Monday, April 28, 2014

బ్రెడ్ బజ్జీ

Bread Variety



సడన్ గా మీ ఇంటికెవరైన వస్తే ??

ఎండిపోయిన బ్రెడ్ ముక్కల్ని పారేయక కాస్త వేడినీటిలో వేసి
ఒక రెండు నిముషాలు వుంచండి.బ్రెడ్ ముక్కలు మెత్త పడ్డక
అందులో కొద్దిగ బియ్యంపిండికాని,మైదా పిండికాని వుంటే
కలిపి,ఆ కలిపిన పిండి లో పచ్చిమిర్చి,ఆనియన్,కరేపాక్,వేసి
అన్నీ బాగా మిక్స్ చేసి బజ్జీలమాదిరిగా వేసుకోవచ్చు
 


కరకరలాడుతూ భలే రుచిగా వుంటుంది.

వచ్చిన వారికి coffee తో పాటు మాంచి స్నాక్స్ ఇచ్చినట్లు వుంటుంది

కాలిఫ్లవర్ మంచురియా

కాలిఫ్లవర్ మంచురియా



!! కావలసినవి !!

కాలిఫ్లవర్ 1

{చిన్న చిన్న పువ్వులుగా కట్ చేసి పెట్టుకోవాలి }

ఆనియన్స్.................. 2
అల్లం వెల్లుల్లి పేస్టు........2 టేబల్ స్పూన్స్
కారం...........................2 టేబల్ స్పూన్స్
పసుపు చిటికెడు................................
ఉప్పు తగినంత..................................
పచ్చిమిర్చి పేస్టు...........3 టేబల్ స్పూన్స్
కొత్తిమెర.......................1/2 కట్ట
రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు...........................
సొయా సాస్..................2 టేబల్ స్పూన్స్
కార్న్ ఫ్లోర్.....................2 టేబల్ స్పూన్స్
{1 1/2 టేబల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ నీ నీళ్ళలో కలిపి వుంచాలి }
గోధుమ పిండి...............1 టెబల్ స్పూన్
బియ్యం పిండి...............1/2 చుప్
బేకింగ్ పౌడర్................1/2 టేబల్ స్పూన్
నిమ్మకాయ జూసు.........2 టేబల్ స్పూన్స్
నునె వేయించడానికి........

తయారు చేసే విధానం::

ఒక గిన్నెలో గొధుమ పిండి, బియ్యం పిండి, 1/2 టేబల్ స్పూన్ కార్న్ ఫ్లోర్,
బేకింగ్ పౌడర్, ఉప్పు, 1 టేబల్ స్పూన్ సోయా సాస్,
1 టేబల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబల్ స్పూన్ కారం, పసుపు,
1 టేబల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్టు, కొంచెం నీళ్ళు పోసి వేసి అన్ని కలుపుకోవాలి.

ఇప్పుడు కాలిఫ్లవర్ పువ్వులుగా కట్ చేసినవి ఇందులో వేసి కలపాలి.

పాన్ లో నునె నీ వేడి చేసి అందులో ఈ కాలిఫ్లవర్ పువ్వులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్ లో 3 టేబల్ స్పూన్స్ నునె వేసి అందులొ ఆనియన్ ముక్కలు వేసి వేయించాలి.

కొంచెం వేయించాక 1 టేబల్ స్పూన్ అల్లుం వెల్లుల్లి పేస్టు, 2 టేబల్ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్టు,
1 టేబల్ స్పూన్ కారం వేసి వేయించాలి.

అందులో 1 టేబల్ స్పూన్ సోయా సాస్ వేసి వేయించాలి.

ఇప్పుడు ష్టవ్ కాస్త మంటను తగ్గించి దానిలో ముందుగా నీళ్ళలో కలిపి వుంచుకున్న కార్న్ ఫ్లోర్ నీ,
రెడ్ ఫుడ్ కలర్ ని వేసి బాగా కలుపుకోవాలి.

