టమైన షేప్‌లో కట్ చేసుకుని, కేక్‌పై షుగర్ సిరప్ పరచుకునేలా జాగ్రత్తపడాలి. మరొక లేయర్ కేక్‌ని ఉంచి దానిపై చాక్‌లెట్ హెవీ క్రీముని, స్ట్రాబెర్రీ ముక్కలను పోయాలి.

ఇలా మీకు నచ్చిన విధంగా మూడు పొరలుగా కేక్‌ను అమర్చుకోవచ్చు. పూర్తి అమరిక తరువాత కేక్‌లను ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అతిథులకు అందించండి

డ్రైఫూట్ బటర్ కేక్


కావలసిన పదార్థాలు :

మైదాపిండి... 100 గ్రాములు 
బేకింగ్ పౌడర్... అరచెంచా 
ఎండు ద్రాక్ష.. పది 
వెనిల్లా ఎసెన్స్... అర టీస్పూన్ 
బటర్... 50 గ్రాములు
చక్కెర పొడి...100 గ్రాములు.
గుడ్డు... రెండు
పాలు...ఒక కప్పు 

తయారీ విధానం :
ముందుగా మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లెడలో జల్లించి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండుద్రాక్షలను కూడా శుభ్రం చేసుకుని వాటైపైగల తొడిమలు తీసి తయారు చేసుకోవాలి. తర్వాత జల్లించిన మైదాపిండి, బేకింగ్ పౌడర్‌లతో వెన్నను, పంచదార పొడిని బాగా కలిపి క్రీమ్‌లాగా తయారు చేసుకోవాలి.

వెనిల్లా ఎస్సెన్స్‌తో కలిపి గిలకొట్టిన గుడ్డు సొనను క్రీంకు బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమానికి శుభ్రం చేసిన ఎండు ద్రాక్షను చేర్చి, మైదాను కూడా కలిపి, అరకప్పు పాలు కలుపుకుంటే పిండి జారుగా తయారవుతుంది. జారుగా ఉండే, క్రీమింగ్ చేసుకున్న పిండిని పేపర్ కప్స్‌లో పోసి 500 డిగ్రీల ఫారెన్‌హీట్‌లో 30 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టౌవ్ మీద నుంచి దించి కేక్‌పై చెర్రీ పండ్లతో కానీ, మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో, క్రీమ్‌తోనూ అలంకరించుకుని సర్వ్‌చేయొచ్చు.