Wednesday, July 2, 2014

కొబ్బరి బొబ్బట్ల


కోకోనట్ పోలీలు(కొబ్బరి పోలీలు): ఉగాది స్పెషల్
కావల్సిన పదార్థాలు: 
మైదా: 2cups 
చిరోటి రవ్వ: 3tbsp 
పసుపు: చిటికెడు(అవసరంఅయితేనే) 
బెల్లం తురుము: 1 ½ cup 
కొబ్బరి తురుము : 2 cup(సన్నగా తురిమినిది) 
యాలకులు: 2-3 (పౌడర్ చేసుకోవాలి) 
నెయ్యి: 2tbsp 
నీళ్ళు: మైదాపిండి కలుపుకోవడానికి సరిపడా

 తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైద, చిరోటి రవ్వ, రెండు టేబుల్ స్పూన్ల నూనె, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి, సరిపడా నీళ్ళు పోసి పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. కలుపు కొన్న తర్వాత అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. 
2. అంతలోపు, అరకప్పు నీటిని డీప్ బాటమ్ పాన్ లో పోసి, బెల్లం తురుము వేసి మీడియం మంట మీద కరిగే వరకూ ఉడికించుకోవాలి. మద్యమ్యదలో కలియబెడుతూ, బెల్లం చిక్కగా పాకంలా తయారయ్యే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి. 
3. ఇప్పుడు అందులో ముందుగా తురిము పెట్టుకొన్నపచ్చికొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ, కొబ్బరిబెల్లంపాకం గడ్డిపడే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. 
4. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న మైదా పిండిని నుండి కొద్దిగా కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కొక్క ఉండను అరచేతిలో పెట్టుకొని మద్యలో కొద్దిగా లోతుగా వత్తి అందులో కొబ్బరి పాకం మిశ్రమాన్ని ఉండలా చేసి పెట్టి, అన్ని వైపులా కవర్ చేయాలి
. 5. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి రాసి స్టఫ్ చేసిన మైదా బాల్ ను ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి నిధానంగా చపాతీలా చేత్తోనే వత్తుకోవాలి. 
6. ఇలాకొన్నింటిని తయారుచేసి పెట్టుకోవాలి. 
7. తర్వాత స్టౌ మీద వెడల్పాటి పాన్ పెట్టి, నెయ్యి రాసి వేడయ్యాక కొబ్బరి పూర్ణం పోలీలను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే కోకోనట్ పూర్ణం పోలి తినడానికి రెడీ. ఈ ఉగాది స్వీట్ డిష్ ను వేడి వేడిగా సర్వ్ చేయండి.

No comments:

Post a Comment