అది అలా కలిపాక కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు కొత్తిమెర వేసి కలపాలి.
అందులో కాలిఫ్లవర్, నిమ్మజూసునీ వేసి కలపాలి.

పన్నీరు -- బ్రెడ్ వడలు

పన్నీరు -- బ్రెడ్ తో ఐటం(Bread & Paneer)



పన్నీరు -- బ్రెడ్ తో ఐటం

మీ ఇంట్లో పన్నీరు,మిగిలిపోయిన బ్రెడ్ వుంటే

వాటిని 3 నిముషాలు కాస్త వేడి నీటిలో వుంచి

తీసి మెత్తగ చేసి వుంచండి.అందులో 2 స్పూన్స్

మైదా,పచ్చిమిర్చి,కరేపాకు,కొత్తమిర,

ఆనియన్స్ సన్నటి ముక్కలు చేసి వేసి వడలుగా

నూనేలో వేయించి,coffee తో సర్వ్ చేయండి.

10 నిముషాల్లో అయ్యే ఈ ఐటం భలే రుచిగా వుంటుంది

కాబేజి రోల్స్

కాబేజి రోల్స్

!!!! కావలసినవి !!!!

కాబేజి.................1/4
మొక్కజొన్నపిండి.....10 గ్రాములు
కారెట్స్....................1/4
బియ్యం పిండి..........1/4 కప్
నూనె తగినంత..................

చేసే విధానము::

కాబేజీ , కారెట్ లను కొబ్బరిలాగా తురుమాలి .
పచ్చిమిర్చిని , ఉప్పు , మొక్కజొన్న పిండిని కలపాలి .
దీనిని ముద్దగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి .
మూకుడు లో నూనె వేసి నూనె లో దోరగా వేయించాలి
అంటే దోరగా గోల్డెన్ కలర్ వచ్చెంత వరకు వేయించీ
సాస్ తో గాని చిట్ని తో గాని సర్వ్ చేయండీ

ఆలూ చిప్స్ recipe (అధిక బరువుకు విరుగుడు ఆలూ చిప్స్‌)

ఆలూ చిప్స్

పొటాలో ప్రియులకు ఓ శుభవార్త. బంగాళాదుంపతో తయారు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువు పెరుగుతారంటూ ఇప్పటివరకూ ఉన్న ప్రచారం తప్పు అని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పొటాటోతో చేసే చిప్స్‌ వంటి చిరు తిల్లు తినడం ద్వారా ఊబకాయ సమస్య తలెత్తుతాయని భావిస్తున్నారా అలాంటిదేమీ లేదని కొత్తస్టడీ తేల్చేసింది. బరువు తగ్గేందుకు బంగాళాదుంపలను తీసుకోవడం ఆపేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బంగాళాదుంపలు సైతం కెలోరీల శాతాన్ని తగ్గిస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలీఫోర్నియా నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. బంగాళా దుంపలతో ఆరోగ్యానికి మేలేనని, బరువు తగ్గించే ప్రక్రియలోనూ బంగాళదుంపలు ఉపయోగపడుతాయి. దాదాపు 12 వారాల పాటు భారీ బరువుగల మహిళలు,పురుషులపై జరిపిన పరిశోధనలో బంగాళాదుంపలను తీసుకోవడం ద్వారా కెలోరీల శాతం తగ్గుముఖం పట్టడం, రక్తంలో సుగర్‌ లెవల్స్‌, కార్బోహైడ్రేట్లను నియంత్రిస్తున్నట్లు తెలియవచ్చింది. ఒక బంగాళాదుంపలో 110 కెలోరీలు, పొటాషియం 620 గ్రాములున్నట్టు గుర్తించారు. 
ఆలూ ----------------------1 కిలో , 
నూనె ----------------------300 గ్రా 
జీరా -----------------------1 టీ స్పూన్ , 
ఉప్పు--------------------- 1 టీ స్పూన్ , 
కారం -------------------- 1 టీ స్పూన్
ఆం చూర్ పోడి------------- 1 టీ స్పూన్ .
చేసే విధానం::

