Showing posts with label పిండి వంటలు. Show all posts
Showing posts with label పిండి వంటలు. Show all posts

Wednesday, September 3, 2014

కజ్జికాయలు


కావలసిన వస్తువులు: 
మైదా- 500గ్రా., నెయ్యి- 100గ్రా., ఉప్పు-చిటికెడు, చక్కెర-350గ్రా., కొబ్బరికాయలు-2, గసగసాలు-100గ్రా., పుట్నాల పప్పు- 150గ్రా., యాలకులు-5గ్రా., ఆయిల్‌-తగినంత
తయారు చేసే విధానం:
మైదావిండిని జల్లించి దీనికి ఉప్పు, నెయ్యి కలివి నీళ్ళతో పూరీల విండిలా కలపండి. ఒక బాణలిలో తురిమిన కొబ్బరికోరు వేసి సన్నని మంటమీద వేయిం చిన తర్వాత అందులో పుట్నాల పప్పుపొడి, గసాలు, చక్కెర కూడా వేసి బాగా వేయించి స్టౌ మీది నుంచి దింపి, యాలకుల పొడి కలివి పక్కన ఉంచండి. ముందుగా కలివి సిద్ధం చేసు కున్న మైదాను చిన్న, చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పూ రీల్లా వత్తి, దాని మధ్యలో బాణలి లో తయారు చేసిన కొబ్బరి తురుము, పుట్నాల పప్పు విండి మిశ్ర మాన్ని రెండు స్పూనులు వేసి పూరీని మధ్యకు మడవండి. అర్ధ చంద్రాకారంలో వస్తుంది. తర్వా త వాటి చివరలను తడి చేసి మడత మీద మడత వేసి వేళ్లతో గట్టిగా అదమండి. ఈ విధంగా చేయడం వల్ల మడత లోపలి మిశ్రమం బయటకు రాదు. ఇలా తయారయిన కజ్జికాయ లను కాగిన నూనెలో ఎర్రగా వేయించండి.

గవ్వలు


కావలసిన వస్తువులు: 

మైదా-500గ్రా., బొంబాయిరవ్వ-100గ్రా. నెయ్యి-120గ్రా., చక్కెర-150గ్రా., గుడ్డు-1, యాలకులు-5గ్రా, బేకింగ్‌ పౌడర్‌- చిటికెడు, రిఫైన్డ్‌ ఆయిల్‌- వేయించడానికి తగినంత.
తయారు చేసే విధానం:
కోడిగుడ్డు సొనను ఒక గిన్నెలో పోసి స్పూన్‌తో బాగా కలియతిప్పి అందులో చక్కెర కూడా వేసి పూర్తిగా కరగనివ్వాలి. అవసరమైతే ఒక కప్పు నీళ్లు కూడా చేర్చండి. అందులో యాలకుల పొడిని కూడా కలివి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మైదాలో బేకింగ్‌ సొడా కలివి జల్లించి బొంబాయి రవ్వ, నెయ్యి కూడా చేర్చి చేత్తో మెత్తగా కలపండి. దీనికి కోడిగుడ్డు మిశ్రమాన్ని చేర్చి గట్టిగా పూరీల విండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచండి. గవ్వల చెక్కెపై బొటన వేలితో విండిని గట్టిగా అదుముతూ వేలును కిందికి జరపాలి. విండి చుట్టుకొని - గవ్వ తయారవుతుంది. తయా రైన గవ్వలను స్టౌమీద కాగుతు న్న ననెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. 

బాదుషాలు


కావలసిన వస్తువులు: 

మైదా - 500గ్రా., సోడా-1/2 టీ స్పూను, పెరుగు- గరిటెడు,చక్కెర- 250గ్రా
తయారు చేసే విధానం:
ముందుగా మైదాపిండి, వంట సోడాలను కలివి జల్లెడలో జల్లించి, అందులో గడ్డగా కాకుండా వేడిచేసి చల్లార్చిన నెయ్యి కలపాలి. మొత్తం విండిలో నెయ్యి అంతా కలిసేలా చూడాలి. తర్వాత అందులో పెరుగు కూడా కలివి, కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ గట్టి విండి ముద్దలా చేసి 10 నిమిషాలు నాననివ్వాలి. ఆ పిం డిని గులాబ్‌జామ్‌లంత సైజులో ముద్దలుగా చేయాలి. వాటిని రెండు అరచేతుల మధ్య గట్టిగా రుద్దుతూ, గుండ్రని ముద్దలుగా చేయడం వల్ల, గుల్లపడి బాదూ షాలా తయారు చేయడానికి వీలవుతుంది. ఇలా చేసిన విండి ముద్దల మధ్యలో రెండు పక్కలా బొటనవేలు చివ రతో నొక్కాలి. ఇపుడు సన్నని మంట మీదున్న ఒక బాణలిలో నెయ్యి పోసి, దానిలో పిండిముద్ద లను లేత బంగారురంగు వచ్చే వరకూ చేయించి, వాటిని ఒక ట్రేలో వరసగా అమర్చాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో చక్కెర వేసి, దానికి మూడు కప్పుల నీళ్లు కలిపి వేడిచేసి లేతపాకంలా తయార య్యాక దానిని అమర్చి ఉంచు కున్న బాదుషాల మీద పోస్తే పాకం అంతా ఇంకిపోతుంది. 

