Showing posts with label ఉరగాయలు. Show all posts
Showing posts with label ఉరగాయలు. Show all posts

Tuesday, April 19, 2016

దొండకాయ ఊరగాయ

Image result for దొండకాయ
కావలసిన పదార్థాలు:
దొండకాయలు : పావు కిలో
నిమ్మరసం : అర కప్పు
పసుపు : కొద్దిగా
ఉప్పు : ముప్పావు కిలో
కారప్పొడి : అర కప్పు
ఆవ పిండి : పావు కప్పు
మెంతి పిండి : చెంచా
ఎండు మిర్చి : నాలుగు
నూనె : సరిపడా
పోపు సామాను : చెంచెడు
ఇంగువ : తగినంత

తయారీ విధానం :
లేత దొండకాయలను బాగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలకు కారప్పొడి, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. తర్వాత నిమ్మరసం కూడా వేసి బాగా కలపండి. మూకుడులో ముక్కలకి సరిపడా నూనె పోసి ఇంగువ పోపు పెట్టి చల్లార్చి కలపాలి. ఇది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకూ నిలువ ఉంటుంది.

Wednesday, January 7, 2015

మామిడి ఆవకాయ ముక్క కరకరలాడుతూ ఉండలి tip

 మామిడికాయలు కడిగి టెంకెతో సహా చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటికి కొంచెం పసుపు, నూనె రాసి 10 నిమిషాలు ఉంచుకోవాలి. అలా ఉంచితే ముక్క కరకరలాడుతూ ఉంటుంది

నువ్వు ఆవకాయ (కారం వేయలేదు)



కావలసినవి:  
 మామిడికాయ ముక్కలు - కిలో; 
నువ్వులు - పావు కిలో, 
ఉప్పు - పావు కిలో; 
నువ్వుల పొడి - అర కిలో; 
అల్లం వెల్లుల్లి ముద్ద - పావు కిలో;
 ఆవ పొడి - 50 గ్రా.,
 పసుపు - టీ స్పూను; 
జీలకర్ర పొడి - 25 గ్రా.,
 మెంతి పొడి - టేబుల్ స్పూను;
 ఇంగువ - చిటికెడు; 
ఆవాలు, జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్లు

 తయారీ:  
 మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి   

 నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి   

 ఒక  గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు, ఆవ పొడి వేసి బాగా కలపాలి  

 వేరే గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి  

 ఇంగువ కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దించేయాలి   

 నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి (ఇలా చేయడం వల్ల అందులోని పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది)   

 పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి   

 అన్నిముక్కలకూ మసాలా పట్టిన తర్వాత శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూత పెట్టాలి  

 మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు   

Friday, December 12, 2014

చింతకాయ ముడి పచ్చడి /ముడి చింతకాయపచ్చడి / చింతాకాయ తొక్కు


పచ్చి చింత కాయలు – 4 కిలోలు(బాగా కండపట్టి ఉన్నవి, పులుపు ఉన్నవి)
ఉప్పు – 4 కిలో(గడ్డ ఉప్పు లేదా సముద్రపు ఉప్పు లేదా కళ్ళు ఉప్పు)
పసుపు – 50 గ్రాములు
మెంతులు – 50 గ్రాములు
ఆముదం  – 1 గరిటె
1.చింతకాయల్ని కడిగి, ఆరబోసి, బాగా ఆరాక తొడాలు ఈనెలు తీసుకోవాలి.
2.రోట్లో కొంచెంకొంచెంగా చింత కాయలు, ఉప్పు,పసుపు,మెంతులు వేసి కచ్చాపచ్చాగా తొక్కి  ఇలా కచ్చాపచ్చాగా తొక్కిన పచ్చడిని(కొంతమంది తిరగతొక్కేప్పుడే పచ్చట్లో రెండుగెంటెలు ఆముదంపోసి తొక్కుతారు.)  ఆముదం కలిపి జాడీలోకి తీసుకుని పది రోజులు ఊరనివ్వాలి.

3.మొదటిసారి మెత్తగా తొక్కటానికి అవ్వదు కాబట్టి పది రోజుల తర్వాత ఈ ఊరిన పచ్చడిని తీసి మళ్ళా రోట్లోవేసి మెత్తగా అయ్యేవరకు తొక్కాలి(తిరగతొక్కలి).
4.చింతకాయల్లో పీచు చూసి వేరేసుకోని ఇలా మెత్తగా తొక్కుకున్న ముడి చింతకాయపచ్చడిని జాడీలో ఎత్తి పెట్టుకోవాలి.
చింతకాయ ముడి పచ్చడి పచ్చడి రెండేళ్ళైనా అలానే ఉంటుంది.





