Wednesday, July 2, 2014

క్యారట్ బూరెలు

పండుగలల్లో మన తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మామిడితోరణాలూ, పచ్చిమామిడికాయలూ, పిండివంటలతో పాటూ ఉగాదిపచ్చడితో అన్ని లోగిళ్లూ ఘుమఘుమలాడిపోతాయి. బొబ్బర్లు, పూర్ణాలు, పలహారలతో ప్రత్యేమైన వంటకాలు ఉగాది రోజే చేస్తారు. ఈ ఉగాదికి మీకోసం...
క్యారెట్ పూర్ణాలు-ఉగాది స్ఫెషల్
 కావలసిన పదార్థాలు: 
క్యారట్ తురుము: 2 cup
పంచదార: 11/2 cup
పాలు: 1cup 
నెయ్యి: 2 
బాదం, ద్రాక్ష, జీడిపప్పు: 1/2 teaspoon
పూతపిండికి 
మినపప్పు: 1 cup
బియ్యంపిండి: 2 cup
ఉప్పు: చిటికెడు
 నూనె: వేయించడానికి సరిపడా 

తయారు చేసే విధానం: 
1. బియ్యంపిండిని కొంచెం నీటితో ముద్దగా కలుపుకోవాలి. 
2. మినపప్పు రెండు గంటలు పాటు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకుని తడిపిన బియ్యంపిండిలో వేసి తగినంత ఉప్పు కలిప ఒక గంట నాననివ్వాలి. (బియ్యపు పిండి, మినపప్పు మిశ్రమం ఇష్టపడని వారు..మైదా, చిటికెడు ఉప్పు, నీళ్ళు జాగురు గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి). 
3. తర్వాత పాన్ లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, బాదం, ద్రాక్ష, వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి 
4. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి క్యారెట్ తురుము వేసి వేయించి పాలు పోసి ఉడికించాలి. పాలు ఇగిరిన తర్వాత పంచదార వేసి అది కరిగి మళ్లీబాగా దగ్గరయ్యే వరకు ఉడికించాలి. 
5.. క్యారెట్ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండుగా చేసుకోవాలి. ఈ ఉండలను రెడీగా ఉన్న పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే రుచికరమైన క్యారట్ బూరెలు రెడీ...

No comments:

Post a Comment