Monday, July 7, 2014

ఓట్స్ శాండ్ విచ్

Picture
కావలసిన వస్తువులు: 
ఓట్స్ – 1/4 కప్పు 
బ్రెడ్ స్లైసులు – 6 
నెయ్యి – 1 టీస్పూన్ 
గడ్డ పెరుగు – 1 కప్పు 
క్యాప్సికమ్ తురుము – 2 టీ స్పూన్ 
క్యారట్ తురుము – 3 టీ స్పూన్ 
వేయించిన జీలకర్ర – చిటికెడు
టమాటా సాస్ – 1 టీ స్పూన్ 
కొత్తిమిర – కొద్దిగా 
మిరియాల పొడి – చిటికెడు 
ఉప్పు – తగినంత 
వెన్న – 4 టీ స్పూన్ 

తయారుచేసే పద్ధతి :
  • పెరుగును ఒక బట్టలో కట్టి నీరంతా పోయేవరకు వ్రేలాడదీయాలి.
  • ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి ఓట్స్‌ని దోరగా వేయించుకోవాలి.
  • ఒక గిన్నెలో వేయించిన ఓట్స్, క్యారట్ తురుము, క్యాప్సికమ్ తురుము, పెరుగు, టమాటా సాస్, మిరియాలపొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమిర వేసి బాగా కలియబెట్టాలి.
  • బ్రెడ్ స్లైసుల అంచులు తీసేసి పలుచగా వెన్న రాయాలి.
  • దీనిమీద చెంచాడు పెరుగు, కూరగాయల మిశ్రమాన్ని పరిచి ఇంకో వెన్న రాసిన బ్రెడ్ స్లైసుతో మూసేసి వేడి పెనం మీద కొద్దిగా వెన్న వేసుకుంటూ రెండు వైపులా బంగారురంగు వచ్చేవరకు కాల్చుకోవాలి లేదా ఓవెన్‌లో కూడా కాల్చుకోవచ్చు..

No comments:

Post a Comment