Tuesday, October 21, 2014

ఇస్టాంట్ టమోటో పికెల్



కావలసిన పదార్థాలు:
 టమోటోలు: 1/2kg 
నూనె: 250 gms
 కారం: 1/2cup 
ఉప్పు: రుచికి సరిపడా
 మెంతులు: 1/2tsp
 ఆవాలు: 3tbsp
 చింతపండు: కొద్దిగా
 వెల్లుల్లి రెబ్బలు: 8-10


తయారీ విధానం

 1. ముందుగా టమోటాల నీటిలో వేసి శుభ్రం చేసి, ప్లేట్ లోనికి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత పొడి బట్టతో తుడిచి తేమను పూర్తిగా తొలగించి, సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
 2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి చితగొట్టి దోరగా వేయించుకోవాలి వెంటనే అందులో టమోటో ముక్కలు, చింతపండును వేయాలి. తక్కువ మంట మీద టమోటోల్లోని తేమంతా పూర్తిగా పోయేదాకా బాగా మగ్గించాలి.
 3. ఇప్పుడు మెంతుల్ని దోరగా వేయించి.. మెత్తగా పొడి చేసుకోవాలి. మెంతి పొడి తనగినంత ఉప్పు కారం, కలిపి మరో ఐదునిమిషాలుంచాలి.
 4. వీటితో టమోటో బాగా గట్టిపడుతూ మగ్గిన తర్వాత దింపే ముందు ఆవపిండి కలిపితే సరిపోతుంది. నోరూరించే ఇస్టాంట్ టమోటో ఊరగాయ రెడీ. ఇది ఒక వారం రోజల పాటు నిల్వ ఉంటుంది. ప్రిజ్ లో పెట్టుకొంటే పదిహేను రోజులు కూడా నిల్వ ఉంటుంది. 

Thursday, October 16, 2014

బుడంకాయ ఆవకాయ

కావలసిన పదార్థాలు

  • బుడంకాయ ముక్కలు. 1 పెద్ద కప్పు,
  • నూనె. 4 టీస్పూ//.
  • కారం. 1 టీస్పూ//.
  • ఉప్పు. 1 టీస్పూ//.
  • ఆవపిండి. 1/4 టీస్పూ//.
  • మెంతిపిండి.1/4 టీస్పూ//.
  • ఇంగువపొడి. 1/4 టీస్పూ//.
  • పసుపు. చిటికెడు

తయారీ విధానం

బుడంకాయలను బాగా కడిగి ఆరబెట్టుకుని ఒక మంచి క్లాత్‌ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి.

ఒక కాయను 10 ముక్కలుగా కట్‌చేసుకోవాలి.

పొడిగిన్నెలో బుడంకాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, నూనె అన్నీ వేసి కలపాలి.
కావలసినవారు మరికాస్త ఉప్పును, వెల్లుల్లినీ వేసుకోవచ్చు.
రెండో రోజుకు ముక్క ఊరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.ఇది ఒక నెల పాటు తాజాగా ఉంటుంది

తెలంగాణా మామిడి ఆవకాయ / అల్లం,వెల్లుల్లి మామిడి ఆవకాయ

కావలసినవి
మామిడికాయలు 10 
 అల్లం 200 గ్రామ్స్
వెల్లుల్లి 200  గ్రామ్స్
 కారం 250 గ్రామ్స్
 జీలకర్ర 50  గ్రామ్స్
 మెంతులు 25  గ్రామ్స్
 నూనె 500  గ్రామ్స్
 ఉప్పు 250 గ్రామ్స్
 ఎండుమిరపకాయలు 5
 ఆవాలు జీలకర్ర 1  స్పూన్ 
   తయారుచేయువిధానం 
మామిడికాయలను శుబ్రం చేసి తడిలేకుండా తుడిచి ముక్కలు కట్ చెయ్యాలి అల్లం,వెల్లుల్లి శుబ్రం చేసి తడిలేకుండా గ్రైండ్ చెయ్యాలి .మెంతులు,జేలకర్ర వేయించి పౌడర్  చెయ్యాలి .అల్లం,వెల్లుల్లి ముద్దలో కారం,ఉప్పు,మెంతిపొడి,జీలకర్రపొడి,మామిడికాయ ముక్కలు కలపాలి .ఒక బాణలి లో నూనె కాచి చల్లారేకపచ్చడిలో కలపాలి చివరగా ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి పోపువేయించి  కలపాలి 

