కావలసిన పదార్థాలు
- బుడంకాయ ముక్కలు. 1 పెద్ద కప్పు,
- నూనె. 4 టీస్పూ//.
- కారం. 1 టీస్పూ//.
- ఉప్పు. 1 టీస్పూ//.
- ఆవపిండి. 1/4 టీస్పూ//.
- మెంతిపిండి.1/4 టీస్పూ//.
- ఇంగువపొడి. 1/4 టీస్పూ//.
- పసుపు. చిటికెడు
తయారీ విధానం
బుడంకాయలను బాగా కడిగి ఆరబెట్టుకుని ఒక మంచి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి.
ఒక కాయను 10 ముక్కలుగా కట్‌చేసుకోవాలి.
పొడిగిన్నెలో బుడంకాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, నూనె అన్నీ వేసి కలపాలి.
కావలసినవారు మరికాస్త ఉప్పును, వెల్లుల్లినీ వేసుకోవచ్చు.
రెండో రోజుకు ముక్క ఊరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.ఇది ఒక నెల పాటు తాజాగా ఉంటుంది
No comments:
Post a Comment