Wednesday, July 2, 2014

చిరోటి రవ్వతో పూర్ణం బొబ్బట్లు

చిరోటి రవ్వతో పూర్ణం బొబ్బట్లు ఉగాది స్పెషల్

కావలసిన పదార్థాలు : 
చిరోటిరవ్వ: 2cups 
కందిపప్పు ఉడికించినది: 2cups 
పంచదార/లేదా బెల్లం తురుము: 3cups 
మైదా: 3cups 
సోడా: చిటికెడు
 గోధుమపిండి: 1cup 
నెయ్యి: 1tsp 
నూనె లేదా నెయ్యి: 1cup 

తయారు చేయు విధానం : 
1. మైదా, గోధుమపిండిలను కలపాలి. దాంట్లో తగినన్ని నీళ్లుపోసి, వంటసోడా వేసి పూరీపిండిలాగా కలిపి మూతపెట్టి ఉంచాలి. 
2. తర్వాత పాన్ లో నెయ్యివేసి చిరోటి రవ్వను వేసి దోరగా వేయించుకోవాలి. అడుగు మందంగా ఉండే ఓ గిన్నెలో మూడు కప్పుల నీటిని పోసి స్టవ్‌ పై పెట్టాలి. 
3. ఇప్పుడు నీరు మరుగుతుండగా వేయించిన రవ్వను వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రవ్వ ఉడికాక దాంట్లో పంచదార, యాలకులపొడి వేసి కలియబెట్టాలి. 
4. ఇది పూర్ణం చేసేందుకు అనువుగా తయారైన తరువాత దించేసి అందులో ఉడికించి గ్రైండ్ చేసిన కందిపప్పు, ఉడికించిన రవ్వ రెండూ మిక్స్ చేసి నిమ్మకాయంత సైజులో ఉండలు చేసుకోవాలి. 
5. ఇప్పుడు మైదాపిండిని చిన్న సైజు పూరీల్లాగా వత్తి, వాటి మధ్యలో పూర్ణంరవ్వ పూర్ణాన్ని పెట్టి మూసివేసి, దాన్ని చేత్తో బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి. వీటిని పెనంపై నూనె లేదా నెయ్యివేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి చిరోటి రవ్వ బొబ్బట్లు రెడీ ...!

No comments:

Post a Comment