Thursday, July 17, 2014

క్యారెట్ శాండ్‌విచ్ స్ప్రెడ్


కావలసిన పదార్థాలు :
మొలకెత్తిన పెసలు... రెండు కప్పులు
క్యారెట్ ముక్కలు... ఒక కప్పు
ఉల్లిపాయముక్కలు... ఒక కప్పు
కొత్తిమీర... కొద్దిగా
బ్రెడ్... ఒక ప్యాకెట్
క్యాప్సికమ్ ముక్కలు... ఒక కప్పు
నూనె, ఉప్పు... తగినంత

తయారీ విధానం :
మొలకెత్తిన పెసలు ఉడకబెట్టి, వడకట్టి ఉంచాలి. పాన్‌లో నూనె, ఆవాలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిముక్కలను వేసి వేయించాలి. దాంట్లో ఉడికించిన పెసలు కలిపి మరో ఐదు నిమిషాలపాటు వేయించి చివర్లో కొత్తిమీర కలపాలి.ఇప్పుడు బ్రెడ్‌కు చుట్టూ బ్రౌన్ కలర్లో ఉన్న దాన్నంతా తీసివేసి... నెయ్యిపూసి, కడాయిలో గోల్డ్ కలర్ వచ్చేదాకా రెండువైపులా కాల్చాలి.

ఇలా చేసిన ప్రతి రెండు బ్రెడ్ పీసుల మధ్యలో పైన తయారు చేసుకున్న పెసల మిశ్రమాన్ని ఉంచి తినాలి. అంతే క్యారెట్ శాండ్‌విచ్ స్ప్రెడ్ తయారైనట్లే..! ఎన్నో పోషకాలు కలగలసిన ఈ వంటకం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.

No comments:

Post a Comment