Saturday, May 3, 2014

జింజర్ టీ అండ్ కోకోనట్ సూప్

జింజర్ టీ అండ్ కోకోనట్ సూప్
Ginger
కావలసిన పదార్థాలు :
టెట్లీ జింజర్ లెమన్ టీ పొడి 
- 3 బ్యాగులు
నూనె - ఒక స్పూన్
ఉల్లిగడ్డ - 1
వెల్లుల్లిపాయ - 2 రెబ్బలు
అల్లం ముక్క - ఒకటి
గరం మసాలా - ఒక స్పూన్
జీలకర్ర - ఒక టీ స్పూన్
తెల్ల మిరియాల పొడి 
- పావు టీ స్పూన్
స్వీట్ పొటాటో - 4
కొబ్బరి పాలు - 300మి.లీ. 
కఫీర్ లైమ్ లీవ్స్ - 3
స్వీట్ చిల్లీ సాస్ 
- ఒక స్పూన్
సోయాసాస్ - 1 1/2 టీ స్పూన్
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
రెండు కప్పుల నీటిని వేడి చేసి అందులో జింజర్ లెమన్ టీ పొడి బ్యాగులను వేసి ఓ పదినిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వాటిని తీసేయాలి. ఒక కడాయిలో నూనె వేసి ఉల్లిగడ్డలు బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాలి. దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం, గరం మసాలా, జీలకర్ర, తెల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాలపాటు కలపాలి. ఆ తర్వాత స్వీట్ పొటాటోలను వేసి బాగా కలపాలి. బాగా వేగాక టీ మిశ్రమం, కొబ్బరి పాలు పోసి ఉడికించాలి. సన్నని మంట మీద ఉంచి కఫీర్ లైమ్ లీవ్స్, స్వీట్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి 20నిమిషాల పాటు ఉడకనివ్వాలి. స్వీట్ పొటాటోలు మెత్తగా ఉడికిన తర్వాత దించి ప్యూరీలా చేసి మరికాసేపు ఉడికించాలి. ఆ ప్యూరీని తీసేసి సూప్‌ని కాసేపు వేడి చేసి దించేయాలి. వేడి.. వేడి.. జింజర్ టీ అండ్ కోకోనట్ సూప్ సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది. 

No comments:

Post a Comment