Showing posts with label పుడ్డింగ్. Show all posts
Showing posts with label పుడ్డింగ్. Show all posts

Thursday, July 17, 2014

బట్టర్ పుడ్డింగ్

బ్రెడ్ అండ్ బట్టర్ పుడ్డింగ్-బ్రేక్ ఫాస్ట్  రిసిపి
కావల్సిన పదార్థాలు: 
బ్రెడ్: 10 slice 
పాలు: 300 ml 
వెన్న: 70gms(కరిగించుకోవాలి) 
బ్రౌన్ షుగర్: 80gms 
స్పైస్ పొడి: 2tbsp
 గుడ్లు: 2 (కొట్టిన)
 డ్రై ఫ్రూట్స్: 180gms(blackcurrant, orange peels and raisins) 
జాజికాయ: 1tbsp(తురుము కోవాలి) 

తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో బ్రెడ్ ముక్కలను బ్రేక్ చేసి పెట్టుకోవాలి 
2. తర్వాత ఈ బ్రెడ్ ముక్కల మీద పాలు పోయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా కలుపుకోవాలి. 
3. కలిపిన ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. 
4. తర్వాత హాఫ్ లీటర్ బేకింగ్ డిష్ తీసుకొని, దానికి బట్టర్ ను రాసిపెట్టాలి. 
5. ఇప్పుడు కరిగించి పెట్టుకొన్న వెన్న, బ్రౌన్ షుగర్, గుడ్లు, మరియు స్పసీలను అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి. 
6. తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా పాలతో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బ్రెడ్ పేస్ట్ ను, పాలతో సహా ఇందులో పోయాలి. 
7. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి, బాగా మిక్స్ చేసుకోవాలి. 
8. తర్వాత ఈ మొత్తం మిశ్రమానికి జాజికాయ తురుమును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
 9. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బేకింగ్ వోవెన్ లో పెట్టి 35నిముషాలు, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకూ బేక్ చేయాలి. అంతే ఇప్పుడు మీకు నోరూరించే బ్రేక్ ఫాస్ట్ రిసిపి బట్టర్ పుడ్డింగ్ రెడీ. ఈ నోరూరించే పుడ్డింగ్ ను చల్లచల్లగా లేదా వేడిగా కూడా తినవచ్చు.

క్రిస్మస్ పుడ్డింగ్

క్రిస్మస్ పుడ్డింగ్ - క్రిస్మస్ స్పెషల్
కావలసిన పదార్థాలు:
పాలు: 1ltr 
పంచదార: సరిపడినంత
 ఆరెంజ్ తొనలు: 12-14(గింజలు తీసినవి) 
యాపిల్‌: 1(పై పొట్టు, గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగాలి) 
ఆపిల్: 1 (తోలుతో సహా లావుపాటి ముక్కలుగా తరిగినవి) 
కిస్‌మిస్‌లు, బాదం, జీడిపప్పు, పలుకులు: 1cup 
బ్రెడ్‌ స్లైస్: 4-6 
బేస్‌ తయారీకి చిన్నచిన్న ముక్కలుగా చిదిమిన బిస్కెట్‌లు : 2cups 
వెన్న: 3tbsp 

తయారు చేయు విధానం: 
1. ముందుగా బేస్‌ తయారీకి: బిస్కట్‌ ముక్కలకి వెన్నని బాగా పట్టించి ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ డిష్‌ అడుగుభాగంలో సర్ది కదలకుండా ఉండేలా చేతులతో ఒత్తండి. 
2. ఈ గిన్నెని గంటపాటు ఫ్రిజ్‌ లో ఉంచండి. ఆలోపు ఫుడ్డింగ్‌ ని తయారుచేసుకోండి. తాజా బ్రెడ్‌ ముక్కలని చిన్నచిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోండి.
 3. తర్వాత మందపాటి గిన్నెలో పాలుపోసి సగమయ్యేదాకా సన్నని సెగమీద మరిగించండి. దించి పంచదార, బ్రెడ్‌ముక్కలు వేసి కలిపి చల్లారనివ్వండి. 
4. తరువాత కోసి ఉంచుకున్న ఆపిల్‌ ముక్కలు, డ్రైఫ్రూట్స్‌ వేసి కలిపి బేస్‌ తయారుచేసి ఉంచుకున్న గిన్నెలో పోయండి. గిన్నెను కుక్కర్‌లో పెట్టి పది పన్నెండు నిమిషాలు సన్నని సెగమీద ఉడికించండి. అప్పటికి సగం ఉడుకుతుంది. 
5. దానిమీద చుట్టూ గుండ్రంగా ఆపిల్‌ముక్కలు సర్ది మళ్లీ పన్నెండు నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. తరువాత దించి మూత తీసి చల్లారనివ్వాలి. దీనిని కనీసం రెండుమూడు గంటల ఫ్రిజ్‌ లో ఉంచి తింటే చాలా బాగుంటుంది.

