గ్లూకో పుడ్డింగ్ : పాలు, జీడిపప్పు, గ్లుకోస్ బిస్కెట్స్, ఎండుద్రాక్ష, బాదం పప్పు, కుంకుమ పౌడర్, పంచదార, కస్టర్డ్ పౌడర్, కోకో పుడ్డింగ్ పౌడర్.
ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడయ్యే లోపు 4, 5 స్పూన్ ల కస్టర్డ్ పౌడర్ లో చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తరవాత కాస్త నీళ్లు పోసి ఉండల్లేకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని మరిగిన పాలలో కలిపి అది చిక్కబడేవరకు కలుపుతూ మరగనివ్వాలి. ఆ తరవాత దానిని దించి పక్కన పెట్టేయాలి.
ఒక గిన్నెలో బిస్కెట్ లను పేర్చి , దాని పై కొన్ని డ్రై ఫ్రూట్ వేసి ఆ పై కస్టర్డ్ మిశ్రమాన్ని వేయాలి. దాని పై మళ్ళీ బిస్కెట్ లను పేర్చి, డ్రై ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ వేయాలి, ఇలా వీలైనన్ని లేయర్ లు పేర్చుకోవాలి. ఆ తరవాత కోకో పౌడర్ తీసుకుని అందులో కాస్త నీటిని పోసి మరగనివ్వాలి. అది ఉడికి చిక్కబడ్డాక లేయర్ లు గా పేర్చుకున్న కస్టర్డ్, బిస్కెట్, డ్రై ఫ్రూట్ మిశ్రమం పై వేయాలి. ఆ తరవాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ని దాని పై వేసి ఫ్రిజ్ లో ఒక గంట సేపు పెట్టి తీసేస్తే సరి.
గ్లుకో పుడ్డింగ్ రెడీ.
No comments:
Post a Comment