Saturday, April 26, 2014

సోన్ పపాడి

సోన్ పపాడి కావలసిన పదార్థాలు:

శెనగ పిండి: 2cups
మైదా: 2cups
పంచదార: 3cups
నెయ్యి: 250grms
నీళ్లు: 2cups
పాలు: 2tbsp
యాలకులు పొడి : 1/2tsp
బాదం, గుమ్మడి గింజలు, కర్బూజ గింజలు(లోపలి తెలుపుగింజలు)(2tsp)

సోన్ పపాడి తయారు చేయు విధానం:


ముందుగా ఒక గిన్నెలోకి శెనగపిండి, మైదా పిండిని తీసుకొని రెండింటినీ బాగా మిక్స్ చేయాలిఇప్పుడు ఒక సాస్ పాన్ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులో శెనగపిండి, మైదాపిండి మిశ్రమాన్ని వేసి, తక్కువ మంట మీద వేయించుకోవాలి. పిండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలిపిండి చల్లారేంతలోపు పంచదార పాకం(సుగర్ సిరప్)తయారు చేసుకోవాలి. రెండు కప్పుళ నీళ్ళు, పాలు, పంచాదార వేసి తక్కువ మంటమీద పంచదార పాకం చిక్కబడేంత వరకూ కలుపుతూ సిరప్ ను తయారు చేసుకొంటాం. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పిండిని పోసి, సన్నిని ఒక గరిటతో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయంగా మిశ్రం దారం వంటి రేకులను(పోగుపోగుగా) ఏర్పరుస్తూ గట్టిపడుతుంది మిశ్రమాన్ని ఒక ఇంచ్ మంద ఉన్న గిన్నె లేదా ప్లేట్ పోసి, వేడి మీదనే యాలకుల పొడి, బాదం, గుమ్మడి, కర్బూజ గింజలను గార్నిష్ చేసుకోవాలి పదార్థాం చల్లబడిన తర్వాత చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. అంతే సోన్ పప్పిడి రెడీ. దీని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వచేసుకోవచ్చు.

No comments:

Post a Comment