Saturday, December 13, 2014

చింతకాయ పచ్చడి


కావలసిన పదార్థాలు :
చింతకాయముడి పచ్చడి ..సుమారు పావు కేజీ
పచ్చిమిర్చి.. 75 గ్రా.
తాజా కొత్తిమీర.. ఒక కట్ట
జీలకర్ర.. ఒక టీ.
ధనియాలు.. 2 టీ.
వెల్లుల్లి.. ఒక టీ.
అల్లం.. చిన్న ముక్క
ఎండుమిర్చి.. మూడు
ఆవాలు.. కాసిన్ని

తయారీ విధానం :

 పచ్చిమిర్చిని వేయించి.. చల్లారాక పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, చింతకాయముడి పచ్చడి, కొత్తిమీరలను కలిపి మెత్తగా రుబ్బాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర... అన్నీ వేసి తాలింపు చేసి పచ్చడిలో కలపాలి. చింతకాయముడి పచ్చడి బదులు చింతపండు, పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా కారం వేసి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. అంతే నోరూరించే చింతకాయ పచ్చడి సిద్ధమైనట్లే..!

No comments:

Post a Comment