Sunday, April 27, 2014

పాల చాక్లెట్

పాల చాక్లెట్ కావల్సిన పదార్థాలు :


పాలు - కప్పు
పెరుగు - కప్పు
పంచదార - కప్పు
నెయ్యి - చెంచా
యాలకులపొడి - కొద్దిగా.

పాల చాక్లెట్ తయారీ విధానం : 

ఒక గిన్నెలో పాలు తీసుకొని బాగా మరిగించాలి. తరువాత పంచదార, పెరుగు, యాలకులపొడి ఒకదాని తరువాత ఒకటి వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా వచ్చిన తరువాత నెయ్యి చేర్చి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వేడి తగ్గాక మిశ్రమాన్ని బిళ్లల్లా చేసుకోవాలి. అంతే.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే పాల చాక్లెట్ రెడీ. ఇది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.

No comments:

Post a Comment