Thursday, June 12, 2014

చాక్లెట్ కేక్

చాక్లెట్ కేక్

కావలసిన వస్తువులు:
మైదా – 1 3/4 కప్పు
కోకో పౌడర్ – 1/4 కప్పు
ఉప్పు – చిటికెడు
తాజా గడ్డ  పెరుగు – 1 కప్పు
పంచదార  పొడి – 1 కప్పు
బేకింగ్ పౌడర్ – 1/2 tsp
వంట సోడా – 1 tsp
రిఫైండ్ నూనె – 1/2 కప్పు
లేదా వెన్న -1/2  కప్పు
వెనిల్లా ఎస్సెన్స్ – 1 tsp
జీడిపప్పు, అక్రోట్లు, బాదాం – 1/2కప్పు
పాలు – అరకప్పు

మైదా , కోకో  పౌడర్, ఉప్పు కలిపి జల్లించాలి. పెరుగులో పంచదార పొడి కలిపి బాగా గిలక్కొట్టాలి. ఇందులో వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. తర్వాత కరిగించిన వెన్న లేదా నూనె, వెనిల్లా ఎస్సెన్స్ కలిపి మరి కొద్ది సేపు గిలక్కొట్టాలి.  జల్లించిన మైదా, సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. పిండి జారుడుగా ఉండడానికి అవసరమైతే కొద్దిగా పాలు కలపాలి. ఒక కేకు టిన్నులో లోపల భాగమంతా వెన్న రాసి ,కొద్దిగా మైదా వేసి మొత్తం గిన్నెకంతా అంటుకునేట్టు కదిపి  కలిపి ఉంచుకున్న కేకు మిశ్రమాన్ని వేసి ముందే వేడి చేసుకున్న ఓవెన్ లో 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 45 – 50 నిమిషాలు బేక్ చేయాలి. రుచికరమైన చాక్లెట్ కేక్ రెడీ అయింది. మీకు కావాలంటే ,ఓపిక ఉంటే ఐసింగ్ చేసుకోండి లేదంటే అలాగే ముక్కలు చేసి సర్వ్ చేయండి..

No comments:

Post a Comment