నమక్‌ పారా


కావలసిన వస్తువులు: 

మైదా - 500గ్రా., నెయ్యి-75గ్రా., 
ఉప్పు- తగినంత, 
రిఫైన్డ్‌ ఆయిల్‌-వేయించ
డానికి తగినంత
తయారు చేసే విధానం:
మైదాను జల్లించి ఉప్పు, నెయ్యి కలివి కొంచెం నీళ్లతో మెత్తగా కలపండి. ఈ పిండి ముద్దను రెండు భాగాలుగా చేసి ఒక్కో ముద్దను తీసుకొని రొట్టెల కర్ర తో పల్చగా చపా తీలా చేయం డి. చేసేట ప్పుడు రొట్టెల వీట మీద విండి చల్లాలి. చపాతీ చే యడం అయిన తర్వాత దాన్ని చాకు తో అర్ధ అంగుళం వెడ ల్పుండే రిబ్బన్‌లా నిలువుగా కోసి తిరిగి వాటిని డైమండ్స్‌లా కట్‌ చేయండి. ఇలా కట్‌ చేసిన ముక్క లను రిఫైన్డ్‌ ఆయిల్‌లో కరకరలా డేలా వేయించి రుచి చూడండి.

కుర్‌ కుర్‌ ఆలూ


కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి : 250గ్రా
బంగాళా దుంపలు : 125 గ్రా
వనస్పతి : 25 గ్రా
తెల్లనువ్వులు : ఒక టీ స్పూను
కారం : ఒక టీస్పూను
ఉప్పు : ఒక టీ స్పూను 
నూనె : తగినంత
తయారు చేసే విధానం: 
బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి, తోలుతీసి మెత్తగా మెదిపి ఉంచాలి. ఒక లో తైన పళ్లెంలో నూనె తప్ప పైన చెప్పుకున్న ఇతర పదా ర్థాలన్నింటినీ, బంగాళాదుంప గుజ్జునీ కలిపి తగినంత నీరు పోస్తూ గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. జంతికల గొ ట్టంలో రిబ్బన్‌ ఆకారంలో ఉండే ప్లేట్ను అమర్చి ఈ మిశ్ర మాన్ని నింపాలి. నూనె బాగా కాగుతుండగా జంతికల గొట్టాన్ని అదుముతూ పిండిని నూనెలో వదలాలి. అలా వేసిన మురుకులు దోరగా వేగిన తరువాత న్యూస్‌ పేపర్‌పై వేయాలి. అంతే కుర్‌ కుర్‌ ఆలూ తయారైనట్లే..! బాగా ఆరిన తరువాత గాలిదూరని డబ్బాలో భద్రపరచినట్లయితే, 15 రోజులదాకా నిల్వ ఉంటాయి.

Friday, July 4, 2014

గులాబ్ జామున్

గులాబ్ జామున్


Wednesday, July 2, 2014

చిరోటి రవ్వతో పూర్ణం బొబ్బట్లు

చిరోటి రవ్వతో పూర్ణం బొబ్బట్లు ఉగాది స్పెషల్

కావలసిన పదార్థాలు : 
చిరోటిరవ్వ: 2cups 
కందిపప్పు ఉడికించినది: 2cups 
పంచదార/లేదా బెల్లం తురుము: 3cups 
మైదా: 3cups 
సోడా: చిటికెడు
 గోధుమపిండి: 1cup 
నెయ్యి: 1tsp 
నూనె లేదా నెయ్యి: 1cup 

