Sunday, July 6, 2014

వర్మిసెల్లి పుడ్డింగ్


కావలసిన పదార్థాలు :
వెర్మిసెల్లి... 200 గ్రాములు
పాలు... ఒక లీటర్
పంచదార... వంద గ్రాములు
నెయ్యి... అరకప్పు
యాలక్కాయలు... మూడు
కిస్‌మిస్‌లు... ఒక టీస్పూన్
జీడిపప్పు... ఒక టీస్పూన్

తయారీ విధానం :
ముందుగా వెర్మిసెల్లిని నాలుగు స్పూన్ల నెయ్యితో వేయించాలి. అందులో 1.5 కప్పుల నీరు పోసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. అందులో పాలు పోసి సన్నని సెగపై చిక్కబడేంత వరకు ఉడికించాలి.

తరువాత దీనికి పంచదార కలిపి పుడ్డింగ్ చిక్కబడేంత వరకు ఉంచాలి. జీడిపప్పు నేతిలో వేయించి ఉంచుకోవాలి. పుడ్డింగ్ చిక్కబడిన తరువాత యాలుకుల పొడి, జీడిపప్పు వేసి దించుకోవాలి. అంతే వెర్మిసెల్లి ఫుడ్డింగ్ సిద్ధమైనట్లే...!

No comments:

Post a Comment