ఆలు బాగా కడిగి పొట్టు తీసి పలుచగా ఆలు చిప్$స్ కొట్టే పీటపై కొట్టాలి ఆలు చిప్$స్ ఒక పొడి బట్టపై వేసి, ఆరిన తరువాత , బాండీలో నూనె వేడి చేసి , బాగా వేడి అయిన తరువాత , ఆరిన చిప్$స్ పచ్చివి బాండిలో కొన్నివేసి వేయించి జల్లిగరిటతో తీసి పేపర్ పై వేయాలి . అలా అన్ని చిప్$స్ వేయించుకొని తీసి , మళ్ళీ 5 నిముషాల తరువాత నూనె వేడి చేసి చిప్$స్ ఎర్రగా వేయించాలి , అప్పుడు బేసిన్ లో తీసి , ఉప్పు , కారం , జీరా , ఆం చూర్ ,పొడి కలిపి తింటే చాలా బాగుంటాయి . రెండుసార్లు వేయించడం వలన చాలా కరకరలాడుతాయి . చల్లార్చి ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెడితే చాలా రోజులు నిల్వ ఉంటాయి :)

ఆలూ పరాఠా

ఆలూ పరాఠా.... Alu parota


చేసే విధానం::

బంగాళదుంపలు-------------- 3
గోధుమపిండి----------------- 3 cups
మైదా----------------------- 1 cup
జీలకర్ర---------------------- 1 tsp
కారంపొడి------------------- 1 tsp
గరంమసాలా---------------- 1/2 tsp
కొత్తిమిర-------------------- 2 tsp
కరివేపాకు------------------ 1 tsp
ఉప్ప----------------------- 1/2 tsp
నూనె-----------------------50 ml
పెరుగు--------------------- 3 tbsp
పసుపు-------------------- 1/4 tsp

చేసే విధానం::
పొటాటో మెత్తగా ఉడికించి పొట్టు తీసి పొడి పొడిగా చేసుకోవాలి.
గోధుమ పిండి లో మైదా,కారంపొడి,జీలకర్ర,గరం మసాలా,
సన్నగా తరిగిన కరివేపాకు,కొత్తిమిర,పెరుగు ,
పొటాటో పొడి ,పసుపువేసి బాగా కలియబెట్టి
తగిన నీరు పోసి చపాతీ పిండిలా కలిపి అరగంట పక్కనపెట్తుకోవాలి.

తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకొని
చపాతీల్లా వత్తి వేడి పెనంపై నూనెతో రెండు వైపులా ఎర్రగా కాలుచుకోవాలి.
ఘుమ ఘుమ లాడే వేడి వేడి పరోటా తయార్

1 minute మూంగ్‌దాల్ chaat

Moong Dal Chaat



సడన్ గా మీ ఇంటికి ఎవరైన వచ్చారనుకొండి?
ఏదో ఒకటి పెట్టి పంపకుండగా మనం వుండలేము
కాని ఏమి చేయాలన్నదే పెద్ద సమస్య :(

అలాంటప్పుడు ఈ చిట్కాలని వాడుకోండి.
1)మీ ఇంటిలో హల్దీరాం వారి మూంగ్‌దాల్ పాకెట్ ష్టక్ వుంచుకోండి.

2)మూంగ్‌దాల్ ల్లో సన్నగా తరిగిన ఆనియన్,పచ్చిమిర్చి,
కరేపాక్,కొత్తమిర,వేసి అన్నీ బాగా కలిపి coffee తో పాటు
ఈ మూంగ్‌దాల్ ఇస్తే....ఆహా ఏమిరుచి అనుకొంటూ సంతోషంగా ఆరగిస్తారు

Sunday, April 27, 2014

బ్రెడ్ ఉప్మా

బ్రెడ్ ఉప్మా


కావలసినవి::

