Wednesday, September 3, 2014

గవ్వలు


కావలసిన వస్తువులు: 

మైదా-500గ్రా., బొంబాయిరవ్వ-100గ్రా. నెయ్యి-120గ్రా., చక్కెర-150గ్రా., గుడ్డు-1, యాలకులు-5గ్రా, బేకింగ్‌ పౌడర్‌- చిటికెడు, రిఫైన్డ్‌ ఆయిల్‌- వేయించడానికి తగినంత.
తయారు చేసే విధానం:
కోడిగుడ్డు సొనను ఒక గిన్నెలో పోసి స్పూన్‌తో బాగా కలియతిప్పి అందులో చక్కెర కూడా వేసి పూర్తిగా కరగనివ్వాలి. అవసరమైతే ఒక కప్పు నీళ్లు కూడా చేర్చండి. అందులో యాలకుల పొడిని కూడా కలివి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మైదాలో బేకింగ్‌ సొడా కలివి జల్లించి బొంబాయి రవ్వ, నెయ్యి కూడా చేర్చి చేత్తో మెత్తగా కలపండి. దీనికి కోడిగుడ్డు మిశ్రమాన్ని చేర్చి గట్టిగా పూరీల విండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచండి. గవ్వల చెక్కెపై బొటన వేలితో విండిని గట్టిగా అదుముతూ వేలును కిందికి జరపాలి. విండి చుట్టుకొని - గవ్వ తయారవుతుంది. తయా రైన గవ్వలను స్టౌమీద కాగుతు న్న ననెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. 

No comments:

Post a Comment