Thursday, October 16, 2014

బెల్లం మామిడి ఆవకాయ

ఆవకాయ కోసం చిత్ర ఫలితం
కావలసినవి
మామిడికాయలు పెద్దవి-10
ఆవాలపొడి-ఒక కప్పు
ఉప్పు- ఒక కప్పు
3 మ్యాంగో కారం-ఒక కప్పు
పసుపు- రెండు టేబుల్‌స్పూన్లు
వెల్లుల్లిపాయలు-4 (తోలు తీసినవి)
మెంతిపొడి- రెండు టేబుల్‌స్పూన్లు (వేయించి పొడి చేసున్నది)
నువ్ఞ్వల నూనె లేదా వేరుశనగ నూనె- ఒక ప్యాకెట్‌
బెల్లం -మూడు కప్పులు
తయారుచేసే విధానం
మామిడి కాయలను బాగా కడిగి ఆరబెట్టుకుని ఒకకాయను 10 ముక్కలుగా కట్‌చేసుకోవాలి. జీడి లేకుండా తీసివేయాలి. కొట్టిన ముక్కలను ఒక మంచి క్లాత్‌ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి.  
ఆ తరువాత జాడీలో కొద్దిగా నూనె వేసి అందులో ముక్కలు, ఆవాలపొడి, ఉప్పు, మ్యాంగోకారం, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలపాలి. వెల్లుల్లిపాయలను పొట్టుతీసి అందులో వేసి బాగా కలపాలి. దీనిని మూడురోజులు కదపకుండా, గాలి పోకుండా గట్టిగా మూతపెట్టి ఉంచాలి. మూడవరోజు ఉప్పు, నూనె సరిపోయిందో లేదో చూసుకోవాలి. బెల్లాన్ని రాయితో మెత్తగా కొట్టుకుని కొద్దిగా నీళ్లుపోసి పాకంలా తయారుచేసుకోవాలి.
బెల్లంలో నీరంతా ఇంకి పాకం గట్టిపడుతున్నపుడు దించి కొద్దిగా వేడిగా ఉండగా ముక్కలను దీనిలో వేయాలి. గాలితగలని జాడీలో దీన్ని భద్రపరచుకోవాలి. ఇది సంవత్సరమంతా ఉంటుంది. ఈ పచ్చడిని ఎక్కువగా ఆంధ్రాలో పెట్టుకుంటారు

No comments:

Post a Comment