Thursday, July 17, 2014

క్రిస్మస్ పుడ్డింగ్

క్రిస్మస్ పుడ్డింగ్ - క్రిస్మస్ స్పెషల్
కావలసిన పదార్థాలు:
పాలు: 1ltr 
పంచదార: సరిపడినంత
 ఆరెంజ్ తొనలు: 12-14(గింజలు తీసినవి) 
యాపిల్‌: 1(పై పొట్టు, గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగాలి) 
ఆపిల్: 1 (తోలుతో సహా లావుపాటి ముక్కలుగా తరిగినవి) 
కిస్‌మిస్‌లు, బాదం, జీడిపప్పు, పలుకులు: 1cup 
బ్రెడ్‌ స్లైస్: 4-6 
బేస్‌ తయారీకి చిన్నచిన్న ముక్కలుగా చిదిమిన బిస్కెట్‌లు : 2cups 
వెన్న: 3tbsp 

తయారు చేయు విధానం: 
1. ముందుగా బేస్‌ తయారీకి: బిస్కట్‌ ముక్కలకి వెన్నని బాగా పట్టించి ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ డిష్‌ అడుగుభాగంలో సర్ది కదలకుండా ఉండేలా చేతులతో ఒత్తండి. 
2. ఈ గిన్నెని గంటపాటు ఫ్రిజ్‌ లో ఉంచండి. ఆలోపు ఫుడ్డింగ్‌ ని తయారుచేసుకోండి. తాజా బ్రెడ్‌ ముక్కలని చిన్నచిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోండి.
 3. తర్వాత మందపాటి గిన్నెలో పాలుపోసి సగమయ్యేదాకా సన్నని సెగమీద మరిగించండి. దించి పంచదార, బ్రెడ్‌ముక్కలు వేసి కలిపి చల్లారనివ్వండి. 
4. తరువాత కోసి ఉంచుకున్న ఆపిల్‌ ముక్కలు, డ్రైఫ్రూట్స్‌ వేసి కలిపి బేస్‌ తయారుచేసి ఉంచుకున్న గిన్నెలో పోయండి. గిన్నెను కుక్కర్‌లో పెట్టి పది పన్నెండు నిమిషాలు సన్నని సెగమీద ఉడికించండి. అప్పటికి సగం ఉడుకుతుంది. 
5. దానిమీద చుట్టూ గుండ్రంగా ఆపిల్‌ముక్కలు సర్ది మళ్లీ పన్నెండు నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. తరువాత దించి మూత తీసి చల్లారనివ్వాలి. దీనిని కనీసం రెండుమూడు గంటల ఫ్రిజ్‌ లో ఉంచి తింటే చాలా బాగుంటుంది.

No comments:

Post a Comment