Sunday, July 6, 2014

వర్మిసెల్లి పుడ్డింగ్


కావలసిన పదార్థాలు :
వెర్మిసెల్లి... 200 గ్రాములు
పాలు... ఒక లీటర్
పంచదార... వంద గ్రాములు
నెయ్యి... అరకప్పు
యాలక్కాయలు... మూడు
కిస్‌మిస్‌లు... ఒక టీస్పూన్
జీడిపప్పు... ఒక టీస్పూన్

తయారీ విధానం :
ముందుగా వెర్మిసెల్లిని నాలుగు స్పూన్ల నెయ్యితో వేయించాలి. అందులో 1.5 కప్పుల నీరు పోసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. అందులో పాలు పోసి సన్నని సెగపై చిక్కబడేంత వరకు ఉడికించాలి.

తరువాత దీనికి పంచదార కలిపి పుడ్డింగ్ చిక్కబడేంత వరకు ఉంచాలి. జీడిపప్పు నేతిలో వేయించి ఉంచుకోవాలి. పుడ్డింగ్ చిక్కబడిన తరువాత యాలుకుల పొడి, జీడిపప్పు వేసి దించుకోవాలి. అంతే వెర్మిసెల్లి ఫుడ్డింగ్ సిద్ధమైనట్లే...!

Tuesday, July 1, 2014

గ్లూకో పుడ్డింగ్


గ్లూకో పుడ్డింగ్ : పాలు, జీడిపప్పు, గ్లుకోస్ బిస్కెట్స్, ఎండుద్రాక్ష, బాదం పప్పు, కుంకుమ పౌడర్, పంచదార, కస్టర్డ్ పౌడర్, కోకో పుడ్డింగ్ పౌడర్.

ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడయ్యే లోపు 4, 5 స్పూన్ ల కస్టర్డ్ పౌడర్ లో చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తరవాత కాస్త నీళ్లు పోసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని మరిగిన పాలలో కలిపి అది చిక్కబడేవరకు కలుపుతూ మరగనివ్వాలి. ఆ తరవాత దానిని దించి పక్కన పెట్టేయాలి.
ఒక గిన్నెలో బిస్కెట్ లను పేర్చి , దాని పై కొన్ని డ్రై ఫ్రూట్ వేసి ఆ పై కస్టర్డ్ మిశ్రమాన్ని వేయాలి. దాని పై మళ్ళీ బిస్కెట్ లను పేర్చి, డ్రై ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ వేయాలి, ఇలా వీలైనన్ని లేయర్ లు పేర్చుకోవాలి. ఆ తరవాత కోకో పౌడర్ తీసుకుని అందులో కాస్త నీటిని పోసి మరగనివ్వాలి. అది ఉడికి చిక్కబడ్డాక లేయర్ లు గా పేర్చుకున్న కస్టర్డ్, బిస్కెట్, డ్రై ఫ్రూట్ మిశ్రమం పై వేయాలి. ఆ తరవాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ని దాని పై వేసి ఫ్రిజ్ లో ఒక గంట సేపు పెట్టి తీసేస్తే సరి.
గ్లుకో పుడ్డింగ్ రెడీ.

ఆపిల్ పుడ్డింగ్

ఆపిల్ పుడ్డింగ్
తయారు చేసే విధానం : 
ఆపిల్ పుడ్డింగ్ తయారుచేయడానికి ముందుగా జెల్లీని తయారు చేసుకోవాలి.
జెల్లీ తయారుచేసునే విధానం : ఒక గిన్నెలో జెల్లీ పౌడర్ తీసుకుని వేడి నీళ్ళు కలిపి 45 ఇమిశాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత చల్లారిన జెల్లీ నీటిని ఫ్రిజ్ లో ఉంచితే జెల్లీ తయారవుతుంది. 
యాపిల్ పుడ్డింగ్ తయారు చేసే విధానం : ముందుగా జీడిపప్పు, పిస్తాను నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత వెనీలా ఐస్ క్రీం తీసుకుని అందులో చిన్నగా తరిగిన యాపిల్ ముక్కలు, గ్రీన్ యాపిల్ ముక్కలు, పైనాపిల్, గ్రేప్స్, కార్న్ ఫ్లేక్స్, కాజు, పిస్తా, జెల్లీ,ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ వేసుకుని చివరిగా కివీ ఫ్రూట్, చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే సరి . యాపిల్ పుడ్డింగ్ రెడీ.