Wednesday, July 16, 2014

పెప్పరోని పిజ్జా


 

కావలసినవి: మైదాపిండి - 140 గ్రా.
గుడ్డులోని పచ్చసొన - టీ స్పూన్
నీళ్లు - 10 మి.లీ
పాలు - 5 మి.లీ
ఉప్పు - రుచికితగినంత

తయారి:
పిజ్జా బేస్ కోసం మైదా, పచ్చసొన, నీళ్లు, పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండి ముద్దపై ఒక గిన్నెను బోర్లించి, గంట సేపు ఉంచాలి.



పిజ్జా పైన...
టొమాటో ప్యూరీ - 20 గ్రా.
మోజరెల్లా ఛీజ్ - 100 గ్రా.
చికెన్ సాసేజ్ (మార్కెట్లో లభిస్తుంది) - 80 గ్రా.
చికెన్ సలామీ - తగినంత, వెల్లుల్లిపేస్ట్ - 5 గ్రా.
ఎండుమిర్చి (కచ్చాపచ్చాగా దంచాలి) - అర టీ స్పూన్
 Homemade Pizza (photo)


తయారి: పాన్‌లో పిండి మిశ్రమాన్ని వెడల్పుగా పరచి బేస్ తయారుచేయాలి. దాని పైన టొమాటో ప్యూరీ, మోజరెల్లా ఛీజ్, చికెన్ సాసేజ్, చికెన్ సలామి, వెల్లుల్లి, పండు మిర్చి వేసి, పైన మూత పెట్టాలి. అవెన్‌లో అయితే పది నిమిషాలు, స్టౌ మీద అయితే పిజ్జా ఉడికేంత వరకు సన్నని మంట మీద ఉంచాలి.

No comments:

Post a Comment