తయారు చేయు విధానం : 
1. మైదా, గోధుమపిండిలను కలపాలి. దాంట్లో తగినన్ని నీళ్లుపోసి, వంటసోడా వేసి పూరీపిండిలాగా కలిపి మూతపెట్టి ఉంచాలి. 
2. తర్వాత పాన్ లో నెయ్యివేసి చిరోటి రవ్వను వేసి దోరగా వేయించుకోవాలి. అడుగు మందంగా ఉండే ఓ గిన్నెలో మూడు కప్పుల నీటిని పోసి స్టవ్‌ పై పెట్టాలి. 
3. ఇప్పుడు నీరు మరుగుతుండగా వేయించిన రవ్వను వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రవ్వ ఉడికాక దాంట్లో పంచదార, యాలకులపొడి వేసి కలియబెట్టాలి. 
4. ఇది పూర్ణం చేసేందుకు అనువుగా తయారైన తరువాత దించేసి అందులో ఉడికించి గ్రైండ్ చేసిన కందిపప్పు, ఉడికించిన రవ్వ రెండూ మిక్స్ చేసి నిమ్మకాయంత సైజులో ఉండలు చేసుకోవాలి. 
5. ఇప్పుడు మైదాపిండిని చిన్న సైజు పూరీల్లాగా వత్తి, వాటి మధ్యలో పూర్ణంరవ్వ పూర్ణాన్ని పెట్టి మూసివేసి, దాన్ని చేత్తో బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి. వీటిని పెనంపై నూనె లేదా నెయ్యివేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి చిరోటి రవ్వ బొబ్బట్లు రెడీ ...!

క్యారట్ బూరెలు

పండుగలల్లో మన తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మామిడితోరణాలూ, పచ్చిమామిడికాయలూ, పిండివంటలతో పాటూ ఉగాదిపచ్చడితో అన్ని లోగిళ్లూ ఘుమఘుమలాడిపోతాయి. బొబ్బర్లు, పూర్ణాలు, పలహారలతో ప్రత్యేమైన వంటకాలు ఉగాది రోజే చేస్తారు. ఈ ఉగాదికి మీకోసం...
క్యారెట్ పూర్ణాలు-ఉగాది స్ఫెషల్
 కావలసిన పదార్థాలు: 
క్యారట్ తురుము: 2 cup
పంచదార: 11/2 cup
పాలు: 1cup 
నెయ్యి: 2 
బాదం, ద్రాక్ష, జీడిపప్పు: 1/2 teaspoon
పూతపిండికి 
మినపప్పు: 1 cup
బియ్యంపిండి: 2 cup
ఉప్పు: చిటికెడు
 నూనె: వేయించడానికి సరిపడా 

తయారు చేసే విధానం: 
1. బియ్యంపిండిని కొంచెం నీటితో ముద్దగా కలుపుకోవాలి. 
2. మినపప్పు రెండు గంటలు పాటు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకుని తడిపిన బియ్యంపిండిలో వేసి తగినంత ఉప్పు కలిప ఒక గంట నాననివ్వాలి. (బియ్యపు పిండి, మినపప్పు మిశ్రమం ఇష్టపడని వారు..మైదా, చిటికెడు ఉప్పు, నీళ్ళు జాగురు గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి). 
3. తర్వాత పాన్ లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, ద్రాక్ష, వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి 
4. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించి పాలు పోసి ఉడికించాలి. పాలు ఇగిరిన తర్వాత పంచదార వేసి అది కరిగి మళ్లీబాగా దగ్గరయ్యే వరకు ఉడికించాలి. 
5.. క్యారెట్ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండుగా చేసుకోవాలి. ఈ ఉండలను రెడీగా ఉన్న పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే రుచికరమైన క్యారట్ బూరెలు రెడీ...

కొబ్బరి బొబ్బట్ల


కోకోనట్ పోలీలు(కొబ్బరి పోలీలు): ఉగాది స్పెషల్
కావల్సిన పదార్థాలు: 
మైదా: 2cups 
చిరోటి రవ్వ: 3tbsp 
పసుపు: చిటికెడు(అవసరంఅయితేనే) 
బెల్లం తురుము: 1 ½ cup 
కొబ్బరి తురుము : 2 cup(సన్నగా తురిమినిది) 
యాలకులు: 2-3 (పౌడర్ చేసుకోవాలి) 
నెయ్యి: 2tbsp 
నీళ్ళు: మైదాపిండి కలుపుకోవడానికి సరిపడా

 తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైద, చిరోటి రవ్వ, రెండు టేబుల్ స్పూన్ల నూనె, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి, సరిపడా నీళ్ళు పోసి పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. కలుపు కొన్న తర్వాత అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. 
2. అంతలోపు, అరకప్పు నీటిని డీప్ బాటమ్ పాన్ లో పోసి, బెల్లం తురుము వేసి మీడియం మంట మీద కరిగే వరకూ ఉడికించుకోవాలి. మద్యమ్యదలో కలియబెడుతూ, బెల్లం చిక్కగా పాకంలా తయారయ్యే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి. 
3. ఇప్పుడు అందులో ముందుగా తురిము పెట్టుకొన్నపచ్చికొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ, కొబ్బరిబెల్లంపాకం గడ్డిపడే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. 
4. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న మైదా పిండిని నుండి కొద్దిగా కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కొక్క ఉండను అరచేతిలో పెట్టుకొని మద్యలో కొద్దిగా లోతుగా వత్తి అందులో కొబ్బరి పాకం మిశ్రమాన్ని ఉండలా చేసి పెట్టి, అన్ని వైపులా కవర్ చేయాలి
. 5. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి రాసి స్టఫ్ చేసిన మైదా బాల్ ను ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి నిధానంగా చపాతీలా చేత్తోనే వత్తుకోవాలి. 
6. ఇలాకొన్నింటిని తయారుచేసి పెట్టుకోవాలి. 
7. తర్వాత స్టౌ మీద వెడల్పాటి పాన్ పెట్టి, నెయ్యి రాసి వేడయ్యాక కొబ్బరి పూర్ణం పోలీలను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే కోకోనట్ పూర్ణం పోలి తినడానికి రెడీ. ఈ ఉగాది స్వీట్ డిష్ ను వేడి వేడిగా సర్వ్ చేయండి.

అరిసెలు

అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ఒకరకంగా మన సంప్రదాయ వంట అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉగాది పండుగకు అరిసెలు కూడా చేస్తుంటారు. పోలీలతో పాటు అరిసెలను కూడా వండి, వచ్చే అథితులకు ఆథిద్యం ఇస్తుంటారు. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు. ఈ అరిసెలు పెళ్ళైన ఆడపిల్లకి పెట్టే సారెలో కూడా తప్పకుండా పెడతాము. అరిసెలు ఒక పాపులర్ స్వీట్ రిసిపి వీటిని ఎక్కువగా కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వీటిని వండుతారు. అరెసెలు చేయటం కొంచెం కష్టమైన పనే అయినా... చాలా రుచికరంగా ఉంటాయి. అరిసెలు చేయడం రెండు రోజుల పని. మొదటి రోజు బియ్యం నానబెట్టుకోవటం, రెండవ రోజు ఆ నానిన బియ్యాన్ని పిండి పట్టించి మెత్తగా జల్లించి ఈ పిండిని బెల్లం పాకం పట్టి అందులో జల్లించిన పిండిని కలిపి అరిసెలు చేసుకోవటం ఇది అరిసెల ప్రహసనం....

స్వీట్ అరిసెలు: ఉగాది స్పెషల్ స్వీట్స్


కావలసిన పదార్థాలు:
బియ్యం: 1kg 
బెల్లం తరుము: 1/2kg 
నువ్వులు: 100grms 
నీరు: 1cup(తగినంత) 
యాలకులు: 2-4(మెత్తగా పొడిచేసుకోవాలి) 
నెయ్యి: 1/2cup 
నూనె: వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం: 
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెల్లో వడవేసి పిండి పట్టించుకోవాలి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి. 
2. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెద్దది పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం) పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. 
3. తర్వాత బియ్యం పిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి. ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంతవరకూ పిండి వేసి కలపాలి. 
4. ఇలా పిండి పాకంతో తయారు చేసుకొన్న తర్వాత స్టౌ ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి కాగనివ్వాలి. ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెలు వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. 
5. బంగారు వన్నె రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత భద్రపచుకోచ్చు. ఇవి ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. అంతే నోరూరించే అరిసెలు రెడీ..!


Tuesday, July 1, 2014

క్యారట్ , సొరకాయ స్వీట్

క్యారట్ సొరకాయ స్వీట్ : బాదం పప్పుఎండుద్రాక్షజీడిపప్పుక్యారట్ 

తురుముసొరకాయ తురుముడాల్డాచక్కరపాలు.