మాగాయ


కావలసినవి
మామిడికాయలు-4
ఉప్పు-ఒక కప్పు
కారం-ఒక కప్పు
పసుపు-రెండు స్పూన్లు
మెంతిపొడి-రెండు టేబుల్‌స్పూన్లు(వేయించి పొడిచేసుకోవాలి)
తయారుచేసే విధానం
మామిడికాయ ముక్కలను నిలువ్ఞగా కోసి ఒక జాడీలో వేసి ఉప్పు, పసుపు వేసి నానబెట్టాలి. ఒకరోజు తరువాత ముక్కలను గట్టిగా పిండితే రసంలా వస్తుంది. ముక్కలను ప్లేటులో వేసి ఎండలో పెట్టుకోవాలి. మంచి ఎండకు త్వరగా ఎండిపోతాయి. ఇలా రెండు మూడు రోజులు ముక్కలను ఎండబెట్టుకోవాలి.
ఎండిన ముక్కలను కొద్దిగా చల్లబడ్డాక రసంలో వేస్తూ ఉండాలి. ఇలా మూడురోజులు చేశాక నాలుగవ రోజు రసంలో ముక్కలు వేసి కారం, మెంతిపొడి వేసి కలుపుకోవాలి. కళాయిలో తగినంత నూనె పోసి పోపు పెట్టుకోవాలి. పోపు వేడి చల్లారాక పచ్చడిలో కలుపుకోవాలి. దీనిని గాలిచొరబడని డబ్బాలో పెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా బెల్లం కలిపితే తీపి మాగాయ అవ్ఞతుంది.  

బెల్లం మామిడి ఆవకాయ

ఆవకాయ కోసం చిత్ర ఫలితం
కావలసినవి
మామిడికాయలు పెద్దవి-10
ఆవాలపొడి-ఒక కప్పు
ఉప్పు- ఒక కప్పు
3 మ్యాంగో కారం-ఒక కప్పు
పసుపు- రెండు టేబుల్‌స్పూన్లు
వెల్లుల్లిపాయలు-4 (తోలు తీసినవి)
మెంతిపొడి- రెండు టేబుల్‌స్పూన్లు (వేయించి పొడి చేసున్నది)
నువ్ఞ్వల నూనె లేదా వేరుశనగ నూనె- ఒక ప్యాకెట్‌
బెల్లం -మూడు కప్పులు
తయారుచేసే విధానం
మామిడి కాయలను బాగా కడిగి ఆరబెట్టుకుని ఒకకాయను 10 ముక్కలుగా కట్‌చేసుకోవాలి. జీడి లేకుండా తీసివేయాలి. కొట్టిన ముక్కలను ఒక మంచి క్లాత్‌ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి.  
ఆ తరువాత జాడీలో కొద్దిగా నూనె వేసి అందులో ముక్కలు, ఆవాలపొడి, ఉప్పు, మ్యాంగోకారం, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలపాలి. వెల్లుల్లిపాయలను పొట్టుతీసి అందులో వేసి బాగా కలపాలి. దీనిని మూడురోజులు కదపకుండా, గాలి పోకుండా గట్టిగా మూతపెట్టి ఉంచాలి. మూడవరోజు ఉప్పు, నూనె సరిపోయిందో లేదో చూసుకోవాలి. బెల్లాన్ని రాయితో మెత్తగా కొట్టుకుని కొద్దిగా నీళ్లుపోసి పాకంలా తయారుచేసుకోవాలి.
బెల్లంలో నీరంతా ఇంకి పాకం గట్టిపడుతున్నపుడు దించి కొద్దిగా వేడిగా ఉండగా ముక్కలను దీనిలో వేయాలి. గాలితగలని జాడీలో దీన్ని భద్రపరచుకోవాలి. ఇది సంవత్సరమంతా ఉంటుంది. ఈ పచ్చడిని ఎక్కువగా ఆంధ్రాలో పెట్టుకుంటారు