బ్రెడ్.........................8 స్లైసులు 
ఉల్లిపాయలు............1 
టొమాటో................2 
పచ్చిమిర్చి.............3 
ఆవాలు.................1/4 టీస్పూన్ 
జీలకర్ర..................1/4 టీస్పూన్ 
మినప్పప్పు..........1/4 తీస్పూన్ 
కరివేపాకు.............1 టీస్పూన్ 
పసుపు..............--1/4 టీస్పూన్ 
ఉప్పు తగినంత.................. 
నూనె...................2 టీస్పూన్స్ 


చేసే విధానం::

బ్రెడ్ ను చిన్న చదరపు ముక్కలుగ చేసి పెట్టుకోవాలి.కావాలంటె
ఈ ముక్కలను నూనెలో కాని టోస్టర్లో కాని ఎర్రగా కాల్చి పెట్టుకోవచ్చు.

ఆనియన్,పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె వేడి చేసి
ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు,కరివేపాకు వేసి కొద్దిగా వేపి తరిగిన ఆనియన్
పచ్చిమిర్చి,పసుపు వేసి వేయించాలి.

ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్ని
బాగా కలిపి మూత పెట్టాలి.ఓ మూడు నిమిషాల తర్వాత కొత్తిమిర చల్లి దించేయండి.

సమోసా

వెజిటబుల్ సమోసా



కావలసినవి ::--

సమోసా తయారి ::-
మైదా --------------------- 1 cup
నెయ్యి --------------------- 1/2 cup 
బేకింగ్ పౌడర్ --------------- 1/4 tbl spoon
ఉప్పు - తగినంత
నీళ్ళు 

కూర తయారికి ::--
బంగాలదుంపలు - 3( వుడికించిన బంగాలదుంపల్ని పొట్టు తిసేసి దానిని చేతితో చిదిపెయ్యాలి).
ఉలిపాయాలు - 1 ( ముక్కలు)
పచ్చి బఠానీలు ------------------------1 cup
పచ్చిమిరపకాయలు --------------------2
కొత్తిమెర చాప్ చేసింది------------------- 1 టేబల్ స్పూన్
నిమ్మ జూసు ---------------------------- 2 tbl spoon
పసుపు -------------------------------- 1/2 tbl spoon
గరం మసాల ---------------------------- 1/2 tbl spoon
కారం ----------------------------------- 1 tbl spoon
ఆవాలు --------------------------------- 2 tbl spoons
అల్లం వెల్లుల్లి పేస్టు----------------------- - 1 tbl spoon
ఉప్పు - తగినంత
నునె - వేయించడానికి
కరివేపాకు -------------------------------- 2 రెబ్బలు

తయారు చేసే విధానం ::--

మైదా లో ఉప్పు,బేకింగ్ పౌడర్, నెయ్యి వేసి కలుపుకోవాలి.
కొంచెం నీళ్ళు పోసి చాలా మెత్తగా కలుపుకోవాలి. 
కలిపిన పిండి ని 30 నిమషాలు పాటు తడిబట్టతో పెట్టి వుంచాలి.

కూర విధానం ::--

ఒక పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి. 
అందులో ఆవాలు, కరివేపాకు ,వేసి వేయించాలి. 
అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. 
ఇప్పుడు పచ్చిబఠానిలు,అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల,కొత్తిమెర,కారం, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
కొంచెం వేయించాక అందులో బంగాలదుంపను వేసి వేయించాలి.
అందులో నిమ్మ జూసు వేసి కలుపుకోవాలి.
కలిపేసి పెట్టుకున్న మైదా ని మళ్ళీ బాగా కలుపుకోవాలి.
చపాతీ పిండిని నిమ్మకాయ సైజులో తీసుకునిచపాతీలా చేసి 
వాటిని సగానికి కట్ చేసి సగభాగాల మధ్యలో కూర మిశ్రమాన్ని పెట్టి త్రికోణపు ఆకారంలో మడవాలి.
అంచులు గట్టిగ వత్తలి. వాటిని కాగిన నూనెలో ఎర్రగా వేయించాలి. 
సమొసా నీ టొమటో సాస్ తో తింటే బాగుంటుంది.