Wednesday, September 3, 2014

కుర్‌ కుర్‌ ఆలూ


కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి : 250గ్రా
బంగాళా దుంపలు : 125 గ్రా
వనస్పతి : 25 గ్రా
తెల్లనువ్వులు : ఒక టీ స్పూను
కారం : ఒక టీస్పూను
ఉప్పు : ఒక టీ స్పూను 
నూనె : తగినంత
తయారు చేసే విధానం: 
బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి, తోలుతీసి మెత్తగా మెదిపి ఉంచాలి. ఒక లో తైన పళ్లెంలో నూనె తప్ప పైన చెప్పుకున్న ఇతర పదా ర్థాలన్నింటినీ, బంగాళాదుంప గుజ్జునీ కలిపి తగినంత నీరు పోస్తూ గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. జంతికల గొ ట్టంలో రిబ్బన్‌ ఆకారంలో ఉండే ప్లేట్ను అమర్చి ఈ మిశ్ర మాన్ని నింపాలి. నూనె బాగా కాగుతుండగా జంతికల గొట్టాన్ని అదుముతూ పిండిని నూనెలో వదలాలి. అలా వేసిన మురుకులు దోరగా వేగిన తరువాత న్యూస్‌ పేపర్‌పై వేయాలి. అంతే కుర్‌ కుర్‌ ఆలూ తయారైనట్లే..! బాగా ఆరిన తరువాత గాలిదూరని డబ్బాలో భద్రపరచినట్లయితే, 15 రోజులదాకా నిల్వ ఉంటాయి.

No comments:

Post a Comment