కారం లేని నువ్వుల ఆవకాయ

కారం లేని నువ్వుఆవకాయ

కావలసినవి
ఉప్పు-అరకప్పు
నువ్వులపొడి- కప్పు(వేడిచేసి పొడి చేసుకున్నది)
ఆవపిండి-కప్పు
మామిడి ముక్కలు-నాలుగు ముక్కలు
నూనె-రెండు కప్పులు

తయారుచేసే విధానం
ఉప్పు, నువ్వులపొడి, ఆవపిండి, నూనె ఒక గిన్నెలోకి తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. వీటిలో మామిడిముక్కలు వేసి మరొకసారి బాగా కలిపి మూతపెట్టాలి. మూడవ రోజు నుంచి వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. కారం తినలేని వారికి ఈ పచ్చడి మంచిది.

Tuesday, October 14, 2014

మెంతి మామిడికాయ ఆవకాయ

మెంతి మామిడికాయ

కావలసినవి
మామిడికాయలు పెద్దవి-10
ఎండుమిరపకాయలు-పావ్ఞకిలో
పసుపుపొడి-100గ్రా
మెంతులు-100గ్రా
మంచినూనె-అరకిలో
ఇంగువ-100గ్రా
(అవసరమైతే వాడుకోవచ్చు)
ఉప్పు సరిపడినంత
తయారుచేసే విధానం
ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి టెంక లేకుండా ఒక్కొక్కటి ఎనిమిది  లేదా పదహారు ముక్కలుగా తరిగి ఒక బేసిన్‌లో పెట్టుకోవాలి. చిన్నవిగా కూడా చేసుకోవచ్చు.  ఎండు మిరప కాయలను, మెంతులను నూనెలో వేయించి, మెత్తగా పొడిచేసి గిన్నెలో ఉంచుకోవాలి. బాణలిలో నూనె మరిగించి, ఒక గిన్నెలో పోసి ఉంచుకోవాలి. ఉప్పును మెత్తగా పొడిచేసి విడిగా పెట్టుకోవాలి. ఇంగువలను నూనెలో పేలాలవలె వేయించి పొడిచేసి ఉంచుకోవాలి.
ముందుగా ఇంగువను మెంతులు కారప్పొడిలో కలపాలి. ఆ తరువాత నూనె వేసి మిశ్రమంగా చేయాలి. మామిడి ముక్కలను ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఉప్పు, పసుపు, అన్నీవేసి మామిడి కాయ ముక్కలకు అంటుకునేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిరోజులు జాడీలో నిల్వచేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. 

ఆంధ్రా మామిడి ఆవకాయ



కావలసినవి
మామిడికాయలు పెద్దవి-10
ఆవాలపొడి-ఒక కప్పు
ఉప్పు- ఒక కప్పు
3 మ్యాంగో కారం-ఒక కప్పు
పసుపు- రెండు టేబుల్‌స్పూన్లు
వెల్లుల్లిపాయలు-4 (తోలు తీసినవి)
మెంతిపొడి- రెండు టేబుల్‌స్పూన్లు (వేయించి పొడి చేసుకున్నది)
నువ్ఞ్వల నూనె లేదా వేరుశనగ నూనె- ఒక ప్యాకెట్‌

తయారుచేసే విధానం
మామిడికాయలను బాగా కడిగి ఆరబెట్టుకుని ఒక కాయను 10 ముక్కలుగా కట్‌చేసుకోవాలి. జీడి లేకుండా తీసివేయాలి. కొట్టిన ముక్కలను ఒక మంచి క్లాత్‌ తీసుకుని శుభ్రంగా తుడుచుకోవాలి.  ఆ తరువాత జాడీలో కొద్దిగా నూనె వేసి అందులో ముక్కలు, ఆవాల పొడి, ఉప్పు, మ్యాంగోకారం, పసుపు, మెంతిపొడి వేసి బాగా కలపాలి.
వెల్లుల్లిపాయలను పొట్టుతీసి అందులో వేసి బాగా కలపాలి. దీనిని మూడురోజులు కదపకుండా, గాలి పోకుండా గట్టిగా మూతపెట్టి ఉంచాలి. మూడవరోజు ఉప్పు, నూనె సరిపోయిందో లేదో చూసి చాలకుంటే కలుపుకోవాలి.  తెలంగాణా ప్రాంతంలో ఇదే పద్ధతిలో చేసి చివరిలో అల్లం, వెల్లుల్లి ముద్దను కలుపుతారు.