Tuesday, October 14, 2014

బీర ఆవకాయ (బీరకాయతో ఆవకాయ)

కావల్సిన పదార్థాలు :

బీరకాయలు - అరకేజీ,
చింతపండు - యాభై గ్రాములు,
మెంతిపిండి - చెంచా,
ఆవపిండి - చెంచా,
నూనె - పావుకప్పు,
కారం, ఉప్పు - తగినంత,
పసుపు - చెంచా,
పోపు దినుసులు - చెంచా,
కరివేపాకు - నాలుగు రెబ్బలు

తయారు చేసేవిధానం :

బీరకాయలను చెక్కు తీసి శుభ్రంగా కడిగి, తడి తుడిచి ముక్కలు కోసుకోవాలి. ఈ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి సీసాలో పెట్టుకోవాలి. మర్నాడు ముక్కలను పిండి, పొడి వస్త్రం మీద వేసి ఆరు గంటల సమయం ఎండబెట్టాలి. అలానే చింతపండులో కాసిని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.

పది నిమిషాలయ్యాక మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుతోపాటు, కారం, ఆవపిండి, మెంతిపిండిని బీరకాయ ముక్కల్లో కలపాలి. తరువాత చిన్న బాణలిలో మూడు చెంచాల నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు వేయించి దించేయాలి. చల్లారాక బీరకాయ ముక్కల్లో పోపు చేర్చి కలపాలి. మూడు నాలుగు రోజుల తరువాత తింటే రుచిగా ఉంటుంది బీర ఆవకాయ.

No comments:

Post a Comment