ముందుగా గిన్నెలో డాల్డా వేసి అది వేడయ్యాక జీడిపప్పుబాదం 

పప్పుఎండుద్రాక్ష వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలిగిన్నెలో మిగిలిన ఉన్న

 డాల్డాలో సొరకాయ తురుముక్యారట్ తురుము వేసి సొరకాయలో ఉన్న

 నీరు ఇంకేంత వరకు ఫ్రై చేయాలిఆ తరవాత అందులో పాలు పోసి ఐదు 

నిమిషాల వరకు ఉడకనివ్వాలిఅది కాస్త దగ్గరకు వచ్చాక దించేసిఅంతకు

 ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి.

సొరకాయ పాయసం:




సొరకాయ పాయసం: సొరకాయ తురుముపాలునెయ్యిచక్కరజీడిపప్పుయాలకులుఎండు ద్రాక్ష
తయారు చేయవలసిన పధ్ధతి:
ముందుగా జీడిపప్పుఎండు ద్రాక్షను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలిమిగిలిన నెయ్యిలో తురిమిన సోరకాయను వేసి ఫ్రై చేసుకోవాలి.ఇంకో వైపు పాలు వేడి చేసుకోవాలిసొరకాయ బాగా వేగాక వేడి పాలలో సొరకాయను కలపాలిఅలా దగ్గరపడేంత వరకు ఉడకనిచ్చి అందులో చెక్కెర కలపాలిచెక్కెర కరిగాక ఇంతకు ముందు ఫ్రై చేసుకున్న జీడి పప్పుఎండు ద్రాక్షను కలపాలిఆ తరవాత యాలకుల పొడితో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి సొరకాయ పాయసం రెడీ. 

గ్లూకో పుడ్డింగ్


గ్లూకో పుడ్డింగ్ : పాలుజీడిపప్పుగ్లుకోస్ బిస్కెట్స్ఎండుద్రాక్షబాదం పప్పుకుంకుమ పౌడర్పంచదారకస్టర్డ్ పౌడర్కోకో పుడ్డింగ్ పౌడర్.

ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి పాలు వేడి చేసుకోవాలిపాలు వేడయ్యే లోపు 4, 5 స్పూన్ ల కస్టర్డ్ పౌడర్ లో చక్కర వేసి కలుపుకోవాలిఆ తరవాత కాస్త నీళ్లు పోసి ఉండల్లేకుండా కలుపుకోవాలిఅలా కలుపుకున్న మిశ్రమాన్ని మరిగిన పాలలో కలిపి అది చిక్కబడేవరకు కలుపుతూ మరగనివ్వాలిఆ తరవాత దానిని దించి పక్కన పెట్టేయాలి.
ఒక గిన్నెలో బిస్కెట్ లను పేర్చి దాని పై కొన్ని డ్రై ఫ్రూట్ వేసి ఆ పై కస్టర్డ్ మిశ్రమాన్ని వేయాలిదాని పై మళ్ళీ బిస్కెట్ లను పేర్చిడ్రై ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ వేయాలిఇలా వీలైనన్ని లేయర్ లు పేర్చుకోవాలిఆ తరవాత కోకో పౌడర్ తీసుకుని అందులో కాస్త నీటిని పోసి మరగనివ్వాలిఅది ఉడికి చిక్కబడ్డాక లేయర్ లు గా పేర్చుకున్న కస్టర్డ్బిస్కెట్డ్రై ఫ్రూట్ మిశ్రమం పై వేయాలిఆ తరవాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ని దాని పై వేసి ఫ్రిజ్ లో ఒక గంట సేపు పెట్టి తీసేస్తే సరి.
గ్లుకో పుడ్డింగ్ రెడీ.

స్వీట్ హాట్ జొన్న

స్వీట్ హాట్ జొన్న
స్వీట్ హాట్ జొన్న : జొన్న పిండిబియ్యం పిండిమైదా పిండిచక్కర పౌడర్ఉల్లిపాయ ముక్కలుజిలకరఉప్పుఅల్లంపచ్చిమిర్చివంట సోడాకొత్తిమీరకరివేపాకు.

