Saturday, December 13, 2014

వాము ఆకులు పచ్చడి

వాము ఆకులు దీనితో పచ్చడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది.

వాము ఆకులు - సుమారు పావు కేజీ
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
వెల్లుల్లి రేకులు – 4
ఎండుమిరపకాయలు – 3-4 (తినేకారాన్ని బట్టి)
చింతపండు – కొద్దిగా


1.పొయ్యి వెలిగించి బాణలిలో కొద్దిగా నూనె వేసి శనగపప్పు,మినప్పప్పు,ధనియాలు,జీలకర్ర వేయించుకోవాలి.
2.ఇవన్నీవేగాక ఎండుమిరపకాయలు,వెల్లుల్లి వేసి వేయించుకోవాలి.
3.తరువాత శుభ్రం చేసుకున్న వాము ఆకులు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి.
4.అన్నీ చల్లారాక ముందుగా శనగపప్పు,మినప్పప్పు,ధనియాలు,జీలకర్ర,ఎండుమిరపకాయలు,వెల్లుల్లి,చింతపండు వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి.
5.ఇందులోనే మగ్గిన వాము ఆకులు,ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి.చివరగా పోపు వేసుకుంటే వాము ఆకులు పచ్చడి తయారైనట్టే.

No comments:

Post a Comment