తయారు చేసే విధానం :

స్టవ్ పై గిన్నె పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోయాలినూనె కాగే లోపు ఒక గిన్నె తీసుకుని గరిటె తో మూడు గరిటెలు జొన్న పిండి11/2 గరిటెలు బియ్యపు పిండి, 2 గరిటెలు మైదా పిండి, 2 స్పాన్ ల పంచదార జిలకరఉల్లిపాయ ముక్కలుగ్రిండ్ చేసి పెట్టుకున్న అల్లంపచ్చిమిర్చి మిశ్రమంతగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలితరవాత సోడా వేసి నీళ్లు వేసి బాగా కలపాలిఆ తరవాత కొత్తిమీర,కరివేపాకు వేసి బాగా కలిపికాగిన నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు బజ్జీల్లా ఫ్రై చేసుకోవాలి.

బేబీ కార్న్ మంచూరియన్

Ingredients
:
బేబీ కార్న్మొక్క జొన్న పిండిఉల్లి కాడలు మైదాసోయాసాస్రెడ్ చిల్లి సాస్అల్లంవెల్లుల్లి ఉప్పు టమాట కెచప్ఉల్లితరుగు ,పచ్చి మిరపకాయలు మిరియాల పౌడర్ ,కారం,ఐస్ క్రీంపైనాపిల్యాపిల్గ్రీన్ యాపిల్గ్రేప్స్చెర్రీస్బాదంజీడిపప్పు పిస్తాజెల్లీ క్రిస్టల్స్,మిల్క్ మేడ్కార్న్ ఫ్లేక్స్ కివీ ఫ్రూట్.
తయారు చేసే విధానం :
ఒక కప్పు కార్న్ ఫ్లోర్ లో స్పూన్స్ మైదాకారం ఉప్పు మిరియాల పౌడర్నీరు వేసి దోస పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తరవాత బాణలిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలికాగిన తరవాత బేబీ కార్న్ ని కార్న్ ఫ్లోర్ లో ముంచి నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుని నూనె పోసి చిన్నగా తరిగిన అల్లం ముక్కలువెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి తరుగుఉల్లి కాడలు , 2స్పూన్స్ సోయా సాస్రెడ్ చిల్లి సాస్టమాట సాస్కొద్దిగా నీరు ఉప్పు కలిపి ఫ్రై చేసుకునిఅంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కాన్,ఉల్లిపాయ తరుగును వేసి కలిపి రెండు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత దించేసిక్యారట్ఉల్లి తరుగు ఉల్లికాడలు తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. 

ఆపిల్ పుడ్డింగ్

ఆపిల్ పుడ్డింగ్
తయారు చేసే విధానం : 
ఆపిల్ పుడ్డింగ్ తయారుచేయడానికి ముందుగా జెల్లీని తయారు చేసుకోవాలి.
జెల్లీ తయారుచేసునే విధానం : ఒక గిన్నెలో జెల్లీ పౌడర్ తీసుకుని వేడి నీళ్ళు కలిపి 45 ఇమిశాలు పక్కన పెట్టాలిఆ తర్వాత చల్లారిన జెల్లీ నీటిని ఫ్రిజ్ లో ఉంచితే జెల్లీ తయారవుతుంది
యాపిల్ పుడ్డింగ్ తయారు చేసే విధానం : ముందుగా జీడిపప్పుపిస్తాను నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలిఆ తరవాత వెనీలా ఐస్ క్రీం తీసుకుని అందులో చిన్నగా తరిగిన యాపిల్ ముక్కలుగ్రీన్ యాపిల్ ముక్కలుపైనాపిల్గ్రేప్స్కార్న్ ఫ్లేక్స్కాజుపిస్తాజెల్లీ,ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ వేసుకుని చివరిగా కివీ ఫ్రూట్చెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే సరి యాపిల్ పుడ్డింగ్ రెడీ.

గోధుమ పిండితో పాల తాళికలు

పాల తాళికలు: గోధుమ పిండితో తయారు చేసిన పాల తాళికలుచెక్కెరపాలుజీడిపప్పుఎందు ద్రాక్షయాలకుల పౌడర్,నెయ్యి 

తయారు చేసే విధానం గిన్నెలో నెయ్యి వేసి కాగాకజీడిపప్పుఎండు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలిఆ తరవాత ఇంకో గిన్నె తీసుకుని వేడి చేయాలి ఆ నీరు మరిగేటప్పుడు అందులో నీరు పోసి అందులో తాళికల్ని వేసి ఉడకబెట్టాలిఅవి ఉడికాక అందులోనే చెక్కెర వేసి అది కరిగే వరకు ఉడకనిచ్చి నీరు ఇంకాక అందులో తగినన్ని పాలు పోసి ఉడకనిచ్చి యాలకుల పౌడర్ వేసి దించేసిజీడిపప్పుఎండు ద్రాక్ష తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి